గత నాలుగు రోజులుగా, జలుబు, జ్వరంతో చాలా ఇబ్బంది పడ్డ నాకు..., ఈ రోజు నిద్ర లేవగానే ఒళ్ళు కాస్తా తెలికై స్వాధీనంలోకి వచ్చినట్లనిపించింది. నేనెప్పుడు నిద్ర లేస్తానా... అని, ఎదురుచూస్తూ కాపలా కాస్తున్నట్లున్నారు మా పిల్లలు, నేను లేవగానే, పరుగున వెళ్లి వాళ్ళమ్మను వెంటతీసుకొని వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయారు.
నా శ్రీమతి.., సహాయంతో కాలకృత్యాలు తీర్చుచుకొని, బ్రష్ చేసుకొని, వేడి వేడిగా కాఫీ తాగుతుంటే..., చాలా రేలీఫ్ గా, (ఫెష్ గా అనిపించింది.
అలా..కాఫీ (తాగుతూ..., ఆ రోజు దిన ప(తికను తిరగేసాను, అందులోని వార్త ఒకటి నన్ను విశేషంగా ఆకట్టుకొని.., ఆలోచింపజేసింది.
ఆ వార్త చదివాక.., నా అంతరాత్మ అడిగిన అనేక ప్రశ్నలు నన్ను వేలెత్తి చూపి ఆలోచింప- జేసాయి.
నిజంగా నేను చేస్తున్నదేమిటి?
ఇన్నాళ్లుగా గిరిగీసుకొని, నా వాళ్ళ మద్యే, నేను ఒంటరినయ్యానా? అందరితో కలివిడిగా ఉంటే చులకనౌతానన్న నా అభి(పాపయం సబబు కాదా?
మరి,... అందరూ.... నన్నెందుకు గౌరవిస్తున్నట్లు?
నిజంగా నన్ను గౌరవించే వారంతా నన్ను గౌరవిస్తున్నారా?.., లేదా నటిస్తున్నారా?.
నాకెందుకో,...ఈ కరోనా లాక్ డౌన్, నాకొచ్చిన జ్వరం, నన్ను సెల్ఫ్ లాక్ డౌన్ నుండి బైటికి వచ్చి ఆలోచించేలా చేసిందనిపించింది.
ఇంతకు నన్ను ఆలోచింప చేసిన ప(తికలోని ఆ వార్త ఏంటంటే?
'ఒక తల్లి కరోన వైరస్ సోకి చనిపోయింది. ఆమెకు ఒక కొడుకు, కోడలు,...వారిద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది, ఇద్దరు గాంధీ హాస్పిటల్లో క్వారంటైన్ లో ఉన్నారు. కోడలు నిండు చూలాలు, అలస్యం చేస్తే తల్లి, బిడ్డ ఇద్దరికి ప్రమాదమని డాక్టర్ బావించారు,. 'మామూలు సమయమైతే ఇది చాలా సాధారణమైన కేసు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే "కరోన".,..!!, తల్లి, బిడ్డ, క్షేమంగా ఉండాలంటే ఆపరేషన్ తప్పనిసరి,.. కానీ ఇదంత సులువైనది కాదు, ఎందుకంటే, కరోనా వల్ల తల్లి, బిడ్డలతో పాటు, ఇందులో పాల్గొనే వైద్యబృందం అందరూ రిస్క్ ఫేస్ చేయాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా అందరూ ఇబ్బందుల్లో పడతారు.
వేల కొద్ది సర్జరీలు అవలీలగా చేసిన, గైనిక్ స్పెషలిస్ట్ కూడా, ఇదే మొదటి కేసన్నంత కొత్తగా ఫీలయ్యారట'.
'కానీ కథ సుకాంతం అయ్యింది'.
ఇక్కడే నా ఆలోచన మొదలైంది?..,
పుట్టిన బిడ్డకు నెగటివ్ వచ్చింది. అందుకే బిడ్డను పద్నాలుగురోజులు లేదా తల్లికి నెగెటివ్ వచ్చేంతవరకు తల్లికి దూరంగా వుంచారు. పాపం అప్పుడే పుట్టిన పసిబిడ్డ, తన తల్లి స్పర్శకు నోచుకోకుండానే దూరమైంది. ఇక ఆ తల్లి, నవమాసాలు మోసి, కన్న తన కన్నబిడ్డ ముఖమైనా సరుగ్గా చూసుకోక ముందే, తల్లి పొత్తిళ్లకు దూరమైంది.
ఆ తల్లి బిడ్డలు పడే వేదన నన్ను కలచి వేసింది! నా మనసు బరువెక్కింది.., ఘాడంగా ఒక్క నిట్టూర్పుతో ఆ బాధను మరచిపోలేక పోయాను. పదే.. పదే ఆ సంఘటన నా గుండెను కెలుకుతున్నట్లనిపించింది.
అప్రయత్నంగా నా కళ్ళుల్లో నీళ్లు తిరిగాయి. ఆ వార్త చదివి, ఇంతలా చలించిపోయిన నేను, మరి ఇన్నాళ్లు చేస్తున్నదేమిటి? నాకు దయ,జాలి, కరుణ ఏమి లేవా? నా హృదయం పాషణమైందా? మరి ఇంతకాలం నా కళ్ళెందుకు చెమ్మగిల్లలేదు? నేనెందుకలా మారాను?
నా అన్నవాళ్ళందరిని భౌతికంగా దూరంపెట్టిన నేను, అదే క్రమశిక్షణ, అలాగుంటేనే మంచిది, అందరికి భయ భక్తులుండాలంటే,... నేనలాగే ఉండాలనుకోవటం, అందరికి దూరంగా ఒంటరిగా ఉండటం,.. నా తప్పు కాదా?
నా ఆలోచనలు నన్ను నిలదీస్తున్నాయి?
నాలో వచ్చిన ఈ మార్పుకు మరో కారణం కూడా ఉంది....!.
నేను జ్వరంతో ఇబ్బంది పడ్డ నాలుగురోజులు, నేను దూరం పెట్టిన నా భార్య పిల్లలే, నాకు సమయానుసారం మందులు వేయడం, తడి బట్టతో ఒళ్ళు తుడవటం, కాళ్ళు, చేతులు వత్తడం, జ్యూసులు,జావలు చేసి ఇవ్వడం, నాకోసం నిద్రమేల్కొని నాకు సపర్యలు చేయడం...., చేశారు. నేను వారిని దూరం పెట్టినా.., వారు మాత్రం నాకు (పేమతో సేవాలుచేసారు. నా ప్రవర్తన నాకే సిగ్గంపించింది, వారి అప్యాయత గుర్తుకు రాగానే, వెచ్చని కన్నీరు నా చెంపలకు తగిలింది.
బహుషా ఇన్నాళ్లు ఘనీభవించి, పాషాణమైన నా మనసు మెల్లగా కరగటం మొదలైనట్లుంది.
నేనొక గెజిటెడ్ హోదాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని, కారు, బంగ్లా, నౌకార్లు చాకర్లు, ఎక్కడికెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతాలు నాకు తెలియకుండానే నాలో అహంభావాన్ని పెంచాయి. మిగిలిన వారికంటే నేను ప్రత్యేకం అనే భావన, నాకు అంతకు ముందు లేని, డాబు, దర్పాన్ని తెచ్చిపెట్టాయి.
దీనికితోడు బంధువులు ,స్నేహితులంతా నన్ను నెత్తినెక్కించుకోవడంతో,.. నా కళ్ళు కూడా నెత్తికెక్కాయి.
ఇది అంతటితో ఆగితే బాగుండేది, కానీ ఈ కొత్తగా అంటిన జాఢ్యాన్ని, మాఇంట్లోకి కూడా మోసుకొచ్చాను నేను.
నాకు తేలిసిన గౌరవం ఏంటంటే,.. నన్ను చూసి అందరూ భయపడటం, నా ముందు ఎవ్వరు మాట్లాడకపోవటం, నన్ను చూడగానే కూర్చున్నవాళ్ళు లేవడం, అప్పటివరకు మాట్లాడిన వారంతా నన్ను చూడగానే సైలెంట్ అయిపోవడం.
ఇలా ఇంటా బైట నాకు అలవాటై, అందరూ నాకు చాలా గౌరవం ఇస్తున్నారనుకుంటున్నాను.
నా భార్య కూడా నాతో చనువుగా ఉండదు, దానికి కారణం కూడా నేనే,...అమెను కూడా నా హోదా కళ్ళతోనే చూసేవాడిని. తనకేమి తెలియదని తక్కువచేసి మాట్లాడటం, చీదరించుకోవడం వల్ల, తను నాముందు మాట్లాడటానికే కాదు, అసలు నా ముందుకు రావడానికి కూడా భయపడేది. అందుకే అవసరమై నేను పిలిచినప్పుడు తప్ప, తను నా దగ్గరకు వచ్చేది కాదు.
ఇక ,..మా పిల్లలు కూడా అంతే? నన్ను చూస్తే హడలిపోయేవారు. వాళ్లకేం కావాలన్నా వాళ్ళమ్మనే అడిగేవారు. వాళ్ళు కొంచం అల్లరిచేసినా నేను మా ఆవిడ మీద నిప్పులు చెరిగేవాడిని. "ఏంటా గోల ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి, బుద్దిలేకపోతే సరి.” అని కసిరేసరికి తల్లి పిల్లలు అందరూ అక్కడినుండి మౌనంగా బిక్కు బిక్కు మంటూ వెళ్ళిపోతారు.
నన్ను చూసి అందరూ అలా హడలి పోవటం చూస్తే, నాకు చాలా గర్వాంగా ఉందేదీ.
కానీ లాక్ డౌన్ నన్ను ఇంటికే పరిమితం చేసింది. మా పెద్ద ఇంట్లో నేను ఒంటరిని, నాతో ఎవ్వరు మాట్లాడారు, నా పనులన్నీ గదిలోనే, నేను తినడానుకి తప్ప బైటికి రాను. ఒకవేళ నేను బైటికి వస్తే, ఇంట్లోవాళ్ళంతా గదుల్లోకి వెళ్ళిపోతారు. అంతా నిశ్శబ్దం, నాకు పిచ్చెక్కుతుంది,..ఒక్కోసారి ఏంటీ జీవితం అనిపిస్తుంది.
ఇలా,.. ఇల్లు కదలకుండా ఇంట్లో ఉండటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బైటికి వెళ్లలేను, ఇంట్లో ఉండలేను. నాలో నేను చాలా కుమిలిపోతున్నాను, నాకు ఒకరోజు ఒక యుగంలా గడుస్తుంది. ఎప్పుడు నాకు ఈ జైలు నుండి విముక్తి దొరుకుతుందా అని రోజులు లెక్కపెడుతున్నాను.
నాకే కాదు, మా ఇంట్లో వాళ్లకు కూడా, నేనింట్లో ఉండటం ఇబ్బందిగానే ఉంది.
నా వెనుక మా పిల్లలు...,
"అమ్మా నాన్న ఎప్పుడు బైటికి వెళతాడు, " అని,. నా వెనుక మా పిల్లలు...,
"అమ్మగారు అయ్యగారింట్లో ఉంటే ఇంటికి రావాలంటే బయమేస్తుందమ్మా" అని మా పనిపిల్ల మా ఆవిడతో అనే మాటలు, నా చెవిని దాటి పోలేదు.
నిజంగా, నేను తప్పు చేస్తున్నానని మొదటిసారి అనిపించింది!.
నాకు అవకాశం వుండికూడా గిరిగీసుకొని ,...నేను మా కుటుంబాన్ని దూరంపెట్టి ఒంటరినయ్యాను.
పాపం! ఆ కరోనా సోకిన తల్లి విధి రాత వలన బిడ్డకు దూరమైంది. అవకాశం ఉండి నేను, అవకాశం లేక ఆ తల్లి ఇద్దరం ఏడుస్తున్నాము.
కానీ...., మొన్న జ్వరంతో ఒళ్ళు తెలియకుండా ఉన్నప్పుడు, నన్ను కంటికి రెప్పలా కాచిన నా జీవిత భాగస్వామిని కూడా అహoకారంతో నేను దూరం పెట్టాను. తమ చిట్టి చేతులతో నా కాళ్ళు చేతులు పట్టిన..., నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలను కూడా నేను దగ్గరికి తీసుకోలేక పోయాను.
ఇవన్నీ..., గుర్తుకు రాగానే,..మనసు ద్రవీభవించి బాధ మనసును మెలిపెట్టింది.
అందుకే.., నేనింతకాలం చేసిన పని మొదటి సారిగా నాకే అసహ్యంగా తోచింది!
ఈ లాక్ డౌన్ ఎన్నాళ్ళుంటుందో తెలియదు?.., ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ నన్ను నేను మార్చుకోవాలి?
ఒకవేళ మార్చుకోకుంటే,.. నా అనే వాళ్లకు నేను మరెప్పుడూ దగ్గర కాలేనంతగా దూరమైపోతాను. అందుకే, తప్పనిసరై నన్ను నేను మార్చుకునే ప్రయత్నం మొదలు పెట్టాను.నాకు!.
*****************
ఆ మరునాడు నేనే నా గది దాటి బైటికి వచ్చాను, నన్ను చూడగానే అంతా నిశ్శబ్దం అందరూ నన్నొ విలన్ లా చూస్తున్నారనిపించింది. అంతకు ముందు నన్ను అలా చూస్తే నాకు చాలా గర్వాంగా ఉండేది. కానీ నా ఆలోచన మారటం వల్ల నాకిప్పుడు ఇది ఇబ్బందిగా ఉంది.
నేను సోఫాలో టీవీ ముందు కూర్చొని, "ఒక కాఫీ ఇస్తావ మేడం", అని మా అవిడనడిగాను, ఇలా వేళకాని వేళలో నేను కాఫీ అడగటం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా! అలాగే అమెనలా ఆప్యాయంగా పిలవడం కూడా.,....
అలాగే నంటూ మా ఆవిడ కిచన్ లోకి పరుగులాంటి నడకతో వెళ్ళింది. మా పిల్లలిద్దరూ ఆడుతున్న క్యారమ్స్ పక్కన పెట్టి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఇల్లంతా పిన్ (డాప్ సైలెంట్ అయ్యింది.
నేను మెల్లగా కిచన్ లోకి వెళ్లాను, నన్ను చూడగానే మా ఆవిడ మరింత కంగారు పడి ఇదిగో తెస్తున్నానండి, కొంచం ఆలస్యం అయ్యింది అంటూ,.. సారి చెప్పింది.
మెల్లగా పెట్టు కంగారేమిలేదు అని, "ఔను పిల్లలు కాఫీ (తాగుతారా?' అని అడిగాను. "లేదండి అది..., అప్పుడప్పుడు (తాగుతారంతే" అంది, నీనెక్కడ తిడతానో అన్న భయంతో ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయి..
"సరే.. నాలుగు కాఫీ పెట్టు" అన్నాను, భయంతో ఎందుకు?, ఏమిటి?, అని అనకుండా" అలాగే నండి" అంది ముఖం మీద కారుతున్న చెమటలను తూడ్చుకుంటూ..
తన కాళ్ళు చేతులు వణకడం గమనించి, నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను.
టీవీ లో సినిమా ఏదో పెట్టి, మళ్ళీ సోఫాలో కూర్చున్నాను.
కాఫీలొచ్చాయి, స్నాక్స్ అన్నాను ఒక్క క్షణంలో బిస్కెట్స్ ఆరెంజ్ చేసింది నా శ్రీమతి.
"కూర్చో" అన్నాను.
"కిచెన్ లో పనుందండి అంది" అలాగే నిలబడి బెరుకుగా., నాకు కొంచం బాదనిపించింది.
ఇలా నావాళ్ళు కూడా పరాయివాళ్ళలా నన్ను చూసి ఇబ్బందిపడుతున్నారంటే, నా ప్రవర్తన వారినెంత ఇబ్బంది పెట్టివుంటుందో కదా! అనుకున్నాను.
"వెళుదువుగాని పిల్లల్ని రమ్మను" అన్నాను, అలాగేనండి అంటూ వెళ్లి వాళ్ళిద్దరికి తీసుకొచ్చింది.
పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ వెనకాల నక్కి నక్కి బిక్కు బిక్కు మంటూ వచ్చారు.
అందరూ ఎదో శిక్ష పడబోతున్న దోషుల్లా చేతులుకట్టుకొని, తలవంచుకొని నిలబడ్డారు.
నా గుండె బాదతో బరువెక్కింది.
నేను లేచి మా పిల్లలిద్దర్ని దగ్గరికి లాక్కొని, నాకు చెరోపక్క కూర్చోబెట్టుకున్నాను. నా శ్రీమతిని బలవంతగా నా ఎదురుగా కూర్చో బెట్టాను. ఆమె చాలా భయంగా ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందన్నట్లు, ఆముదం తాగిన ముఖం పెట్టి చాలా పేలవంగా భయం భయంగా, రాని నవ్వును ముఖం పై పులుముకుంటూ మ్యానేజ్ చేస్తున్నట్లుంది.
చోరువ తీసుకొని, నేనే అందరికి కాఫీలందించాను. పిల్లలు వద్దన్నా పర్వాలేదని (తాగమన్నాను. బిస్కెట్స్ తిని అందరం కాఫీ త్రాగాము, "ఏసీ" లో ఉన్నా నాకు తప్ప అందరికి చెమటలు కారుతున్నాయి.
మధ్యాహ్నం భోజనం లోకి మెనూ చెప్పి, పిల్లలను మీకేంకావలో చెప్పండి అన్నాను.
వాళ్ళమ్మ చెవిలో గుస గుసగా చెప్పారు.
ఆ తరువాత, వాళ్ళతో కలిసి క్యారమ్స్, చెస్ ఆడాను.
ఆ తరువాత కొద్దిసేపు కిచెన్ లో మా ఆవిడకు సహాయం చేసాను.
అందరం కలిసి భోంచేసాము.
నన్ను చూసి మా కుటుంబ సబ్యులకు చాల వింతగా అనిపించినట్లుంది. అంతా అశ్చర్యంగా నన్నొ వింత జంతువుకు మల్లే చూస్తున్నారు.
ఎప్పటిలా కాక, అందరికి ఒకేదగ్గర పడక ఏర్పాటు చేసాను. పిల్లల్ని నాకు చెరోపక్కన పడుకోబెట్టుకొని,వాళ్ల కాళ్ళు తీసి నామీద వేసుకున్నాను. కొద్దిసేపు బిగుసుకు పోయినా తరువాత కాస్త తేరుకున్నారు.
వారికి ఇష్టమైన కథ అడిగాను, వారేమి మాట్లాడలేదు, నేనే వారికి ఓ మంచి కథను చెపుతుండగానే, మెల్లగా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు.
దూరంనుండే మా ఆవిడ తలపై చేయి వేసి సుతిమెత్తగా నిమిరాను, తను నాచేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని, తన వెచ్చని పెదవులకు అనించింది.
పిల్లలు నిద్రపోయారని నిర్ధారించుకొని, మా ఆవిడ, నేను మరో గదిలోకి వెళ్ళాము.
నేను ఆ రా(తి మనఃపూర్తిగా, మా ఆవిడతో మాట్లాడాను. పశ్చాతాపంతో తన ఒడిలో తలపెట్టి నా వల్ల కలిగిన ఇబ్బందికి క్షమించమని అడిగాను?
"ఛ.... ఛా..అవేం మాటలాడి" అంటూ, తను నన్ను(పేమతో గట్టిగా వాటేసుకొని, నా పెదవులను తన పెదవులతో బంధించింది. 'ఇంకా ఏమి మాట్లాడ వద్దు, నిన్ను క్షమించాను అని తన ఆధారామృతాన్ని నాకు అందించినట్లనిపించింది నాకు'.
నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది.
మా ఆవిడ నాదగ్గర తనను తాను మరచిపోయింది. తను అంత సంతోషంగా ఉండటం మునుపెన్నడూ చూడలేదు నేను.
నాకు కూడా నా జీవితంలో అంతటి తృప్తి, ఆనందం ఎప్పుడు కలగలేదు, బహుశా అది శరీర సుఖాల వల్ల వచ్చినది కాదనుకుంటాను, మా మనసుల పవిత్ర సంగమం వల్ల వచ్చిన మాధారానుభూతి అయ్యుంటుంది అనిపించింది.
నా మూర్ఖత్వం వల్ల నేనేం కోల్పోయానో తెలిసి వచ్చింది. చాలా రోజులవతారువాత ఆదమరచి నిద్రపోయాను.
ఆ తరువాత నా చొరవ కారణంగా, పిల్లలతో బాగా కలసిపోయాను, ఇంటి పనులన్నింటిలోను నా శ్రీమతికి నావల్ల చేతనైన సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.
ఏదైనా మనం మనస్పూర్తిగా ప్రయత్నంచేస్తే కొంచం ఆలస్యం కావొచ్చేమో కానీ, అసాధ్యం మాత్రం కాదు.
ఇప్పుడదే నిజమైంది, నా భార్య పిల్లలు నన్నొ స్నేహితుడిగా చూస్తున్నారు. చనువుగా నాతో కలిసి పోతున్నారు. అన్నివిషయాలు..., నాతో పంచుకుంటున్నారు. నాతోపాటు నా
భార్య పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
నాకు రోజులు తెలియకుండానే గడచి పోతున్నాయి. అస్సలు బోర్ అనిపించడం లేదు.
మా పనమ్మాయి ఈ వార్త కాలనీ మొత్తము అంటించినట్లుంది.
అదివరకు నాతో మాట్లాడని వారు కూడా, నాకు విష్ చేసి మరీ పలకరిస్తున్నారు.
రోజు మేం నలుగురం కలిసి బైట కొద్దిసేపు షటిల్ ఆడటం, వీలైతే కొద్దిసేపు అలా పార్కులోకి వెళ్లి నడిచి రావడం.
మా ఆవిడ కోరిక మేరకు, అప్పుడప్పుడు మా పనమ్మాయి వుండే కాలానికి వెళ్లి, అక్కడి పేదలందరికి పప్పు, ఉప్పులు పంచిరావడం. మా పనమ్మాయికి అడగకుండానే జీతం పెంచడం, కాలనిలో వాళ్ళతో మాట్లాడి అందరి సహకారంతో పేదవాళ్లకు వీలైనంత సహాయం చేయడం,..
ఇలా తోచిన సేవా కార్యక్రమాలు, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నా జీవితంలో సంతోషాలను నింపాయి.
మునుపటిలా కాక, మా పనమ్మాయి కూడా నన్ను చూడగానే, "నమస్తే సారు" అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది.
ఇప్పుడు మా పనమ్మాయి "అయ్యగారెంత మంచివారమ్మ"! అని, రోజు ఓ పదిమార్లు మా అవిడ ముందు నన్ను పొగుడటం, అది విని మా ఆవిడ ఆ..ఇంకా., ఇంకా, అని తరచి తరచి అడుగుతూ.., భూమికి ఫీటు పైన గాలిలో తెలిపోవటం పరిపాటైంది.
నాకిప్పుడు మునుపటికన్నా, ఎక్కువ గౌరవం పొందుతున్నట్లనిపించింది,.. అదీ (పేమతో.
ఈ లక్డౌన్ ఇలాగే, మరి కొన్నాళ్లుంటే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు నా బార్యపిల్లలతో ఇలా ఉంటే నాకసలు సమయమే తెలియటం లేదు, రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.
ఇక ఎప్పుడూ ఇలాగే, అందరితో హాయిగా కలిసిపోయి, అందరిని పలకరిస్తూ,నవ్వుతూ,నవ్విస్తూ ఉండాలనుకున్నాను.
మనకున్న హోదాలు, మన ఉద్యోగాలు అన్ని ఒకనాడు పోయేవే, అంతెందుకు మనమూ అంతేగా,.. అందుకే ఉన్నన్నినాళ్ళు కలివిడిగా అందరితో సరదాగా ఉంటే, ఈ హోదాలు వగైరా వున్నా లేకున్నా సంతోషంగా ఉండొచ్చు.
మనకు దక్కాల్సింది, (పేమతో ఇచ్చే గౌరవం అంతేకాని, హోదవల్ల వచ్చేది కాదు. కలివిడిగా ఉంటేనో,... లేదా కలసి ఉంటేనో,.. ఎవ్వరూ చులక నవ్వరు,.. ఇది నేను నేర్చుకున్న పాఠం. "సంతోషం వెతికితే దొరకదు, దానిని మనమే సృష్టించకోవాలి". జీవిత పరమార్ధం అదేకదా!
.....సమాప్తం.....