బాంబే బ్లడ్ గ్రూప్ - రాము కోలా.దెందుకూరు

Bombay blood group

అమ్మా....! "నిన్ను కాపాడుకోలేని నిస్సహాయత, నన్ను అవహేళన చేస్తుంది..." "నాకు జన్మనిచ్చిన నీ ఋణం తీర్చుకోలేక పోతున్నా" "నన్ను క్షమించు" మోకాళ్ళు మీద కూర్చుని విలపిస్తుంది రమ్యా "ఇక్కడ పార్వతమ్మగారు తరుపున ఎవ్వరైనా ఉన్నారా?" డాక్టర్ గారు కలవమంటున్నారు త్వరగా రండి" "సిస్టర్ మాటలకు కన్నులు తూడ్చుకుంటూ, ఎటువంటి దుర్వార్త వినవలసి వస్తుందో,అనే భయంతో డాక్టర్ గారి క్యాబిన్ లోకి నడిచింది రమ్యా. ****** "తలలో కణితిని తొరిగించాలంటే ఐదు లక్షలు దాకా ఖర్చు అవుతుంది" అన్న డాక్టర్ , డబ్బులు లేకుండా అమ్మకు ఆపరేషన్ ఎలా చేసారో!" రమ్యకు అర్థంకాని బేతాళ ప్రశ్నగా మిగిలింది.. పార్వతమ్మ గారిని డిశ్చార్జి చేస్తున్నారనే విషయం తెలిసిన మరుక్షణం,ఆనందాశ్రువులతో డాక్టర్ గార్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలని పర్మిషన్ తీసుకుని డాక్టర్ గారి క్యాబిన్ లోపలకు నడిచింది రమ్యా. "డాక్టర్ గారు స్టడీ చేస్తున్న ఫైల్ పక్కన పెట్టి, మీ అమ్మగారిని సంతోషంగా ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు.." "నౌ ..సీ ఈజ్ ఆల్ రైట్"మరో నెల తరువాత ఒక్కసారి చెకప్ కోసం తీసుకు రావాల్సి ఉంటుంది" ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ "మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు" అమ్మకు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేని పరీస్థితిలో ఆదుకున్న దేవుడు మీరు" చేతులు ఎత్తి నమస్కరించింది రమ్యా. "ముసి ముసి గా నవ్వుతూ రమ్యకు ఓ లెటర్ అందించాడు డాక్టర్ చక్రధర్. ***** ఇంటికి చేరుకున్న తరువాత డాక్టర్ అందించిన కవర్ ఓపెన్ చేసి చూసింది రమ్యా. "గత సంవత్సరం మా పాపకు" బాంబే పాజిటివ్ బ్లడ్ "కావాల్సి ,బాంబే బ్లడ్ గ్రూప్ సెంట్రల్ బ్లడ్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకున్న వారి వివరాలు తెలుసుకుని మిమ్మల్ని సంప్రదించాను. మీరు ఆరోజు బ్లడ్ డొనేట్ చేయడం వలన మా పాప నేడు మా ముందు చిరునవ్వులతో తిరుగుతుంది. మీకు ఆరోజు ఏదో సహాయం చేయాలనుకున్నాం.మీరు సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయారు." "ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం ఈ రోజు ఇక్కడకు వచ్చిన నాకు మీరు కనిపించారు.డాక్టర్ గారి ద్వారా విషయం తెలుసుకున్నాను ." "ఆరోజు మీకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను ,ఈ రోజు మీ అమ్మగారి వైద్యం కోసం సహకరించి నా బాధ్యతను నెరవేర్చుకున్నాను" ఇది నా బాధ్యత కూడా. ఇది మీకు ముందే చెప్పాలనుకున్నా మీ వ్యక్తిత్వాన్ని తలచుకుని చెప్పలేక పోయాను, అన్యధా భావించకండి. ఇట్లు నీ శ్రేయోభిలాషి. డా. ప్రణతి. చదివిన రమ్య మనస్సు వెన్నపూసలా కరిగి ఆనంధాశ్రువులుగా మారింది.మానవత్వం నింపుకున్న మానవ సంబంధాలను తలుచుకుంటూ.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు