అగ్ని బాబా. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Agni Baba

అమరావతి నగర సమీపంలో వెలపూడి,తాడేపల్లి,తుళ్ళూరు,తాడికొండ వంటి పలు గ్రామాలు ఉన్నాయి.ఒక రోజు సాయత్రం వెలగపూడికి ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్ పై వచ్చి గ్రామ పంచాయితీ కార్యాలయంలో సమావేశమైన వారిని 'అయ్యా ఈగ్రామం లోనికి అగ్ని బాబా వచ్చారా?' అని అడిగారు.
'అగ్ని బాబా నా ఆయన ఎవరు'అన్నారు గ్రామ ప్రజలు.'అగ్నిబాబా చాలా గోప్ప యోగి చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తారు. వీరి ఆశ్రమం రుషికేష్ లోఉంది.అరచేతిలో అగ్ని పుట్టించి దేవునికి హారతి ఇచ్చి ఆలా మండుతున్న కర్పూరాన్ని నోటి తో ఆర్పగలరు.కర్పురం ఆర్పిన వెంటనే వీరి నోటి నుండి వెలువడే మాటలు నిజమవుతాయి.బాబా వాక్కు వలన నేను లక్షధికారిని అయ్యాను. వారు ఇక్కడ తన శిష్యులతో తిరుగు తున్నారని తెలిసి వారి ఆశ్రమానికి లక్షరూపాయలు విరాళం ఇద్దామని వచ్చాం.దయచెసి వారు మీ గ్రామం వస్తే ఈ చిరునామకి తెలుపండి'అని వారి చిరునామా పత్రం ఇచ్చివెళ్ళారు.అలా వారు ఆప్రాంతంలోని గ్రామాలన్నింటి లోనూ అగ్నిబాబా గురించి ప్రచారం చేసారు.
వారం లోపే అగ్నిబాబా వెలగపూడిలో ప్రవేసించడం తో అక్కడి ప్రజలు తమ ఊరి దేవాలయంలోఅగ్నిబాబాకు బస ఏర్పాటు చేసారు.ఆవిషయం తెలుసుకున్న పొరుగు గ్రామాల ప్రజలు తండోప తండాలుగా అగ్ని బాబాను చూడటానికి రాసాగారు.ప్రజల అందరిముందు గాల్లో విభూధి సృష్టించి పంచుతూ,తన నోటి నుంటి కర్పూరాన్ని తీసి,అరచేతిలో పెట్టి మంత్రాలు చదవుతుండగా, అరచేతిలోని కర్పురం భగ్గున మండింది. దాన్ని గుడిలోని దేవునికి హారతి ఇచ్చి ప్రజలను కళ్ళకు అద్దు కోమని, అనంతరం అరచేతిలో మండుతున్న కర్పూరాన్ని నోట్టో వేసుకుని ఆర్పి వేసాడు అగ్నిబాబా.
ఆదృశ్యం చూసిన గ్రామ ప్రజలు 'హర హర మహదేవ్''అగ్ని బాబాకు జై'అంటూ నినా దించసాగారు.
'నాయన లారా స్వామిజి పాదాలు తాకి నమస్కరించిన వారి చేతుల మీదుగా 'తాయిత్తు'తీసుకున్నవారి కోరికలు తీరతాయి.తాయిత్తు కొన్నవారే స్వామి వారిపాదాలు తాకాలి,వచ్చే పౌర్ణమి నాడు ఈ తాయిత్తు ధరించండి అమోఘ ఫలితం ఉంటుంది'అన్నారు అగ్నిబాబా శిష్యులు.
డబ్బు చెల్లించి తాయిత్తు తీసుకుని అగ్నిబాబా పాదాలు తాకి నమస్కరించి వెళ్ళ సాగారు ప్రజలు.నాలుగు రోజులు గడిచాయి. ప్రజలు మరింత పలు గ్రామాలనుండి ఎక్కువ గా రాసాగారు.
బుజ్జిబాబు అనే సైన్సు ఉపాధ్యాయుడు వారం రోజులుగా దూర ప్రయాణంలో ఉండి ఆరోజే ఊరి లోనికి వచ్చాడు.అగ్నిబాబా విషయం తెలుసుకుని సాయంత్ర అగ్నిబాబా ఉన్న ప్రదేశానికి వెళ్ళి'అక్కడి ప్రజలు అందరు చూస్తుండగా తన నోటి లోని కర్పూరాన్ని తీసి అర చేతిలో ఉంచుకుని దాని పై నోటితో గాలి ఊదగా భగ్గున మండింది.దాన్ని ప్రజలు అందరికి చూపించి తన నోట్లో వేసుకుని ఆర్పి వేసి,గాల్లో విభూధి సృష్టించి అందరికి చూపాడు.అది చూసిన ప్రజలు ఆశ్చర్య పోయారు.
'అందరూ తెలుసు కోవలసిన విషయం ఇది.విభూధి గాల్లో సృష్టించడం ప్రతి ఇంద్రజాలకుడు చేయగలడు. కర్పురంలా కనిపించే పచ్చభాస్వరం నోట్లో తడిగా ఉండటం వలన మండదు. అరచేతిలో వేయగానే గాలి తగలడం వలన మండుతుంది.అరచేతిలో పటిక మందంగా పూసు కోవడం వలన చేయి కాలదు.మండు తున్న భాస్వరాన్ని నోట్లో వేసుకుని నోరు మూసిన వెంటనే భాస్వరం గాలి లేక ఆరిపోతుంది.ప్రాణవాయువు (గాలి)అందకపోతే ఏపదార్ధం మండదు. ఇది మాయ మంత్రంకాదు సహజమైన చర్య. అర్ధమైయిందా! అగ్నిబాబా మహత్యం,ముందుగా బాబా మనుషులు ఊర్లు తిరిగి బాబా గురించి ప్రచారం చేస్తారు.ఆ తరువాత బాబా వచ్చి భక్తి పేరుతో దోపిడి మెదలెడతారు ఇది దొంగ బాబాలకథ'అన్నాడు బుజ్జిబాబు.
విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు అగ్నిబాబా బృందాన్ని పోలీసులకు అప్పగించారు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి