అమరావతినగరంలోని విశ్రాంతి అటవి శాఖాధికారిరాఘవయ్యతాతగారి ఇంటి అరుగుపై ఆవాడకట్టు లోని పిల్లలు అందరు కథవినడానికి చేరారు. పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన తాతయ్య"బాలలు ఈరోజుమీకు ఆపదలో ధైర్యంగా,యుక్తిగా ఎలాఉండాలో తెలిపేకథచెపుతాను. పూర్వం శివయ్యఅనే వ్యవసాయకూలి ఉండేవాడు.అతనికి నాఅనేవాళ్లు ఎవరూ లేరు,తనకు కడుపునిండా తినడానికి కూడా కూలిపనులు దొరకక పోవడంతో,రాజధానికి వెళితే ఏదైనాపనిదోరుకుతుందని బయలుదేరి అడవి బాటన వెళ్లసాగాడు.కొంతదూరంప్రయాణించాక మరోబాటసారి చేతిలో సన్నాయితో కనిపించాడు.శివయ్య తనను పరిచయం చేసుకున్నాడు. ఆబాటసారి తనపేరు రామయ్యఅని తను సన్నాయి నేర్చుకోవడానికి గోప్పసన్నాయి కళాకారునివద్ద శిష్యరికంచేయాలని రాజధానికి బయలుదేరాను.అందుకే నిన్నసన్నాయి కొన్నాను అన్నాడు.పౌర్ణమి వెన్నెలలో ఇద్దరూ తెచ్చుకున్న ఆహారం తిని ఓక చెట్టుకింద చేరారు."శివయ్య నేను కొద్దిసేపు సంగీతసాధన చేసుకుంటాను "అనిరామయ్య తన సన్నాయి ఊద సాగాడు.ఆఅపశ్వర శబ్దాలకు ఆపరిసరప్రాంతాలలోని పక్షులు,జంతువులు భయంతో పారిపోయాయి. చమటలు పట్టేదాక సన్నాయి ఊదిన రామయ్య అలసి గుర్రుపెట్టి నిద్రపోసాగాడు.చెవులు,ముక్కునుండి రక్తం కారుతూ,చెట్టుపైనుండి కిందికి దిగిన దెయ్యం రెండు చేతులు జోడించి"బాటసారి ఈసన్నాయి వినలేక పోతున్నాను.నీకు ఏంకావాలో కోరుకో ఇస్తాను.కాని మరోసారి ఈబాటసారి సన్నాయి ఊదకుండా చూడు"అనిచెవులనుండి కారే రక్తం తుడుచుకోసాగింది. గుండెదిట్ట పరచుకున్నశివయ్య"నేను లక్షాధికారిని కావాలి"అన్నాడు."సరే నేను గండికోట రాజకుమార్తెను ఆవహిస్తాను. నువ్వుదెయ్యాల మాంత్రికుడిలా వచ్చి సన్నాయి అనిచెప్పు అప్పుడు నేను ఆరాజకుమార్తెను వదలివెళతాను. కాని ఇది ఓక్కసారి మాత్రమే, నువ్వు మరోపర్యాయం నేను ఉన్నచోటుకు రాకూడదు" అనిదెయ్యం వెళ్లిపోయింది.రాజధానిచేరి రామయ్యవద్ద సెలవు తీసుకుని ఆదేశపు రాజకుమార్తెను దెయ్యం పట్టిందని తెలుసుకుని, నేరుగా రాజుగారి దర్శనం చేసుకుని వారి కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని వదిలించాడు.రాజు గారి ఇచ్చిన ధనంతో స్ధిరపడి వివాహం చేసుకున్నాడు.
కొంతకాలం తరువాత పొరుగురాజ్యమైన ధరణికోట రాజకుమారిని దెయ్యంఆవహించిందని.దాన్నివదిలించవలసిందిగా గండికోటరాజు గారు ఆజ్ఞాపించడంతో మరో దారిలేక శివయ్య ధరణికోటవెళ్లాడు. అక్కడ రాజకుమారి మందిరంలోనికి వెళ్లడంతో "ఓరేయ్ మళ్లి మళ్లి నాఎదుటకు రావద్దు అన్నానా,నాకు రాజభోజనం తినాలి అనేకోరికచాలాకాలంగా ఉంది.అది ఇలా తీర్చుకుంటున్నాను,వెళ్లిపో నాకుకనిపించక "అంది దెయ్యం"అయ్య దెయ్యంగారు ఆసన్నాయి రామయ్య ఈరోజే రాజుగారి కొట ఎదరుగా ఉన్న ఇంట్లో దిగాడు. ఆవిషయంమీచెవినవేద్దాం అనివచ్చాను " అన్నాడు శివయ్య."వామ్మో వాడు ఈడకువచ్చాడా వాడి ఊదుడికి రక్తంకక్కుచావాలి.నేను ఆబాధభరించలేను మనుషులసంచారమే లేని అడవికి పోతున్నా"అని రాకుమార్తేను వదిలివెళ్లిపోయింది దెయ్యం. రాజుగారు ఇచ్చిన బహుమానం అందుకుని బ్రతుకుజీవుడా అని తన ఇల్లు చేరాడు శివయ్య.
"బాలలు కథవిన్నారుగా ఎంతటి ఆపదలోనైనా మనోధైర్యంతో ఎదుర్కోనవచ్చు అని శివయ్యనిరూపించాడు.కనుక మీరు ఎన్నడు భయపడకుండా ధైర్యంగా ఉండాలి"అన్నాడు తాతయ్య.బుద్దిగా తలలు ఊపారు పిల్లలు.