డెత్త్ ప్రూఫ్ - రాముకోలా.దెందుకూరు.

Death proof

"ఏం మిత్రమా! హార్రర్ చిత్రాలు చూడడం ఇదే‌ మొదటి సారా! అంతగా భయపడుతున్నారు..." నవ్వుతూ పలకరించాడు పక్క సీట్లో వ్యక్తి. "వీడెవ్వడండి బాబు ట్వీస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ సినిమా తీసాడు." "భయపడని వాడిని కూడా భయపెట్టేసాడు." "ఏం మీకు భయమనిపించ లేదా?" సిగరేట్ పొగలు పొగలు వదులుతూ అడిగాడా యువకుడు.. "లేదు...ఎందుకంటే ఆ కధ నాకధ,నాకు తెలిసిన కధ కనుక." "అవునా!కొంపతీసి సినిమా రైటర్ మీరు కాదు కదా?పకపకా నవ్వాడా యువకుడు.. కాదు!ఆ చిత్రంలో పాత్ర నేనే..కాబట్టి..అన్నాడా వ్యక్తి. ఎదుటి వ్యక్తిని పిచ్చి వాడిని చూసినట్లు చూసాడా యువకుడు.. ఊరు కొండి సార్.. "హార్రర్ సినిమా హాల్లో కామెడి కథలు చెప్పకండి సార్.." "లేదు మిత్రమా !ఈ సినిమా డైరెక్టర్ కూడా నేనే" అయ్యబాబోయ్ ఆపండి సార్ మీ పంచ్ డైలాగులు మీ జోకులు మీరూనూ..." "సినిమాలో డైరెక్టర్ ను అతని భార్య చంపేస్తుంది కదా!" "మరి మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కదా! కొంప తీసి మీరు దెయ్యం కాదుకదా?" పొట్ట చేత పట్టుకుని నవ్వలేక మెలికలు తిరుగుతున్నాడా యువకుడు. "అవును నా భార్యే నన్ను చంపింది కత్తితో పోడిచి కావాలంటే చూడండి." సర్ట్ పైకి లేపి గుండెలు దగ్గర గాటు చూపించాడు పక్క సీట్లో వ్యక్తి. "నా జీవితంలో ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ ఆస్వాదించడం ఇదే మొదటి సారి." "చెప్పండి సార్ !ఇంకా నమ్మలేని నిజాలు ఉంటే చెప్పండి..వినిపెడతానూ.." అన్నాడా యువకుడు... "నిజం మిత్రమా!ఈ కథ నా సొంతం.నేనే వ్రాసుకుని డైరెక్ట్ చేసి తీసాను." "కథ ముందుగా చదివేసి అచ్చం సినిమాలోలా నా భార్య నన్ను హత్య చేసింది.కొట్ల ఆస్తికోసం. కొన్ని రోజులు తరువాత నా అసిస్టెంట్ డైరెక్టర్ తన పేరుతో సినిమా రిలీజ్ చేసుకున్నాడు.అంతే.." "ఊరు కొండి సార్..వినడానికి నేనే దొరికాడా! లేక ఎర్రగడ్డ ఆస్పత్రి నుండి మీరేమైనా పారిపోయి వచ్చారా.." "ఏదైనా చెపితే కాస్త నమ్మెలా ఉండాలి సార్.. ఇక ఊరుకొండి సినిమా చూడండి." *** "హలో!మాస్టార్..ధియేటర్ లో మంచి కంపెనీ ఇచ్చారు." "రండి మిమ్మల్ని ఎక్కడ దించాలో చెపితే అక్కడ దించేస్తాను." "దారిలో మరో నాలుగు ఫన్ కథలు చెప్పండి.మంచి కాలక్షేపం ప్రయాణంలో రాత్రిపూట." "రండి సార్ రండి అని కార్ డోర్ తీసాడా యువకుడు.. వ్యక్తి మౌనంగా వచ్చి కారులో కూర్చున్నాడు ఆ వ్యక్తి. "ఏమాటకా మాటే కాని సార్..ముగింపు అదిరి పోయింది." "ఊహించని ట్విస్ట్ తో సినిమా ముగించాడు డైరెక్టర్.." "అవును ..మార్చురీలో ఉన్న భర్త శవాన్ని చూడాలని వచ్చిన భార్యని ,అదే‌ మార్చురిలో భర్త చంపేస్తాడు.దెయ్యంలా వచ్చి" చెప్పాడా వ్యక్తి. "ఇంతకూ మీ పేరు చెప్పలేదు నా పేరు వికాస్. షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉంటాను." "మీరు చెప్పిన ఈ కథతో ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని పిస్తుంది.." "కథ సహకారం అని మీ పేరు వేస్తాను చెప్పండి.." "చెప్పండి సార్ మీ పేరు చెప్పండి." యువకుడు ముసి ముసిగా నవ్వుతూ అడిగాడు.. "సెబాస్టియన్...శ్రీగంధ నాపేరు." "కాస్త కారు పక్కన ఆపేస్తారా.." సరే సార్..అంటూ కారు పక్కన ఆపి దిగండి అనేసి సిగరేట్ అంటించాడు యువకుడు. తిరిగి చూస్తే వెనుక సీట్లో వ్యక్తి లేడు. కారు డోర్ లాక్ అలాగే ఉంది. కారు హెడ్ లైట్ వెలుగులో కాస్త దగ్గర్లో కనిపిస్తుంది, రోడ్డు పక్కన సమాధి. దానిపైన చెక్కిన అతని రూపం. పేరు.. సెబాస్టియన్..శ్రీగంధ మరణం ..25_06_2015 అని అంటే తనతో ఇప్పటి వరకు ఉన్నది... జలదరించింది యువకుడి శరీరం. "నా కథ.నేను డైరెక్ట్ చేసిన సినిమా ఇలా రోజు చూసుకోవడం నాకెంతో ఇష్టం అందుకే సెకండ్ షోకు వస్తుంటా... నలుగురితో కలిసి సినిమా చూసి ఆస్వాదిస్తూ ఉంటా అంతే. మాటలు సమాధినుండి వస్తున్నాయ్.... ఒక కళాకారుడి వ్యధను అర్దం చేసుకున్నాడా యువకుడు.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు