సుబ్బరాయుడు సత్రం అనే ఊరిలో శివయ్య ,ఉమా అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. శివయ్య చదువులేనివాడు,అమాయకుడు.ఉమా చదువుకున్నది తెలివైనది.వారికి ఉన్న కొద్దిపాటి పొలంలో వర్షంపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ చాలి చాలని ఆదాయంతో జీవించ సాగారు.ఉరి అందరు తమ పొలాలలో బోరు వేయించి నీరు పుష్కలంగా ఉండటంతో పంటలు బాగా పండించి ధనవంతులు అయ్యరు.
తనవద్ద బోరు వేయించడానికి ధనం లేకపోవడంతో శివయ్య,వడ్డి వ్యాపారి రామచంద్రయ్యను కలసి తన బాధలు చెప్పుకున్నాడు.శివయ్య పొలఃలో బోరు వేయడాని ధన సహాయం చేస్తానని మాటఇచ్చాడు రామచంద్రయ్య.
కొద్దిరోజుల అనంతరం శివయ్య ఓక స్వామిజిని తనఇంటికి తీసుకువచ్చి'వీరు దివ్యదృష్టికలిగిన మహనీయులు కంటితో చూసి భూగర్బ జలాల జాడ పసిగట్టకలరు.మన పొలంలో నీరు పుష్కలంగా ఉందట.అది ఎక్కడ ఉందో స్వామిజి తన కంటితోనే చూసి కనిపెట్టారు, వీరికి భోజనంతో పాటు రెండువేల రూపాయలు ఇచ్చిపంపించు,నేను మన పొలంలో బోరువేయడానికి వడ్డి వ్యాపారి గారిని కలసివస్తాను'అని తన భార్య ఉమకు చెప్పి వెళ్ళిపోయాడు శివయ్య.
ఉమా తన భర్త తీసుకువచ్చిన స్వామిజీకి
శివయ్య తీసుకు వచ్చిన స్వామిజికి భోజనం పెట్టిన అనంతరం,అరటి పండ్లు,తమలపాకులు ఓ పళ్ళెంలో పెట్టి అందించింది."అమ్మా వడ,పాయసంతో మంచిభోజనం పెట్టావు.పండు తాంబూలం ఇచ్చావు నీభర్త చెప్పిన రెండువేల రూపాయలు దక్షణ ఇవ్వలేదే"అన్నాడు.
"స్వామి తమలపాకు కింద మడతపెట్టి ఉన్న రెండువేల రూపాయల నోటును గుర్తించలేనిమీరు దివ్యదృష్టితో భూగర్బజలాలు కనిపెడతారా? నాభర్త వంటి అమాయకులు ఉన్నంతకాలం మీవంటి మోసకారులు వస్తూనే ఉంటారు. మోసంతో ఎవరు పెద్దవారు గొప్పవారు కాలేరు.పసువులు సైతం కష్టపడుతున్నాయి.మనిషిమైన మనం కష్టపడి గౌరవంగా జీవించలేమా? పసువుపాటి మనిషి సమతూగలేడా! విత్తనం నుండి ఎరువులు వరకు కల్తి,కష్టపడి పండిస్తే గిట్టుబాటు ధరరాదు.అందరు రైతును మోసగించాలనుకునేవారే!ఇప్పుడు మీరు చెప్పిన చోట నీరులభించకపోతే అప్పుల్లో మాకుటుంబం కూరుకుపోతుంది.మీలాంటివారి చేతిలో మోసపోయిన మావంటి రైతులు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? సైన్స్ ఇంత అభివృధ్ధి చెందిన ఈకాలంలోకూడా మంత్రతంత్రాలా?మీలాంటి మోసగాళ్ళ ఆటలు సాగవు.ప్రభుత్వ అధికారులే పొలంలోనికి వచ్చి ఉచితంగా భూగర్బ జలాల ఉనికి చెప్పి,బోరువేయడానికి బ్యాంకులు అప్పు ఇస్తున్నాయి.ఇలా మోసంతో జీవించకండి వెళ్ళండి అని తాంబూల పళ్ళంఅందించింది.
"తల్లి నాకళ్ళుతెరిపించావు.బుద్దివచ్చింది మరెన్నడు ఎదటివారిని మోసగించే ప్రయత్నం చేయను.నీమాటలతో పరివర్తన చెందాను.మీపొలంలో నేను చెప్పినవద్ద బోరు వేయకండి.సెలవు"అంటూ చేతిలోని తాంబూలపళ్ళెం అక్కడ ఉన్న బలపై ఉంచి వడివడిగా వెళ్ళాడు స్వామిజి వేషగాడు.