గ్రూప్ ఫోటో - రమేష్ మాచాభక్తుని

Group photo

గ్రూప్ ఫోటో..... అది 1988 సంవత్సరం. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రంలో ఉన్న చీమకుర్తి ప్రభుత్వ కళాశాల. ఇంటర్ మీడియేట్ బై.పి.సి.గ్రూప్ లో చేరటం...అప్పుడు తెలుగు మీడియమే ఉండేది. కాలేజ్ వాతావరణం అంత కొత్తగా కనిపిస్తుంది.కొత్త బట్టలతో,కొంగొత్త ప్రదేశం...అందరూ.. కొత్తగా...ఉన్నారు. పరిచయాలు లేవు.బెరుకు గా అనిపిస్తుంది. పదవ తరగతి వరకు అద్దంకి ప్రభుత్వ జూనియర్ కాలేజి లో చదువు. అనంతరం, చీమకుర్తి లో చేరటం... స్నేహితులు లేకపోవడం... వంటరిగా క్లాస్ లోకి...ప్రవేశం... వెళ్ళగానే.... ఆప్యాయంగా పలకరించిన జువాలజి మాస్టర్... వెంకటేశ్వరరావు సార్... నన్ను ...అందరికి పరిచయం చేశారు... కుశల ప్రశ్నలు వేశారు.మనసు తెలికైంది.(మనదే ఫస్ట్ సీట్. .బై.పి.సి. లో...టెన్త్ లో 411 మార్కులు మనకి...అప్పట్లో అవే గొప్ప మార్కులు... నా దృష్టిలో...1988 సం.) ఆ రెండు సంవత్సరాలు హుషారుగా గడిచాయి.మిత్రుల సాన్నిహిత్యం.... మంచి మాస్టారు...చక్కగా పాఠాలతో పాటు... జీవిత సత్యాలు బోధించే...సార్...మాకు లభించడం...ఆయన బోధించే విధానం... మమ్ములను తరగతి వైపు కట్టి పడేసేవి. 1990 వ సంవత్సరం. ఇంటర్ పూర్తి అయ్యింది. ఉత్సాహం గా ఫేర్వెల్ పూర్తి చేసాము.మా జువాలజి సార్ అధ్యర్వంలో... ఆనాడు తీసుకొన్న గ్రూప్ ఫోటో... నా దగ్గర లేకపోవటం..... భాద గా ఉండేది... తరచూ...మా అభిమాన గురువు వెంకటేశ్వరరావు మాస్టర్ ను ఎప్పుడు కలుస్తామా....అని..... ఒకానొక సందర్భంలో నాతో ఇంటర్ చదివిన కాళి ని ఒంగోలు లో బంధువుల పెళ్లి లో కలిసినప్పుడు....... మన జువాలజి లెక్చరర్ గారు, గుంటూరు లో ఉన్నారు అని చెప్పి, నీవు ఎప్పుడైన గుంటూరు వస్తే, సార్ ను కలుద్దామన్నాడు. నేను సరే అన్నాను. మా బావమర్ధి గుంటూరు లొనే ఉంటున్నాడు.వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కలుద్దామన్నాను. వెంటనే కాళి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం, 2019 లో మా బావమర్ధి గృహ ప్రవేశం నిమిత్తం గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళగానే, కాళి కి ఫోన్ చేయటం చకాచకా జరిగిపోయాయి.కాళి వెంటనే, వచ్చి నన్ను కలిశాడు. టీ తాగుతూ, నేను కాళి లో ఇలా అన్నాను."మన బ్యాచ్ గ్రూప్ ఫోటో నా దగ్గర లేదురా.ఆ ఫోటో తీయించింది మా స్టూడియోలో (సుందరం స్టూడియో) పనిచేసే కుర్రాడు చేతే.... కానీ ఫోటో భద్రపరచ లేకపోయాను.... అన్నాను. ఇంటర్ అయిపోగానే, ఎంసెంట్ కోచింగ్ కు నెల్లూరు కు వెళ్ళటం తో సాధ్యం కాలేదు " అన్నాను. " ఆ ప్రోగ్రాం నేనే మిగిలిన స్నేహితులతో కలిసి కండక్ట్ చేసాము.కూల్ డ్రింక్స్ మొత్తం నరసింహారావు సైకిల్ మీదనే తీసుకొచ్చాము" అని ఆ పాత మధురానుభూతులను గుర్తు చేసుకున్నాము. అలాగే ఇంటర్ లో జరిగిన విషయాలను మాట్లాడుతూ,... ""గ్రూప్ ఫోటో తీసుకోవడం మిస్ అయ్యాను"....అని చెప్పాను. కాళి వెంటనే, తన దగ్గరున్న డైరీ తీసి,1990 వ సంవత్సరం బ్యాచ్ గ్రూప్ ఫోటో తీసి, నాకు ఇచ్చాడు. ఆ ఫోటో చూసి, ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది. 28 సంవత్సరాల క్రితం నాటి ఫోటోను అంత జాగర్త గా భద్రపరచిన, స్నేహితుని అభినందించకుండ ఉండలేకపోయాను. ఆనాటి అపురూపమైన గ్రూప్ ఫోటోను కళ్ళార్పకుండా చూస్తూనే ఉండి పోయాను . ప్రిన్సిపాల్ త్రయంబకేశ్వర రావు. జువాలజీ సార్,సూర్య ప్రకాశ్ రావు సార్,ఫిజిక్స్ సార్,బొటనీ సార్, ప్రిన్సిపాల్ గారు,తెలుగు సార్ (వీళ్ళ అబ్బాయిలు ఫణి,రఘువీర వల్లనే, మరియు తెలుగు సార్ సూచనతో నేను సిల్వర్ జూబిలీ లో చేరాను) మరియు.... మిగిలిన మిత్రులను పేరు పేరు తో గుర్తు చేసుకుంటూ,వారి తో గల అనుబందాలను నెమరు వేసుకున్నాను. మిత్రులు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నారని అడిగి తెలుసుకున్నాను. ఆ అపురూపమైన 28 సంవత్సరాల నాటి ఫోటోను వెంటనే స్కాన్ చేసి ఫోన్ లో భద్రపరిచాను. ఫోన్లో డేటా పొరపాటున పోతే ....ఆ ఊహే భయమేసింది.గ్రూప్ ఫోటో మిస్ అవుతానేమో అనిపించింది. వెంటనే, ఆ గ్రూప్ ఫొటోను నా మెయిల్ లో భద్రపరిచాను. అప్పటికి గాని నాకు మనసు కుదుట పడలేదు. ఎందుకంటే... ఆ గ్రూప్ ఫోటో కు ఉన్న విలువ అలాంటిది. ఆ తర్వాత రోజు సాయంత్రం, కాళి తో పయనం..... గుంటూరు అరండల్ పేట లో ఉన్న జువాలజీ సార్ వెంకటేశ్వరరావు ని కలవటం వెనువెంటనే జరిగాయి. 30 సంవత్సరాల క్రితం, మాకు జువాలజి పాఠాలు అలవోకగా బోధించిన మా అభివృద్ధి కి బాటలు వేసిన .... జువాలజీ సార్ ని ఎప్పుడు కలుస్తామా...అన్న ఆలోచన తో , నేను.. మిత్రుడు కాళి. ..టూ వీలర్ మీద నించి దిగి, గేటు తీసుకొని లోనికి వెళ్ళాము. సార్ స్వయం గా, మమ్మల్ని ఇద్దరినీ వారి ఇంటి లోపలికి తీసుకు వెళ్లి,కూర్చోమన్నారు. మేము సార్ పాదాలకు..ప్రేమ పూర్వకంగా నమస్కరించాము. సార్ పాద స్పర్శ తో మా మనసు పులకరించి పోయింది. అదే రూపము. అదే ఆప్యాయత.. ఏమాత్రం మార్పు లేదు. 30 సంవత్సరాల కు మాకు చదువు చెప్పిన్నప్పుడు, ఎలాంటి ప్రేమాను రాగాలు చూపారో.. ఇసుమoతైన తేడా లేదు. సార్ స్వయంగా మాకు మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చారు. ఆ ఆప్యాయత కు మాకు కళ్ల వెంట ఆనంద బాష్ఫాలు రాలాయి. చీమకుర్తి జూనియర్ కాలేజి తో గల అనుబంధాన్ని, జవహర్ డాక్టర్ గారితో గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. మాతో కుశల ప్రశ్నలు వేసి,మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడ, ఏ విధంగా ఉన్నారని... అడిగారు. అక్కడ సార్ తో గడిపిన సమయం...ఎన్నటికీ ...మరువలేము.... మంచి మాస్టర్ ...అలాగే...మానవత్వం మూర్తీభవించిన మాస్టర్... ఎంత మందికి లభిస్తుంది....అలాంటి ఉపాధ్యాయుల సాన్నిహిత్యం.... సంతోషం గా స్వగ్రామానికి....బయలు దేరాను.... గ్రూప్ ఫోటో....భద్రంగా.....మెయిల్ లో.... మాస్టర్ తో గడిపిన ....క్షణాలు.... మదిలో.....

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు