చంద్రం ఒక చిన్నకంపెనీలో చిరుద్యోగి . పెళ్లయ్యి సంవత్సరం అయ్యింది . డిగ్రీ అవగానే ఉద్యోగము ,పెళ్లి వెంట వెంటనే అతను ఆలోచించే వ్యవధి లేకుండానే జరిగిపోయాయి . కారణం !! బామ్మ మనవడి పెళ్లి చూడాలన్న తపన !1 23 యేళ్ళకే పెళ్లి . చక్కని చుక్క లక్ష్మి . 19 యేళ్లప్రాయం . అమాయకత్వం ,మంచితనం కలబోసిన అమ్మాయి . పుట్టింటి సాంప్రదాయ పెంపకం అత్తింట్లో మంచి పేరు తెచ్చింది . పెళ్లయిన 6 నెలలవరకు అత్తారింట్లోనే వున్నది కాబట్టి భర్త అవసరాలు ,అభిరుచులు అన్నీ తెలుసుకున్నది . అనుగుణంగా మారింది . ఇప్పుడు అదేకంపెనీ చంద్రాన్ని మరో వూరికి మార్చింది .
ఉగాది యింకా రెండునెలలుంది . చంద్రం మావయ్యగారు పండక్కి రమ్మని యింకా పిలువలేదు . వూళ్లో వున్నన్ని రోజులూ ప్రతి పండక్కీ పిలిచారు . అల్లుడి మర్యాదలన్నీ చేసారు . అన్ని మర్యాదలూ చేసారు . కానీ యిప్పుడు చంద్రం పట్టణానికి మారాడు . . చిన్న వుద్యోగం వల్ల ఖర్చులు పెట్టుకుని వెళ్లే స్థోమత లేదు . లక్ష్మి పుట్టింటివాళ్లకు కూడా ప్రయాణపు ఖర్చులు భరించే శక్తిలేదు . అందుకే పుట్టింటివాళ్ల దగ్గరినుండి ఉగాది పండగ పిలుపు రాలేదు .
లక్ష్మికి పండగలన్నా వేడుకలన్నా మహా సరదా . కానీ యీసారి సరిపెట్టుకుంది . అర్ధం చేసుకుంది . కానీ మనసులో ఎదో వెలితి . చంద్రానికి అర్ధం అవుతూనే వున్నది . చందమామలాంటి అందమైన వదనం లో కళ్లల్లో దిగులు చూడలేకపోతున్నాడు . లక్ష్మి తలవంచుకుని "భోజనానికి రండి "అంటూ వంటింట్లోకి వెళ్ళింది .
చంద్రానికి జాలేసింది . ఇంతవరకు ఒక్క చీరె కూడా కొనివ్వలేదు . అన్నీ చీరెలూ లక్ష్మికి పుట్టింటివాళ్లు కొనిచ్చినవే . ఉగాదికైనా మంచి చీరె కొనాలి . పండక్కి కొత్తచీరె లేనిలోటు లక్ష్మికి వుండకూడదు . యింకా టైముందిగా అనుకున్నాడు చంద్రం .
డబ్బెలా మిగల్చాలో ఆలోచించాడు
కంపెనీకి స్కూటర్ మీద వెళ్తాడు . బస్సులో వెళ్తే పెట్రోలు డబ్బులు మిగులుతాయి . ఆఫీసులో చిరుతిళ్లు మానెయ్యాలి . పుస్తకాలు కొని చదవడం అలవాటు . ఆదిమనాలి . లక్ష్మిని ఆశ్చర్యపరచాలంటే తనకు ఇవేమీ చెప్పకూడదు .
అలాఅలా చూస్తుండగానే రెండునెలలూ గడిచిపోయాయి . ఉగాది వచ్చేసింది . ఉదయాన్నే లేచింది లక్ష్మి . వాకిలి చిమ్మి నీళ్లుచల్లి ముగ్గేసింది . మావిడాకులు కట్టింది . ఉత్సాహంగా తిరుగుతున్నది . చంద్రం నిద్రలేచాడు కానీ మంచం దిగలేదు . భార్య హడావిడి తెలుస్తూనేవున్నది . ఇల్లంతా పండగ కళే !లక్ష్మి నవ్వుతూ చేతిలో నాలుగు చీరెలతో వచ్చింది . తలారబెట్టుకున్న జడ ,సాంబ్రాణి వాసన మెరుస్తున్న నుదుటి కుంకుమ !చంద్రానికి మురిపంగా ముచ్చటగా కనిపించింది .
నాలుగు చీరెలూ చూపిస్తూ "వీటిలో యేది కట్టుకోవాలి ?" అడిగింది .
"నీకు యే చీరైనా బాగుంటుంది బంగారం "అన్నాడు .
"మీరు మరీనూ మీకు నచ్చింది కట్టుకుంటే నాకు తృప్తి ,ఆనందం ,సంతోషం . చెప్పండీ "అన్నది బుంగమూతి పెట్టి లక్ష్మి .
"ఇవన్నీ మీవాళ్లు పెట్టిన చీరెలు . నాకు చెప్పే అధికారం లేదు " అన్నాడు .
"అదేమిటీ !11వేళాకోళమా !"అన్నది విస్మయంగా .
"మరి నేను కట్టుకోమన్నది కట్టుకుంటావా "అడిగాడు చంద్రం .
""కట్టుకుంటాను "అన్నది .
"అయితే మరేం ప్రశ్నించకుండా యీ చీరెలన్నీ లోపల పెట్టిరా " అన్నాడు .
లక్ష్మి అయోమయం గా చూస్తూ చీరెలన్నీ లోపల పెట్టేసి చంద్రం పక్కన కూచుంది .
"చెప్పండి "అన్నది .
చంద్రం లక్ష్మి కళ్లుమూసి తనతో పాటు గదిలోని బల్లసొరుగు దగ్గరకు తెచ్చి చేతిలో కవరు పెట్టి లక్ష్మిని కళ్లు తెరవమన్నాడు .
కవరువిప్పింది !కళ్ళుజిగేలుమనే జరీచీరె !అంతే !!గభాలున చంద్రాన్ని గట్టిగా వాటేసుకుని చెక్కిలిమీద ముద్దుపెట్టేసింది . చంద్రం కూడా దగ్గరకు తీసుకున్నాడు .
నెమలిపించం రంగు చీరె నిండా అందమైన చిన్ని చిన్ని జరీ చిలకలు ! కొంగు పురివిప్పిన జరీ నెమళ్లు !మెరిసిపోతున్న చీరె !పసిడి లక్ష్మికి మరింత సోయగం ,సొగసు తెచ్చేచీరె !లక్ష్మి కళ్లల్లో ,చెక్కిళ్ళమీదా ,పెదవులమీదా జరీ మీది నిగనిగలు తళుక్కుమన్నాయి . అదిచూసిన చంద్రానికి తృప్తి .
"వెళ్లికట్టుకురా "అన్నాడు . మళ్లీ ఒకముద్దుపెట్టేసి చెంగు చెంగున లోపలికెళ్లింది . చీరె మడతలలోనించి కుట్టినజాకెట్ కనపడింది . జరీఅంచు నెమలిపించం రంగు జాకెట్ !
"సరసులే !!అమాయకం గా వుంటారు కానీ అన్ని తెలుసు . " నవ్వుకుంది . సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా యెదురుగా నించున్న భార్యను చూసి కళ్ళుతిప్పుకోలేకపోయాడు . వాలుజడ ,తలలో మల్లెలు ,కోటేరులాంటి ముక్కుకు రాళ్లముక్కుపుడక ధగధగ మెరుస్తున్నది . చెవులకు జూకాలు ,చేతినిండా గాజులు ,నిండైన యెర్రని కుంకుమ ,పచ్చటిమెడలో తాళి ,నల్లపూసలు !1అందంగా వయ్యారంగా చీరెకుచ్చిళ్లు పాదాలదగ్గర జీరాడుతున్నాయి . నిలీగగనంపు చుక్కల కిరణాలతో మెరిసే చక్కని సొంపైన మిలమిలామెరిసిపోతున్నది లక్ష్మి . అమాయకత్వం చలాకీతనం కలబోసిన కళ్లు ,పెదవులపై మెరిసిపోయెనవ్వు .
అన్నింటినీ మించి ఆమెకళ్లల్లో కనిపిస్తున్న తనమీది ఆరాధన !చంద్రం ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు .
"వుండండి "అంటూ చంద్రం పాదాలకు నమస్కరించింది . తర్వాత చిరునవ్వుతో అతని గుండెలమీద తలవాల్చేసింది . తన శ్రమ ,పొదుపు ఫలించినందుకు చంద్రానికి సంతోషం వేసింది .
ముసిముసి నవ్వులతో "ఇప్పుడు చెప్పండి డబ్బెక్కడిది చీరె కొనడానికి ?" లక్ష్మి చంద్రాన్ని ప్రశ్నించింది .
"ఆడ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు !మొగుడు ప్రేమగా తెచ్చాడు ,కట్టుకున్నావు కదా !1డబ్బెక్కడిదయితే యెందుకు బంగారం !"అన్నాడు నవ్వుతూ చంద్రం .
"చెప్పండీ "ముద్దుముద్దుగా అడిగింది .
"డబ్బెక్కడిదంటే ఏం చెప్పను లక్ష్మీ !మన డబ్బే "అన్నాడు .
"నాకు తెలియకుండా డబ్బెలా సమకూర్చారు ?" మళ్ళీ ప్రశ్న !
"పొదుపుచేసాను మిగిల్చాను "సమాధానం !
"ఎలా "మళ్ళీ ప్రశ్న !
"నా ఇల్లాలికి ,నా బంగారానికి ఉగాది పండక్కి చీరె కొనాలనిపించింది . అంతే !బస్సులో ఆఫీసుకు వెళ్లాను . చిల్లర ఖర్చులు మానేసాను . నీ సంతోషం ముందు యివన్నీ నాకు ముఖ్యం కాదు "అన్నాడు చంద్రం .
"మీకన్నా నాకు యేది విలువైనది లేదు . యింత శ్రమపడ్డారా "అంటూ లక్ష్మి యేడ్చేసింది బస్సులో వెళ్లాడని యింకా దుఃఖం వచ్చింది .
"నాకు చెప్తే నేనుకూడా పొదుపు చేసి మీకు కూడా కొనేదాన్ని కదా !అయినా మీకు లేకుండా నేను యెలా సంతోషంగా వుంటాను "అంటూ ధారాపాతంగా కన్నీళ్లు !
"బంగారూ !నీ మనసు నాకు తెలుసు !యిదిగో నీకు యిష్టమైన జరీఅంచుల ధోవతుల చాపు "అంటూ చంద్రం సొరుగులోనించి కవరు తీసి విప్పి చూపించాడు .
లక్ష్మి ఆనందం పట్టపగ్గాలు లేవు .
"స్నానం చేసి కట్టేసుకోండి . దేవుడికి దణ్ణం పెట్టుకుని ఉగాదిపచ్చడి తిందాం "అన్నది . చంద్రం నవ్వుతూ లేచాడు .
నవసంతం వెల్లివిరిసింది . వాళ్ల అన్యోన్యత అనురాగానికి గుమ్మానికి కట్టిన మావిడాకుల తోరణాలు అందంగా వూగాయి >