రాంగ్ నంబర్ - కందర్ప మూర్తి

Wrong number

నేను భారత సైన్య వైద్య విభాగంలో టెక్నికల్ సెక్షన్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కలకత్తలో జరిగిన యదార్ద సంఘటన. మా మెడికల్ యూనిట్ కమాండెంటుగా కల్నల్ జాన్ లక్సా అని ఒక ఆంగ్లోండియన్ ఉండే వారు. చూడ్డానికి ఎర్రగా పొడవుగా వెండి జుత్తుతో ఇంగ్లీష్ దొరలా ఉంటారు.ఆయనకి యూరోపియన్ ఇంగ్లీషు తప్ప మరో ఇండియన్ భాష తెలియదు.చాలా క్రమశిక్షణ సమయపాలన పాటించే వ్యక్తి. ఆయన మాట్లాడే ఆంగ్లం మా స్టాఫ్ మెంబర్సుకి అర్దం అయేది కాదు. మా సెక్షన్ ఇంచార్జ్ జూనియర్ ఆఫీసర్ జోగీందర్ సింగు అనే పంజాబి సిఖ్ సర్దార్ జీ మాకు మద్యవర్తిగా సంభాషణ నడిపేవారు. కల్నల్ సారు ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు శర్మోనియం పెరేడ్ ఏర్పాటు చేసి స్టాఫ్ మెంబర్స్ యూనిఫాం, హైర్ కట్, శరీర దారుఢ్యం పరిశీలించి డ్యూటీలకు పంపేవారు. ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత ఏదైనా అర్జంటు మెసేజ్ వస్తే సేకరించి అధికారులకు తెలియచేయడానికి డ్యూటీ క్లర్క్ తో పాటు ఆఫీస్ మెసెంజర్ నైట్ డ్యూటీలో ఉంటారు. అప్పట్లో డయల్ టెలిఫోల్ను వాడుకలో ఉండేవి. ఒకసారి నెల మొదటి సోమవారం మైదానంలో ఆర్మీ పెరేడ్ జరగవలసి ఉన్నందున తను రాలేక పోతున్నానని మా ఇన్ చార్జి ఆఫీసర్ సర్దార్జీ జోగీందర్ సింగు గారు స్టాఫ్ ని చెక్ చేసి డ్యూటీలకు పంపిండని చెప్ప డానికి ఉదయం ఏడు గంటలకు ఆఫీస్ ఫోన్ కి డయల్ చేశారు. ఆ సమయంలో డ్యూటీలో క్లర్కుతో పాటు సూరజ్ భాను అనే ఆఫీస్ బాయ్ ఉన్నారు. డ్యూటీ క్లర్కు కాలకృత్యాలు తీర్చుకోడానికి దగ్గర లో ఉన్న ఫ్యామిలీ క్వార్టర్ కి వెళ్లాడు. సూరజ్ భానికి చదువు లేదు. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తి అయినందున హిందీ తప్ప మరో భాష తెలియదు. కర్నల్ గారి ఫోన్ వచ్చి నప్పుడు సూరజ్ భాను డ్యూటీలో ఉన్నందున రిసీవర్ ఎత్తి 'హలో' ' అనగానే అటునుంచి ఇంగ్లిష్ లో కర్నల్ గారి గొంతుక వినగానే వినయంగా నిలబడి 'రామ్--రామ్' అన్నాడు. వెంటనే ఫోన్ డిస్ కనెక్టు అయింది. సూరజ్ కి అర్దం కాక రిసీవర్ పెట్టేసాడు. కొద్ది సేపయిన తర్వాత మళ్లీ ఫోన్ రింగవగా రిసీవర్ ఎత్తి 'హలో ' అనగానే కర్నల్ గారి గొంతుక విని 'రామ్ రామ్ ' అన్నాడు.ఫోన్ కట్ అయింది. ఎందుకు ప్రతి సారి ఫోన్ కట్ అవుతోందో అర్దం కాలేదు ఆఫీస్ బాయ్ కి. కాలకృత్యాలు తీర్చుకు వచ్చిన డ్యూటీ క్లర్కుకి విషయం చెప్పాడు. ఏమైందోనని అతనూ తర్జనబర్జన పడ్డాడు. ఈలోపున ఎనిమిది గంటలై రొటీన్ స్టాఫ్ రాగా నైట్ డ్యూటీ వాళ్లు వెళిపోయారు. అక్కడ పెరేడ్ గ్రౌండ్లో యూనిట్ స్టాఫ్ యూనిఫాంలో తయారయి కర్నల్ గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ పెరేడుకి పది నిమిషాలు ముందువచ్చే కర్నల్ గారు అర్థగంట దాటినా రాక పోయేసరికి మా ఇంచార్జి జోగీందర్ సింగ్ , మిగతా స్టాఫ్ తర్జనబర్జన పడుతూంటే కమాండెంటు కారు ఆఫీస్ ముందు వచ్చి ఆగింది. జోగీందర్ సింగ్ పరుగున కారు దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసి నిలబడగా స్టాఫ్ ని డ్యూటీలకు పంపి తన ఆఫీస్ ఛాంబర్ కి రావల్సిందిగా ఆదేశించారు. కర్నల్ గారు చెప్పి నట్టు సిబ్బందిని వారి వారి డిపార్టుమెంట్లకు పంపి ఆపీసుకి రాగానే , ఈరోజు ఉదయం ఏడు గంటలకు టెలిఫోన్ డ్యూటీ మీద ఎవరున్నారో వెంటనే నా ముందు హాజర్ పర్చండని జూనియర్ ఆఫీసర్ కి ఆర్డర్ వేశారు. విషయం అర్దం కాక జోగీందర్ సింగ్ అటెండర్ని దగ్గరున్న ఫేమిలీ క్వార్టర్ కి పంపి డ్యూటీ క్లర్కుని ఆఫీస్ బాయ్ సూరజ్ భాన్ ని కమాండెంట్ చాంబర్ కి రప్పించారు. "నేను ఈరోజు పెరేడ్ కి రాలేకపోతున్న విషయం మెస్ లో మీకు చెప్పమని ఉదయం ఏడు గంటలకు ఆఫీసు టెలిఫోన్ కి మూడుసార్లు రింగ్ చేసినా రాంగ్ రాంగ్ నంబర్ అని సమాధానం వచ్చింది.విషయం తెలుసుకుని నాకు చెప్పండి. వీళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఇస్తాను"అన్నారు కర్నల్ గారు ఇంగ్లీష్ లో సీరియస్ గా. ఇంచార్జి ఆఫీసర్ జోగీందర్ సింగు హిందీలో జరిగిన సంఘటన వివరాలు వార్ని అడిగి తెలుసుకోగా , డ్యూటీ క్లర్కు కాలకృత్యాలు తీర్చుకోడానికని వెళ్ళినప్పుడు, కర్నల్ గారి ఫోన్ రావడం దాన్ని ఆఫీస్ బోయ్ ఎత్తి ' రామ్ రామ్ ' అనడం భాష అవగాహన లోపం వల్ల కమాండెంటు గారు రాంగ్ నంబర్ గా భావించి ఫోన్ డిస్కనెక్టు చెయ్యడం జరిగింది. జరిగిన పొరపాటు ను కర్నల్ గారికి ఇంగ్లీషు లో తెలియచేస్తూ "సర్ , ఇండియా ఉత్తర ప్రాంత గ్రామీణులు హిందీలో గుడ్ మార్నింగ్ ని "రామ్--రామ్"అని తెలియచేస్తారని వివరించాడు మా ఇంచార్జ్ ఆఫీసర్. అసలు విషయం తెలుసుకుని ఆంగ్లోండియన్ కర్నల్ గారు "సారీ " చెప్పారు. ఈ సంఘటన వివరాలు జోగీందర్ సింగు మా స్టాఫ్ కి చెప్పినప్పుడు అందరం తెగ నవ్వు కున్నాం. *** *** ***

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు