నిజాయితీకే పదవి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Nijayitike padavi

పిల్లలకు మిఠాయిలు పంచిన బామ్మ కథ చెప్పసాగింది.
అమరావతి రాజ్యంలో ఖజానా నిర్వాహకుడి పదవికి అర్హతతోపాటు నిజాయితీ కలిగినవ్యక్తి ని నియమించే బాధ్యత మంత్రి సుబుద్ధి తీసుకున్నాడు. అందుకు సరిపడా అర్హతలుఉన్న ఇద్దరు యువకులు వచ్చారు,వారిలో నిజాయితీపరుడైన వారిని ఎంపిక చేయడానికి మంత్రి వారితో మాట్లాడుతున్న సమయంలో ,ఓయువకుడు వచ్చి'అయ్యా నేను రత్నం శెట్టి గారి అబ్బాయిని, నాన్నగారు పోయిన వారం మీవద్ద రెండువేల వరహాలు తీసుకున్నారట అవి తిరిగి మీకు ఇచ్చిరమ్మన్నారు' అని,రెండు వరహాల మూటలు అందించి 'ఒక్కో మూటలో వేయి వరహాలు ఉన్నాయి లెక్కించండి'అన్నాడు.
'లెక్కించే సమయంలేదు నువ్వు వెళ్ళిరా'అన్నాడు మంత్రి.ఆయువకుడు వెళ్ళి పోయాడు.
'నాయనలారా నేను రాజు గారిని అవసరంగా కలవాలి నేను వెళ్లి వస్తాను.ఈ లోపుమీరు భోజనం ఇక్కడే ఏర్పాటుచేసాను. మీ ఇరువురు భోజనానంతరం ఈ మూటలోని వరహాలు సరిగ్గా ఉన్నవో లేవో లెక్కచూసి నాకుసాయంత్రం అప్పగించండి.మీకు గదులు కేటాయించాను.మీ మీ గదిలోనికే భోజనం వస్తుంది వెళ్లండి' ఉద్యోగవిషయం తరువాత మాట్లాడతాను అని చెరి ఒక వరహాల మూట అందించి మంత్రి రాజ సభకు వెళ్ళి పోయాడు.
భోజనానంతరం ఇద్దరు యువకులు కొంతసేపటి తరు వాత వారి గదులలో వరహాలమూటలు లెక్కించారు. సాయంత్రం వచ్చిన మంత్రిని కలసి తమకు ఇచ్చిన వరహాలమూట అందించి 'సరిపోయాయి వేయి వరహాలు ఉన్నాయి'అన్నాడు మొదటి యువకుడు.
రెండో యువకుడు తన చేతిలోని వరహాల మూట మంత్రి చేతికి అందిస్తూ'ఇందులో రెండు వరహాలు ఎక్కువ ఉన్నాయి'అన్నాడు.
రెండో యువకుని చేతిలోని వరహాలమూట అందుకుంటూ 'నాయనా రేపటి నుండి నీవు కోశాధికారి పనిలో చేరు. అన్నాడుమంత్రి.
'పిల్లలు మంత్రి ఇద్దరిని పరిక్షించి మెదటి యువకుని కాదని రెండోయువకుడే నిజాయితీ పరుడని ఎలా నిర్ణయించి కోశాధిపతి పదవి అప్పగించాడు చెప్పగలరా? " అన్నాడు తాతయ్య.
' మంత్రి చాలా తెలివిగా వారి నిజాయితీ పరిక్షించాడు. ముందుగా తను ఏర్పాటు చేసిన మనిషి ద్వారా ఒక్కో వరహాల మూటలో వేయి రెండు వరహాలు పెట్టించాడు.ఇరువురు యువకులను లెక్కించే పని అప్పగించినప్పుడు మెదటి యువకుడు ఎక్కువ గాఉన్న రెండు వరహాలను తను తీసుకుని వేయి వరహాలు మూటకట్టి మంత్రికి అందించాడు రెండో యువకుడు వరహాలు లెక్కించి ఎక్కువ వచ్చిన వరహాతో సహా మంత్రికి లెక్క చెప్పి తన నిజాయితీని చాటుకున్నాడు. అందుకే కోశాధికారి పదవి అతనికి లభించింది.అంటే నిజాయితికే పదవి లభించింది'అన్నాడు పిల్లలతో పాటు ఉన్న తాతయ్య.
'అవును నిజాయితికే ఎప్పుడు విజయం' అన్నది బామ్మ.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు