అమరావతి నగర పొలిమేరలలోని అరణ్యంలో వేసవి కాలం కారణంగా నీరు లభించకపోవడంతో అడవి లోని జంతువులు అన్ని కృష్ణానదితీరం ఎగువప్రాంతానికి తరలి వెళ్ళసాగాయి .అలాకొంతదూరం ప్రయాణంచేసాక "ఏనుగు తాతా ప్రయాణ బడలిక తెలియకుండా ఏదైనా ఒకథ చెప్పు"అన్నాడు నక్కమామ."ఒహో ఏనుగుతాత మంచికధ చెప్పబోతున్నాడు ,అందరు ఆమర్రిచెట్టు కింద చేరండి"అనిఓండ్రపెట్టాడు గాడిదఅన్న.అన్నిజంతువులు సమావేశం అయిన అనంతరం"శ్రధ్ధగావినండి నాచిన్నతనంలో మాఅమ్మ నన్ను పులి మామ పెళ్ళికి తీసుకువెళ్ళింది"అందిఏనుగు."వేసారా లడ్డు బందరు భోజనం ఆపెళ్ళిలో"అందిపిల్లరామచిలుక.దానిభాషఅర్ధంకానిజంతువులు గుర్రుగాచూసాయి. "తప్పు పదాలు అలామార్చిమాట్లాడకూడదు, ఆపెళ్ళిభోజనంలో బందరులడ్డు వేసారా అనాలి "అందితల్లిరామచిలుక. "అలాపెళ్ళివారియింటివద్దకు చేరిననేను సాటి పిల్లజంతువులతొకలసి ఆడు కోసాగాను".యింతలో వచ్చిన పిల్లి అన్న"ఏరామామ పెళ్ళికూతురువాళ్ళది ఏఅడవి "అంటూ పులిమామదగ్గరకు వెళ్ళాడు,ఏయ్ పెద్దాచిన్నా తెలియడంలేదా నేను పులిని"అన్నాడు పెళ్ళికొడుకు."చాల్లేవయ్య పెళ్ళికిముందు నేనూ పులినే,సర్లే పెండ్లిలో వంటకాలు ఏమిటో "ఏమోయ్ కుందేలు నీవంటలు వాసనఎక్కువ రుచి తక్కువ ఏపదార్దాలుచేస్తున్నావు"అన్నాడు.నడుముకు బిగించి ఉన్న తుండు గుడ్డతో ముఖంతుడుచుకూంటూ"అయ్య క్యారెట్ హల్వా,బంగాళదుంపలకుర్మ ,మునగ,ముల్లంగి సాంబారు,అన్నికాయగూరలతో దప్పళం, అప్పళం,గోంగూర, వెదురుబియ్యంఅన్నం, అన్నిరకాల పళ్ళరసాలు ,కాకినాడకాజాలు,తాపేశ్వరం పూతరేకు ,ఒకటేమిటి యింకా..పెళ్ళియింటకలకలం రేగింది. "పెళ్ళికుమార్తే నగలు కనిపించటంలేదట"అన్నారు ఎవరో,అందరు పులిగుహచేరి పరిశీలించసాగారు.ఆగుహలోనికి గాలి వెలుతురువచ్చే రధ్రంలోనుండి నగలు దొంగిలించబడ్డాయని నిర్ణాయానికి వచ్చారు .అప్పుడే చెమటలు కక్కుతూ వేగంగా వచ్చినకోతిబావను చూసిన పులిమామ "నిజంచెప్పు ఆనగలు దొంగిలించింది నువ్వేకదూ"అన్నాడు కోపంగా.మన్నించండి పేదవాడిని వచ్చేమాసం మా అమ్మయి పెళ్ళి అందుకని"అనినసిగాడు.వెళ్ళినగలు తీసుకురా"అన్నాడు పులిమామ.క్షణాలలో నగలమూటతో వచ్చాడు కోతిబావ."కోతిబావ యితరుల ఆహరంకాని,సోత్తు కాని దొంగిలించడం పెద్దతప్పు,మనం మన అవసరాలకు ఎలా దాచుకుంటామో ,ఎదటి వారుకూడా అలానే దాచుకుంటారు.దొంగతనంచేసి ఎవరు ధనికులు,గోప్పవాళ్ళుకాలేరు, ప్రతిప్రాణి కష్ణపడి సంపాదించుకోవాలి,పొదుపుగా వాడుకోవాలి,రేపటికోసం దాచుకోవాలి"అన్నాడు ఎలుగు బంటి బాబాయి.బుద్దివచ్చింది దొంగతనం చేయడం ఎంత పెద్ద తప్పో నాఅనుభవంతో తెలుసుకున్నాను" అన్నాడు కోతిబావ. పెండ్లి ,భోజనంముగిసినఅనంతరం తననగలలో కొన్నింటిని కోతిబావకుమార్తేకు యిచ్చింది పెళ్ళికుమార్తే తనభార్య దానగుణానికి సంతోషించాడు పులిమామ. విన్నారుగా పులిమామ పెళ్ళికథ"అన్నాడు ఏనుగు తాత."తినవచ్చా సందేహం దప్పళంలో నాకో అప్పళం"అందిపిల్లరామచిలుక ఈజన్మకి యిదిమారదు,అనుకుంటూ పిల్లరామచిలుక ఏమందో ఆలోచిస్తూ జంతువులన్ని ముందుకుకదిలాయి.