బుజ్జిబాబు అనే స్నేహితుడు పిలవడంతో టీ త్రాగడానికి అతని ఇంటికి వెళ్ళాడు శివకుమార్.బుజ్జిబాబు భార్య తన కుమారుని పిలిచి'నాయనా మామయ్య వచ్చారు టీ పెట్టడానికి అగ్గిపెట్టె లేదు, ఓ అగ్గిపెట్టె తీసుకురా ఈరూపాయికి నువ్వు మిఠాయి కొనుక్కో చెల్లాయి చూపించక నాకు కావాలి అంటుంది'అన్నది.
ఆమె మాటలు విన్న శివకుమార్ ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటి తరువాత టీ గ్లాసులతో వచ్చిన బుజ్జిబాబు భార్య 'వదిన పిల్లలు బాగున్నారా? అన్నయ్య' అన్నది. శివకుమార్ ని.
'అందరం బాగున్నాం' అమ్మా ఇందాక మీపిల్లవాడిని అంగడికి పంపుతూ వాడికి అగ్గిపెట్టె తెచ్చినందుకు రూపాయి లంచం ఇచ్చావు.తనఇంటి పనులు వాళ్ళు చేసుకునేలా ఇంటి పరిస్ధితులు వాళ్ళు అర్ధం అయ్యేలా పెంచవలసిన బాధ్యతమనది.పైగా చెల్లాయికి చెప్పక అన్నావు.రేపు వాడు పెద్దవాడు అయ్యాక ఏ ప్రజాప్రతినిధో,ఉద్యోగో అయితే,స్వార్ధంతో నీపెంపకంలో ఇలాగే పెరిగిన వాడు సమాజానికి నిస్వార్ధంగా ఎలా సేవచేయగలడు? లంచగొండిగా,స్వార్ధపరుడుగా తయారు కాడా! ఇలాపెంచితే రేపు మీ భార్యా భర్తలను అవసానదశలో ఆదరిస్తాడా? పిల్లలను లంచగొండులుగా, స్వార్ధపరులుగా పెంచడం సబబా? మీయింట్లోనేకాదు ఇది చాలా కుటుంబాలలో ఇలా జరుగుతుంది. మరెన్నడు పిల్లలకు లంచం ఇవ్వచూపకండి,తినే అరటి పండు కూడా తుంచుకుతిని మిగిలినది దాన్ని ఎదటివారికి పంచి ఇవ్వడం వారికి నేర్పండి.భావిభారత పౌరులకు బంగారు బాట మనమే వేయాలి.రోజుకు ఆరుగంటలు టీ.వి చూసే తల్లులు,వారాని రెండు సినిమాలు చూసే తండ్రులు ఏనాడైనా తమ బిడ్డను ఒడిలోనికి తీసుకుని నీతి కథకానీ,శతక పద్యంగాని ఎంతమంది తమబిడ్డలకు నేర్పుతున్నారు. మనిషి సంఘజీవి సమిష్టిగా ఉన్న నాడే మనం ఏవిషయంలోనైనా ప్రగతి సాధించగలం.సమాజంలో మార్పురావాలి అని అందరూ అనేవారే కాని ఆసమాజం పట్ల,మన బిడ్డలపట్ల మనం ఎంత బాధ్యతగా ఉన్నాము అని ఏనాడైనా క్షణకాలం ఆలోచించారా?సమాజ సేవకులగా,అన్నార్తులు వ్యాధిగ్రస్తులను ఆదుకునేలా జాలి,దయ, కరుణ, పాపభీతి,దానగుణం కలిగినవారిలా వారినిపెంచాలి'అన్నాడు. శివకుమార్.
'అన్నయ్య అవగాహనా లోపంతో అలా ప్రవర్తించాను మన్నించండి. మీరు సూచించిన విధంగా సమాజంపట్ల బాత్యత కలిగిన వారిలా ఇంటి ఆర్ధిక పరిస్ధితులు వారికితేలిసే చెస్తూ నాబిడ్డలను రేటి సమాజ కరదీపికలుగా పెంచుతాను' అన్నది బుజ్జిబాబు భార్య.