
ఒక అడవిలో జంతువులన్నీ చాలాస్నేహం గా ఉండేవి.కష్టసుఖాల్లో పాలు పంచుకునేవి .చాలాసరదాగా ఆటపాటలతో గడిపేవి. వాటికి ఒక పెద్ద ఏనుగు రాజుగా ఉండేది. ఆగజరాజుకు కొన్ని ఏనుగులు మంత్రులుగా ఉండేవి. ఒకసారి అవి గజరాజు ఆధ్వర్యంలో వనమహోత్సవం జరుపుకోవాలనుకున్నాయి. వనమహోత్సవానికి గజరాజు తేదీ నిర్ణయించింది.ఆటవస్తువుల బాధ్యత చింటూ అనే కోతికి అప్పగించింది. ఆటవస్తువులు చింటూ ఎలా సమకూర్చగలదని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఆరోజునుండి అవి పోటీలకు సన్నద్దం కాసాగాయి.చింటూకోతి రోజూ పళ్ళు తీసు కుని అడవినుండి వెళ్ళిపోయేది.సాయం కాలం తిరిగి వచ్చేది.అది ఎక్కడికెళ్తోందో మిగిలిన జంతువులకు అర్థమయ్యేది కాదు . వనమహోత్సవదినం రానే వచ్చింది. ఆరోజు జంతువులన్నీకలిసికట్టుగా వెళ్ళి కొలనులో దిగాయి.ఒకదానిపై ఒకటి నీళ్ళు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ,ఈదుతూ .స్నానం చేసాయి.నీళ్ళలోకి దిగలేని జంతు వులకు ఏనుగులు తొండంతో నీళ్ళుతెచ్చి .స్నానం చేయించాయి.తర్వాత గజరాజు వనదేవతను తల్చుకుని తొండంతో పూలు పైకి విసిరి,కొండపై టెంకాయకొట్టింది.ముం దురోజు సేకరించిన రకరకాల పండ్లు,దుంప లు,ఆకులు విత్తనాలతో సహపంక్తి భోజనం చేసాయి. తర్వాత ఆటలపోటీలు ప్రారంభిస్తున్న ట్లు ప్రకటించింది గజరాజు.చింటూ కోతి చెట్టుపైనదాచిన బ్యాటు,బాలు,చదరంగం అట్ట,పావులు,స్కిప్పింగ్ తాళ్ళు తెచ్చిరాజు కిచ్చింది.ఆటవస్తువులు ఎక్కడతెచ్చావని చింటూ నడిగింది పింకీ అనే కుందేలు పిల్ల. కోతి కిచకిచమని నవ్వింది."వారం రోజులు గా పల్లెకు పండ్లు తీసుకెళ్ళాను.అక్కడ గోపీ అనే అబ్బాయికిస్తూ స్నేహం చేసాను. నిన్నటి దినం వెళ్ళి ఆడుకోవటానికి ఒక్క రోజు ఆటవస్తువులివ్వమని అడిగి,తెచ్చా ను"అని చెప్పింది చింటూ. చింటూను జంతువులన్నీ అభినందించాయి. గజరాజు మంత్రులను పోటీలకు న్యాయని ర్ణేతలుగా నియమించింది. ఏనుగులకు బ్యాటు,బాలు ఆట పోటీ ఏర్పాటుచేసింది.తాబేళ్ళకు పరుగుపందెం పోటీ పెట్టింది.కుందేల్లకు చదరంగం పోటీ పెట్టింది.నెమళ్ళకు నాట్యంపోటీలు పెట్టింది .గుర్రాలు కబడ్డీ ఆడాయి.కోతులకు స్కిప్పిం గ్ పోటీ పెట్టింది.జిరాఫీల కు ఎత్తైన చెట్ల కొమ్మలు అందుకునే పోటీపెట్టింది. అలా అన్ని జంతువులకూ రకరకాల పోటీలు పెట్టింది గజరాజు. పోటీల తర్వాత గజరాజు బహుమతుల ప్రధానోత్సవకార్యక్రమం ఏర్పాటుచేసింది. న్యాయనిర్ణేతలు విజేతలను ప్రకటించారు. చింటూ కోతి స్కిప్పింగ్ లోఓడిపోయిం ది.పింకీ కుందేలు చదరంగంలో ఓడిపోయిం ది.అవిరెండూ ముఖం వ్రేలాడేసుకున్నాయి. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా.అక్కడ నుండి జారుకున్నాయి. గజరాజు గెలిచిన కుందేళ్ళకు గంపెడు విత్తనాలు బహుమతిగా ఇచ్చింది.గెలిచిన కోతులకు అరటి గెలలుబహుమతిగాఇచ్చిం ది.ఏనుగులకు చెరుకు గెడలు బహుమతిగా ఇచ్చింది.గెలుపు గుర్రాలకు జొల్లెడు పచ్చగ డ్డి బహూకరించింది.నెమళ్ళకు గంపెడు గింజలు బహూకరించింది.జిరాఫీలకు జొల్లెడు ఆకులు బహుమతిగా ఇచ్చింది. కార్యక్రమం పూర్తయ్యాక చూస్తే చింటూ,పింకీ ఎక్కడా కనిపించలేదు. చింటూ అమ్మ పెద్దకోతి,పింకీ అమ్మ పెద్ద కుందేలు ,వాటికి తోడుగా కొన్ని జంతువులు కలిసి వెదకడానికి బయలుదేరాయి.వెదకగా వెదకగా ఓపొదచాటున కూర్చుని ఏడుస్తూ కనిపించాయి.ఏడ్చిఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం వాచిపోయివుంది. "ఏమయిందీ...ఎందుకలా ఏడుస్తున్నారు?" అడిగింది కోతి. "చదరంగం పోటీలో ఓడిపోయానుకదా! నాకు చాలా బాధగావుంది"అంది పింకీ. "స్కిప్పింగ్ పోటీలో నేనూ ఓడిపోయాను కదా!ఏడుపొస్తోంది"అంది చింటూ. ఆ మాటలకు పెద్దకోతి,పెద్ద కుందేలు నవ్వాయి. "ఓచిన్నారుల్లారా! ఆటలో గెలుపు,ఓటము లుసహజం.ఇద్దరు పోటీపడినప్పుడు ఒక్కరే గెలుస్తారు.ఓడిపోవటానికి కారణాలు చాలా వుంటాయి.వాటిని అన్వేషించాలి.చింటూ ఆటవస్తువుల సేకరణ కొరకు పల్లెకెళ్ళటంవల్ల సాధన చేయలేక పోయింది.గెలుపుకోసం తాబేళ్ళు పరుగెత్తడం సాధన చేశాయి.కుందేళ్ళు మట్టిలో చదరంగం గీసుకుని సాధన చేశాయి.నెమళ్ళు నాట్య సాధన చేశాయి.కోతులు అడవి తీగలతో తాడాట సాధన చేశాయి.గుర్రాలు,జిరాఫీలు కూడా కష్టపడి సాధన చేశాయి.మనం మరింతగా సాధనచేసి నైపుణ్యాన్ని పెంచు కుని విజయంసాధించాలి.గెలుపునే కాక ఓటమినికూడా స్వీకరించటం,సాధన,కృషి చేసి పట్టుదలతో విజయం సాధించటమే క్రీడాస్ఫూర్తి. ఓటమికి కృంగిపోకూడదు. గెలవాలనే కోరికపెంచుకోవాలి.ఆటల్లోనే కాక జీవితంలో కూడా క్రీడా స్ఫూర్తికల్గి గెలుపు,ఓటములను సమంగా చూడాలి. నిరాశను దరిచేరనివ్వకుండా సాధనచేయం డి.వచ్చేసంవత్సరం పోటీల్లో విజేతలవుతారు"అని చెప్పారు తల్లులు. చింటూ,పింకీ ముఖం మల్లెలా విచ్చుకుంది.