చెప్పలేని సమస్య నిర్జన ప్రదేశంలో చిరుత తరుముతుంటే, ప్రమాణాలకు తెగించి పరుగుతీసే జింకపిల్లలోని భయం ప్రస్పుటంగా కనిపిస్తుంది అక్కడ ఉన్న పదహారు సంవత్సరాల అమ్మాయిలో. నిత్యం రద్దీగా ఉండే ఛౌరస్తాకు దగ్గర్లోని పార్కుకు ఆనుకుని ఉన్న గోడకు కాస్త దగ్గరగా నిలబడి చూస్తుంది .ఉబికి వస్తున్న కన్నీటిని అపుకునే ప్రయత్నం చేస్తుందా అమ్మాయి.. ఆమె చూపుల్లో ఏదో ఒకరకమైన సిగ్గు చేతిలోని స్కూల్ బ్యాగును కాళ్ళకు దగ్గరగా తీసుకుంటూ తనలో తానే కుదించుకు పోయే ప్రయత్నం చేస్తుంది. ఎవ్వరైనా తనని చూస్తున్నారు అనుకుంటే మరింతగా తాను ముడుచుకు పోయేందుకు ప్రయత్నం చేస్తు సిగ్గుతో తల వంచుకుంటుందా అమ్మాయి. పాత బట్టలు అమ్ముకుంటూ. అదే జీవనాధారంగా బ్రతుకులాగిస్తూ తన కాళ్ళపై తాను బ్రతుకుతున్న రత్తమ్మ ఇది గమనిస్తూనే ఉంది. దాదాపుగా గంట నుండి. తన వెనుక ఎదో దాచేప్రయత్నం చేస్తున్న అమ్మాయిని చూస్తూ తన సిగ్గుకు కారణం అర్దం చేసుకుంది రత్తమ్మ. నిత్యం రద్దీగా ఉండే ఛౌరస్తా పండుగ రోజులు కావడంతో మరింత రద్దీగా ఉంది. రకరకాల మనస్తత్వాల మనుషులు.. డేగ చూపులు.అక్కడ నిత్యం ఎదురౌతునే ఉంటాయ్ ఎందరికో. అడుగులో అడుగు వేస్తూ అయ్మాయిని చేరుకున్న. రత్తమ్మ విషయం అర్థమైపోయింది అన్నట్లుగా చూసింది. అమ్మాయి కన్నుల్లో చిన్న తృప్తి. తన మూటలో నుండి జత బట్టలు తీసి చేతిలో పెట్టింది .త్వరగా మార్చుకోమంటూ రత్తమ్మ. నలుదిక్కుల నుండి చూసే చుపులకు అడ్డుగోడగా తన వంటిపై చీరను చుట్టూ పరదాగా చుట్టింది. ఎంతైనా తల్లి మనస్సు కదా .ఆడపిల్ల నెలసరి సమస్యను చెప్పకనే అర్దం చేసుకుంది...