అనంద రావు మనస్సు అందరి లాంటిది మాత్రం కాదు.
తన సంతానానికి ఎప్పుడు ఏమి కావాలో ఇట్టే పసిగట్టగలడు.
వాళ్ళ అవసరాలను నిశితంగా పరిశీలించి, వాళ్లకు కావలసినవి , తనదైన శైలితో అందించడం అతని ప్రత్యేకత.
అంతేకాదు, పిల్లలు తాను ఎలా ఉండాలని ఇష్టపడతారో అలాగే ఉండేవాడు. వారు తనని ఎలా చూడలనుకుంటున్నారో,
తాను ఎలా నడచుకోవాలనుకుంటున్నారో,వాటి కి అనుగుణంగా పరివర్తన చెందుతూ ఉండేవాడు.
పిల్లలు తమ తండ్రి ఎలా ఉండాలో ,తమకు తెలిసినవి ఆనంద్ రావు తో చర్చించే వారూ .వారి అభిప్రాయాలను తాను కూడా గౌరవిస్తూ వచ్చాడు. అలాగని , పిల్లలు తీసుకొనే నిర్ణయాలు,అతన్ని ఎప్పుడు ఇరకాటంలో పడేయలేదు. కానీ అతని వ్యక్తిత్వాన్ని మరింత ఇనుమడింప చేసాయి అనే చెప్పాలి.
నాన్న ఎలా ఉండాలో పిల్లలు సూచించేవారు.వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది ముందుగానే గ్రహించి వాటికి తగ్గట్టు మసలుకొనేవాడు ఆనందరావు.
ఆనందరావు , అరవిందు ఇద్దరు కలిసి షాపింగ్ మాల్ కు వచ్చారు.
ఆనంద రావు ఎప్పటిలాగే, తనకు నచ్చిన కుర్తా పైజామా సెలెక్ట్ చేసుకున్నాడు.
"నాన్న! ఆ కుర్తా పైజామా కంటే , ఈ బ్లూ ప్యాంట్ మరియు ఆ క్రీం కలర్ చొక్కా బాగున్నాయి ,అందంగా హుందా తనాన్ని పెంచేవిగా వున్నాయి" , అంటూ అతని] చేతిలోని కుర్తా పైజామాను పక్కన బెట్టి ,తాను సెలెక్ట్ చేసిన డ్రెస్ ఫైనల్ చేస్తూ బిల్ డెస్క్ వైపు అడుగులు వేసాడు అరవిందు.
అరవిందు ఆనందరావు మొదటి సంతానం. ఆనందరావుకు ఒక అబ్బాయి ,అతనే అరవిందు మరియు ఒక అమ్మాయి హన్సిక.
బిల్ డెస్క్ దగ్గర పేమెంట్ చేసి , పాకెట్స్ తీసుకొని షో రూమ్ నుండి బయటకు వచ్చారు తండ్రి కొడుకులు.
షో రూమ్ బయటకు వచ్చి .సెల్లార్ లో పార్క్ చేసి ఉన్న బైక్ తీసి స్టార్ట్ చేసాడు ఆనంద్ రావు , వెనక ప్యాక్ చేసి ఉన్న బట్టలను పట్టుకుని కూర్చున్నాడు అరవింద్.
షో రూమ్ నుండి ఇంటికి ఓ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆనందరావుకి కారు కంటే బైక్ అంటేనే ఇష్టం .బైక్ ని నడపడానికి చాలా ఇష్టపడతాడు కూడా.అందుకని బైక్ని తానె డ్రైవింగ్ చేస్తుంటాడు. షోరూమ్ పార్కింగ్ ప్రదేశం వదలి ట్రాఫిక్ లోకీ వచ్చారు ఇద్దరు. బైక్ ని కుడి వైపుగా,డివైడర్ కి దగ్గర్లో బైక్ ని పొనిస్తున్నాడు ఆనందరావు. ఇంతలో వెనకనుండి వస్తున్న ఫోర్ వీలర్ అతను, సైడ్ ఇవ్వమన్నట్లు ఒకటే హారన్ మ్రోగిస్తున్నాడు.నిజానికి టూ వీలర్స్ ఎడమపక్క ఉంటే, ఫోర్ వీలర్స్ కి కుడి పక్కనుండి ఓవర్ టేక్ చేసి వెళ్లడానికి సులువుగా ఉంటుంది.
ఇంతలో అరవింద్ కలుగచేసుకొని. "నాన్న బండి ని లెఫ్టుకి తీసుకొని, ఆ కారుకు సైడ్ ఇవ్వండి, అతనే ఒకటే హొంక్ చేస్తున్నాడు" అన్నాడు.
అది విని కరెక్ట్ అనే భావించి మెల్లిగా బైక్ ని ఎడమవైపుకు తిప్పాడు, అరవింద్ తన ఎడమచేతిని చూపిస్తూ జాగ్రత్తగా లెఫ్ట్ వైపుకి తిప్పుకున్నారు.
బైక్ ఎడమ వైపుకి వచ్చిన తరువాత, అరవింద్ తన తండ్రికి సర్ది చెప్పడం మొదలు పెట్టాడు.ట్రాఫిక్ రూల్స్ పట్టిచ్చుకోవని,ఇష్టమొచ్చినట్లు నడిపితే ఎలా అని నిలదీసాడు అనందరావుని.
వయసులో చిన్నవాడైన ,వాడు చెప్పే మాటల్లో అర్థం ఉంది. నేను కొంచెం నా డ్రైవింగ్ స్టైల్ని మార్చుకోవాలని లోలోన అను కున్నాడు ఆనందరావు.
తన కడుపునా పుట్టిన వాడు, తనకు సలహాలు , మెలకువలు చెపుతూ ఉంటే, వీనిలో ఇంత జ్ఞానం ఎప్పుడొచ్చిందా అని వీస్తూ పోయాడు ఆనందంరావు.
ఆ పరిస్థితుల్లో ఒక తండ్రి ఎలాంటి అనుభూతి పొందుతాడో, తండ్రై సదరూ అనుభవం పొందినవాళ్లకే తెలుస్తుంది.
****** *********
మరుసటి రోజు, దగ్గరి మిత్రుడొకరు ఓ చిన్న ఫంక్షన్ ఉందని ఆహ్వానిస్తే వెళ్ళాడు ఆనందరావు.
ఆనంద రావు తన అబ్బాయి అరవింద్ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని ఫంక్షన్ కి వెళ్ళాడు. ఆ డ్రెస్ అతనికి చాలా బాగుంది. అతని వయస్సుకి మరియు శరీర ఆకృతికి తగ్గట్టుగా ఉంది.. పొడవాటి బక్క పలచని శరీరానికి, అతని ముఖ వర్చస్సుకి తగ్గట్టు ఆ డ్రెస్ బాగ సరిపోయింది. అందరి నుంచి కాంప్లీమెంట్స్ అందుకున్నాడు. అంతే కాదు ఆ ఫంక్షన్ లో, ఆనందరావు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలచినాడు. మనసులో తన కొడుకుకి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. కొన్ని అంతే, మన దగ్గరి లేని కొన్ని మెచ్చుకోదగ్గ గుణాలు , మన ముందు తరాల వారు అందిస్తే పుణికి పుచ్చుకోవాల్సిందే.
=========================================
'చిన్న పిల్లలు తమ చిట్టి చిట్టి చేతులను పెద్దవాళ్ళ బుజాల మీదుగా మెడ చుట్టువేసి , వీపు పై అల్లుకొని చెవుల దగ్గర తమ చిట్టి గొంతుతో గారాలు ఒలక బోస్తూ నాన్నగారు 'అని చెప్పే కబుర్లు వింటూవుంటే పొందే తన్మయత్వము మాటల్లో వర్ణించలేము.
అరవింద్ తన చిట్టి చిట్టి మాటలతో గారాలు ఒలకబోస్తూ ఉంటే , ఆనందరావు అలాంటి తన్మయత్వాన్నే అనుభవించాడు.
అరవింద్ చదువుల్లో ముందుండేవాడు. అందరూ అతని గూర్చి చెపుతూ ఉందేవారు.
ఒక రోజు, అరవింద్ లెక్కల మాస్టారు వీధి లో ఆనందరావుకు తారసపడ్డాడు.
"మీ వాడు లెక్కలు బాగా చేస్తున్నాడు , వాన్నీ బాగా చదివించు "అన్నాడు .
అప్పుడు అనాదరావు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతని మనసు ఆ క్షణంలో అర్ద్రం అయ్యింది.
"పుత్రోత్సాహం తండ్రికి
పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ,
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి! అన్న సుమతి శతకం అతనికి గుర్తుకోచింది. మహానుభావులు ఊరికే రాసారా మరి!!
వీధిలో నడుస్తూ, స్వగతంగా ఏవో ఆలోచిస్తూ ఉన్నాడు ఆనందరావు.
"నిజంగా నేనుఎంత అదృష్టవంతుణ్ణి. అరవిందుడికి నాన్నగా పుట్టడం అదృష్టమే. వాడు నాకు లెక్క లేనన్నీ సంతోషాలు ఇచ్చాడు" అని ఆనందరావు మనసులో ఎన్నో సార్లు అనుకున్నాడు.
వాడు పుట్టినప్పుడు, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన నర్సు " కంగ్రాట్స్ , అబ్బాయి పుట్టాడు.ఆరోగ్యంగా ఉన్నాడు "అని చెప్పినప్పుడు, ఆనందరావు ఎంత సంతోష పడ్డాడో. ఆ ఆక్షణంలో అతను పడిన సంతోషానికి అవధులు లేవు.
ఒక రోజు ఆనందరావు వాళ్ళ నాన్న తో ఏదో విషయంలో చిన్న గొడవ పడ్డాడు. ఆనంద రావు తన తండ్రిని మాటలతో వేధించడం చూస్తూ సహించలేని అరవింద్ , తాత గారిని సమర్ధిస్తూ ఆనందరావు ను ఎదుర్కొన్నాడు.
అప్పుడు ఆనందరావు కొంచం తగ్గాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో, కొడుకు చేతుల్లో వెనక్కి తగ్గాల్సివచ్చినా ,ఆనందరావు లోలోన మనసులో మాత్రం మహా ఆనంద పడ్డాడు ఎందుకంటె వాడి మాటలతో , చేష్టలతో ఆనందరావు రేపు లేకున్నా ,అరవిందు తన తాతగారిని మంచిగా చూసుకోగలడన్న ధీమాను స్ఫురింప చేసాడు.
ముసలాళ్లమైతే మమ్మల్నెవరైనా చూస్తారా అన్న బెంగ అందరికి ఉంటుంది.అలాంటిది నిన్నే కాదు నీ తండ్రిని కూడా మంచిగా చూసుకుంటాననే భరోసా కలిగించే సంఘటనలు ఆనందాన్ని పుట్టిస్తాయి.
తన గవరమెంటు స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీష్, తనదేమో కాన్వెంటు స్కూల్ ఇంగ్లీష్ , తాను మాట్లాడే ఆంగ్లాన్నీ సరిచేస్తూ, ఉచ్చారణ దోషాలను ఎట్టి చుపుతునప్పుడు, ఆంగ్లంలో వాక్యాలను అలా కాదు ఇలా రాయాలని తాను అనలైజ్ చేస్తూ నాకు చెపుతున్నప్పుడు ,చెప్పే మాటల్లో పస ఉన్నప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చేది.
కాల క్రమేణా , అరవిందు చదువులో బాగా రాణించాడు. పై చదువులకని అతన్ని ఇతర రాష్ట్రాలకు పంపవలసి వచ్ఛినది.
అక్కడ తాను నేర్చుకున్న విషయాలు ,తండ్రికి ఏకరువు పెట్టేవాడు.
తమ జీవన విధానంలో ,ఆలోచనదొరణుల్లో చాలా మార్పు రావడం గమించాడు ఆనందరావు.
హన్సిక పెళ్లికి అన్ని తానై అందరిని మెప్పించాడు అరవిందు.
హన్సిక పెల్లైన కొద్దీ రోజులకే ఆనందరావు గారి భార్యా పోవడం , ఆతను ఒంటరివాడవ్వటము జరిగాయి.ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవించే సాధారణ సంఘటన. ఇది సాధారణమే అయినప్పటికీ , జీవితాలు ఇక్కడి నుంచే మలుపులనుచూస్తాయి.
ఎప్పుడో హాన్సిక తన కొత్త ఇంటిని ఫైనల్ చేసే సమయంలో, తన అన్నయ్య అరవిందు సహాయాన్ని తీసుకొంది. ఇంటి ముఖ ద్వారం తూర్పుకి ఉంటే ,కిచెన్ ఇక్కడ ,పూజ గదీ అక్కడ వస్తుందని, బోరు ఈశాన్యం మూల ఉండాలని ఎంత బాగా అందరిని కన్వీన్స్ చేసాడో అరవిందు.
చెల్లెలు అంటే అమితమైన ప్రేమ అరవిందుకి. హన్సిక విషయం కూడా అంతే.అన్నా చెల్లెల్లది ఒకటే మాట.ప్రతి విషయం ఒకరితో ఒకరు తప్పకుండా చర్చించుకొంటారు.
మొత్తమీద ఓ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి.
అరవింద్ తన తెలివి తేటలతో మంచి కంపనిలో స్థిరమైన ఉద్యోగం సంపాదించుకొన్నాడు . తగిన వయసులో పెళ్లి , ఇద్దరు పిల్లలు అన్ని సవ్యంగా జరిగి పోయావి. ఇక కూతురు కూడా మంచిగా చదువుకొని , పెళ్ళై ,పిల్లా పాపలతో చక్కగా ఉంది.
ఆనంద రావుది ఒక చిత్రమయిన మనస్తత్వం. తనకు ఏం కావాలో ,తనకంటే అరవిందుకే ఎక్కువ తెలుసనీ భావిస్తూ వచ్చాడు. దా నికి కారణం లేకపోలేదు, అరవిందు తండ్రి కోసం ఏ నిర్ణయం తీసుకున్న అది హిట్టయ్యేది, అంటే అందరికి ఆమోదయోగ్యాంగా ఉండేది. అందుకే ఆనందరావ్ కి అరవిందు తీసుకునే నిర్ణయాలపై నమ్మకం పెరిగింది. అది ఇప్పటికీ ఉంది.
అవి తనకు సెలెక్ట్ చేసేన బట్టలే కావచ్చు, తన కళ్ళ జోడి మార్పిడినే కావచ్చు , తన చెల్లికి వరుణ్ణి నిర్ణయించే బాధ్యతయే కావచ్చు ఇలా చెప్పుకుంటూ పొతే ,అన్నిట్లో అరవింద్ తీసుకున్న నిర్ణయాలు విజయవంతంగా ఉండేవి.
ఆలా సాఫీగా సాగే కుటుంభంలో కాలానుగుణంగా కొన్ని మార్పులు రాసాగాయి.
అరవిందుదీ హై ప్రొఫైల్ ఉద్యోగం , దానికి తగ్గ జీతం , జీతానికి తగ్గట్టుగా జీవన శైలి లో మార్పు.
జీవించే విధానాల్లో మార్పు వస్తే ఆలోచించే విధానాల్లో మార్పులు రావడం సహజం, ఆలోచన విధానాలకు అనుగుణంగా , ప్రాధాన్యతలు మారుతాయి. అన్ని వెరసి, అనంద రావు జీవన శైలికి, అరవిందు జీవించే జీవనశైలికి బాగా అంతరం ఏర్పడ సాగింది.
ఆనాడే రావు , అంటే భార్య పోయినప్పటి నుండి అరవిందుతో పాటే ఉండి ఉంటె ఈ అంతరం అంతగా ఏర్పడేది కాదేమో.
ఉద్యోగ రీత్యా అరవిందు ముంబై , బెంగుళూరు నగరాలలో తన మఖాను మారుస్తూ ఉండేవాడు, అక్కడి పద్ధతులు నచ్చక తానూ మాత్రం హైదరాబాద్ లోనే ఉండేవాడు. అప్పుడప్పుడు వెళ్లి ఓ నాలుగు రోజులు ఉండి మల్లి వచ్చి , తన కిష్టమని హైదరాబాద్ లోనే ఉండేవాడు ఆనందం రావు.
వయసు పైన పడుతూ ఉండటం,వయో భార సమస్యలతో పాటు మానసిక పరిస్తులు మారడం సహజం.
ఆనందరావు గారా ఆక్కడ వాతవరణంలో ఇమడరు. కాదు కక్కసమని అననంద రావు ని ఇక్కడికి తీసుకొస్తే అతన్ని ఇంకా బాధ పెట్టిన వాడినవుతానని అరవిందు . అలాగని అరవిందు తన ఉద్యోగం వదలి , హైద్రాబాద్ కి రానులేడూ.
తన తండ్రి కి సంబందించిన ఎన్నో నిర్ణయాలను సునాయాసంగా తీసుకోగల్గిన అరవింద్, ఈ విషయంలో ఏం చేయాలో పోలుపోక తలమునకలు కాసాగాడు.
అరవింద్ కి తండ్రి గూర్చి బెంగ ఎక్కువయ్యింది. . అరవిందు ఆలోచనలకి , ఆనంద్ రావు ఆలోచనలకి పొంతన కుదరగలదా.
, అరవిందు పిల్లలు కూడా తాతయ్యని అంతగా ఇష్టపడే వారు కాదనే చెప్పాలి. ఎప్పుడూ తమ వెంటే ఉంటే , పరిస్థితి మరోలా వుండేదేమో.
బాగా అలోచించి ఓకే నిర్ణయానికి వచ్చాడు అరవింద్.
ఇదే నిర్ణయాన్ని తన చెల్లెలు తో చర్చిస్తే , ఆమె కూడా దాదాపు సరే అంది.
ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి తండ్రిని మెప్పింఛాడు.ఇప్పుడు కూడా తాను చూపబోయే పరిష్కారం తన తండ్రి తప్పకుండా ఆదరిస్తాడనే నమ్మకం ఆరవిందుది.
ఇక తను తీసుకొన్న నిర్ణయాన్ని ఎలా బహిర్గత పరచాలి.ఎలా చర్చించాలి , ఎక్కడినుండి మొదలుపెట్టాలి అని తర్జన భర్జన పడుతున్న అరవింద్ కి , వాట్స్ అప్ మెసేజ్ వచ్చినట్లు నోటిఫికేషన్ టోన్ వచ్చింది.
మొబైల్ స్క్రీన్ అన్లాక్ చేసి చూస్తే తన తండ్రి అనంద రావు దగ్గరి నుండి మెసేజ్, వచ్చే నెల పదో తేదీన హైదరాబాద్ కి కుటుంభంతో సహా రమ్మని కబురు. ముఖ్యమైన విషయం చర్చించాలి అని ఉంది.
విషయమేంటో కనుక్కుందామని చెల్లికి కాలు చేసిన అరవిందుకు , ఆమె కూడా అదే మెసేజ్ తనకూ వచ్చినదని చెప్పింది.
ఇంతకీ ఆనందరావు తన కూతురిని మరియు కొడుకుని ఏ విషయ నిమిత్తం పిలిచాడో గాని, వీరిద్దరినీ మాత్రం దీర్ఘ ఆలోచనల్లోకి నెట్టి వేసింది.
==========================================
ఆనంద రావు దగ్గరకు చేరుకున్నారు అరవిందు మరియు హన్సిక . తమ కుటుంబ సభ్యులతో తో సహా.
కుశల ప్రశ్నలు అయ్యాక , భోజనాలు చేసి కూర్చున్నాక , హాల్లోకి అందరు చేరుకున్నారు.
అందరికి కూర్చోండని సైగ చేస్తూ, తాను పక్కనున్న వాలు చైర్ లో వాలుతూ "ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అనే సంశయం మీకక్కర లేదు"
"మీ కదలికలు, మీ మనస్తత్వాలు నాకు బాగా తెలుసు.మీరు నా గూర్చి ఏమి ఆలోచిస్తున్నారో , అది కుడా నాకు తెలుసు".
అరవిందు , హన్సిక భర్త ఒక పక్క మరియు అరవిందు భార్యా హన్సిక మరో పక్క కూర్చున్నారు.
అందరూ శ్రద్దగా వింటున్నారు.
ఆనందరావే మల్లీ చెపుతున్నాడు ," ఇంతవరకు మీరూ నాకోసం తీసుకొన్న ఏ నిర్ణయం, నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇక ముందు కూడా పెట్టబోవని భావిస్తున్నాను.
'ఈ సారి తీసుకోబోయే నిర్ణయం' విషయంలో నేను మీకంటే ముందున్నాను.మీరు నా నిర్ణయాన్ని హర్షిస్తారనే భావిస్తున్నాను.
పై చదువులు పూర్తిచేసుకుని, నీవు మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పటి నుండి, ఉన్నత భావాలున్న అమ్మాయి నీ జీవితంలోకి భార్యగా వచ్చినప్పటి నుండీ, నీ జీవితం, మీరు జీవించే పద్దతువులు , మీ ఆలోచన ధోరణులను మరియు అవి పరివర్తన చెందే వివిధ దశలను పసిగట్టి క్షుణ్ణంగా పరిశీలించ సాగాను. నా భావి జీవితం ఎలా ఉండబోతోందో నాకర్థమయ్యింది.అప్పటినుండే , నేను నా మనస్సుని ఎప్పుడో భావి పరిస్థితులకు అనుగుణంగా సంసిద్ధం చేసుకుంటూవచ్చాను.
నేను మనస్పూర్తిగా స్వతంత్రంగా ఉందటానికి సంసిద్ధుడను. నా అలవాట్లలో కూడా చాల మార్పులు తెచ్చుకున్నాను. ఆర్థికంగా కూడా నాకేమి లోటు కాకుండా చూసుకున్నాను.
మీరు నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకున్నారో లేదో నాకు తెలియదు.కానీ నేను మాత్రం ఒక వృద్హాశ్రమంలో చేరదలచుకున్నాను అనేది నిజం.
వృద్ధాశ్రమాలు అంటే నరక కూపాలు అస్సలు కాదు. కొన్ని అలా వుండవచ్చు!
నన్నడిగితే అవి ముక్తి ద్వారాలు. బాధ్యతలతో విసిగి, వేసారిన వారికి అంతిమ సమయంలో ఊరట కలిగించే పుణ్య దామాలూ.
నాకు చాలా సార్లు అనిపించింది .నేను చాలా విషయాలలో మీ కంటే వెనక బడి ఉన్నానని.కానీ ఈ విషయంలో మాత్రము నేను మీకంటే ముందే ఉన్నానని భావిస్తున్నాను.
తండ్రి గొప్పదనాన్ని ఎందరో మహానుభావులు, అనుభవజ్ఞులు ఎన్నో విధాలుగా వివరించారు. దీనీలో అతిశయోక్తి ఏమి లేదు.
నా ఆలోచన మాత్రం ఇందుకు చాలా భిన్నం.
తండ్రి తన పిల్లలను తన కంటే ఎత్తులో చూడాలని ఆకాంక్షిస్తారు . దానిలో అతని అంతర్ధాన ఆశ లేక పోలేదు.ప్రతి తండ్రి తన సంతానాన్ని తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని చూస్తాడు.రేపు వారు ఉన్నతమైన స్థితి లో ఉంటే , శేష జీవితం కూడా ఉన్నతంగా గడపొచ్చనే ఆశా కూడా దీనికి కారణం కావచ్చు.
దానిలో అతని ఆశతో పాటె బాధ్యత కూడా ఉంది. ఆ భాధ్యతను తండ్రులైన వారందరు మోసి సఫలీకృతులు అవుతున్నారు కాబట్టే మన సమాజం ఇలా మెరుగుగా ఉంది.
నేను మీకు విధ్యా బుద్దులు నేర్చుకొనేందుకు ఒక చిన్న దారి చూపించాను అంతే, మిగతాది మీ వ్యక్తిగత కృషియే.
ఇక్కడ మీరేమి అనుకోకుంటే, నా భావనను ఇంకొంచెం లోతుగా వ్యక్తపరుస్తాను.
చిన్నప్పుడు నీవు పుట్టావు అనగానే నే పొందిన సంతోషం వర్ణణాతీతం. ఆ క్షణంలో నేను సంతోష పడటానికి నీవు ప్రత్యేకించి ఏం శ్రమ పడక పోవచ్చు, కానీ ఆ అప్పటి సంతోషానికి కారణము ఖచ్ఛితంగా నీవే !
నీ గురించి మీ లెఖ్ఖల మాస్టారు పొగడ్తగా చెప్పినప్పుడు, నీవు నా కోసం సెలెక్ట్ చేసిన డ్రెస్ బాగుందని పది మంది మెచ్చుకొన్నప్పుడు, నిన్ను పెద్దచదువుల కోసం వేరే రాష్ట్రము వెళ్ళినప్పుడు, నీకు మంచి ఉద్యోగం దొరికిందని తెలిసినప్పుడు. నీ పెళ్లైన ప్పుడు, నీకు పిల్లలు కలిగినప్పుడు . మా నాన్న గారికి నేనున్నానని భరోసా ఇచ్చినప్పుడు, నీ పిల్లలు నా మెడ చుట్టూ చేయి వేసి తాత అన్నప్పుడు, మీ తాతగారు పోయినప్పుడు నీవు నా కంటే ఎక్కువ బాధ పడ్డప్పుడు నే అనుభవించిన వివిద రకాల మనోభావాలను నిజంగా మాటల్ల్లే చెప్పలేను. కానీ వాటన్నిటికీ ప్రత్యక్షం గానో , పరోక్షంగానో మీరే కారణం.దీంట్లో నా గొప్పేమి లేదు.
మీ తాతగారు పోయినప్పుడు మీరు నా కంటే ఎక్కువ బాధ పడ్డారు. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయాడే అని భోరున ఏడుస్తూ ఉన్నప్పుడు, నాన్నా ఇంటికి ఇప్పుడు నీవే పెద్ద దిక్కు. నీవే ఇలా ఏడుస్తుంటే ఎలా అని నన్ను ఓదార్చిన తీరు ఇంకా నేను మరవలేదు.
ఇక్కడ హన్సికను వదిలి , అంతా అరవిందు గూర్చియే మాట్లాడుతున్నాను అని ఎవరేమి అనుకోవద్దు. ఆ అనుబంధం, బాధ్యత అలాంటిది.ఇది హన్సికకు తెలియని విషయం కాదు. ఇక్కడ అరవైనాడు అన్న పదం లో హన్సిక కూడా ఉందని భావించాలి. అది అలవాటులోని పొరపాటో లేక వాత్సల్య దోశమో గ్రహించలేని స్థితి లో లే నా సంతానం ఉందని నేను భావించడం లేదు.
వాడు నాకు ఎన్నో సంతోషాలు ఇచ్చాడు.ఎన్నో సార్లు నా మనసును తేలిక చేసాడు.ఎన్నో అనుబూతులు మిగిలాచాడు.నాకు వినోదాన్ని పంచాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు,ఉపాధ్యాయునిల దారి చూపాడు,తప్పులను సారు చేసాడు.మిత్రునిల వాదించేవాడు.
వాడు నా మనసును , నన్ను నా అవసరార్లను అర్థం చేసికొని నాకు కావాల్సింది సమకూరుస్తూ వస్తున్నాడు.
నాకు ఎప్పడు ఏమి కావాలి అన్నది నా కన్నా వానికె బాగా తెలుసు.
ఈ సారి మాత్రం , ఈ విషయాన్ని నేను మీకంటే ముందుగా పసిగట్టను.
నా తాహతుకి తగ్గ , కొచం లక్జరీగా ఉండే 'హోమ్ ఫర్ సీనియర్ ఏజ్' వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను.ది ఈ సమయానికి తగ్గ అవసరము.
ఇది కూడా ఒక ఇళ్లే. మీరు మీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, కాకుంటే కొన్ని రోజుల కొరకు మాత్రమే.
లేవగానే టీ టిఫిన్, యోగ , ప్రకృతి ,వై ద్యుల అందుబాటు, పాత తరం మాటలు మాటాడే మా వయసు గ్రూప్ వారు, రిట్రో సినిమాలు వేసే హంపి థియేటర్స్, సాయంకాలం వాహ్యాళికి వెళ్లేందుకు పచ్చనైన పచ్చిక బయళ్లు, శ్రావ్యమైన మరియు నచ్చిన సంగీతం వినేందుకు మంచి బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టం , ముగ్గురికి ఒకరు చొప్పున పర్సనల్ అసిస్టెంట్స్ . ఇక్కడ ఇంకా ఎన్నో ఏర్పాట్లు.
నాకు కుడా మీకు కొచం స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది.
మీరు నా లైఫ్ లో ఎన్నో అనుభూతుల్నిచ్చారు. నేను వాటిని ఎంజాయ్ చేసాను కూడాను. అలాగే మీరు మీ సంతానం ఇవ్వబోయే అనుభూతులకు సిద్ద్దంగా ఉండండి , అనుభవించండి.
మిమ్మల్ని విడచి దూరంగా వుంటున్నానన్న భాద నాకు ఏ కోశానా ఉండదు. నా మనన్సని వీటన్నిటికీ ఎప్పుడో సిద్దపరచాను. నాలో ఒకటే బాధ. మీరు ఇంకా నన్ను విడచి ఒంటరిగా ఉండేందుగా మానసికంగా సిద్ధంగా ఎందుకు లేరు అని.
మనకు తెలిసిన ఎనిమిది భౌతిక దిక్కులకంటే కనిపించని తొమ్మిదో దిక్కు , పెద్ద దిక్కు ఇంటికి పెద్ద దిక్కు . ప్రతి ఎల్లను , ప్రతి మూలను చూపించి ఇది తూర్పని , అది పడమర అని చూపగలము, గాని ఇంటికి అన్నివైపులా తానయి, కుటుంబ నైతిక భారాన్ని మోసే ఇంటి యజమాని తండ్రియే ఇంటికి పెద్ద దిక్కు. ఆ యజమానిని కన్న తండ్రైగా ఆ ఇంటికి కనిపించని తొమ్మి తొమ్మిదో దిక్కే నేను. నిజానికి ఈ పెద్ద దిక్కు ఏమి చేయదు కానీ అందరిని పురమాయిస్తుంది . ఎవరికి ఏమయినా బాధ కలిగితే తానూ బాధ పడతుంది , అందరిని ఓదారుస్తుంది, అందరికి తన అనుభవాలు చెప్పి ప్రతి ఒక్కరిలో కొత్త ఒరవడిని నింపుతుంది. ఉత్సాహాన్ని నింపుతుంది.
అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్దులను చేస్తుంది..సమైక్య భావాన్నీ కుటుంభం సభ్యులందరిలో నాటుతుంది.
నాగరికత పరివర్తనలలో భాగంగా ,ఈ పెద్దదిక్కు ప్రశస్తము క్రమంగా తగ్గుతూ వస్తుంది.
ఆ పెద్ద దిక్కనేది ఒక శ్రేయస్సుని కోరే మనుసు. ఆ లాటి మనస్ భౌతికంగా మీతోపాటు ఉండవలసన అవసరం లేదు. మీ శ్రేయస్సుని కోరే ఆ పెద్ద దిక్కు ఎక్కడైనా ఉండవచ్చు.
మీరు నన్ను క్షమించాలీ.. నేను మీ వళ్ళ ఎన్నో చెప్పలేని అణూభూతులను పొందినప్పటికీ, ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా మిమ్మలనందరిని ఒంటరిగుంపును చేసి, నేను మాత్రం మరో గుంపులోఒంటరి వాడిగా చేరబోతున్ననందుకు"" .
కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లుంది అరవింద్ ,హన్సికల పరిస్థితి.
తన సంతానము యొక్క మనసులోని మాటను గ్రహించి తానే ముందుగా నిర్ణయం చెప్పి తన పెద్ద మనసుని చాటుకున్నాడు ఆనందరావు.
ఆనంద్ రావు తీసుకున్న నిర్ణయం అందరికి ఆమోదయోగ్యమేన ?
కానీ వారి మనసులు అంగీకరిస్తాయా?
భవిష్యత్తులో జరుగబోయే పరిణామాలు డిమాండ్లు అర్థం చేసుకొని వాటికి తగ్గట్లు మేలుగుకోవడమే పెద్ద తనమని ఆలోచన విధానానికి తెరతీసిన ఆనంద రావూ నిజంగా ధన్యుడే!!