ఆమె..ఆమె కాదు...! - రాము కోలా.దెందుకూరు

Aame Aame kaadu

సమయం రాత్రి 11:50ని. ఆకాశం కాటుక పూసుకుంత నల్లగా ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం. అదే సమయంలో విశిష్ట కారు నేను కదలలేనంటూ భీష్మించుకు కూర్చుంది. అటువంటి సందర్భంలో మరో మార్గం లేక బంగ్లా ముందు నిలుచున్నాడు విశిష్ట. హాలో... ఎవరైనా ఉన్నారా..లోపల.. కోయిహై..అందర్.. ప్లీజ్ హెల్ప్ మీ..హలో.. కాస్త వర్షం తగ్గేవరకు షెల్టర్ ఇవ్వగలరా.. ప్లీజ్..నాకారు అర్ధాంతరంగా ఆగిపోయింది. బయట విపరీతంగా వర్షం వస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ.. చలికి వణుకు వచ్చేస్తుంది. కాస్త వర్షం తగ్గేవరకు షెల్టర్ ఇవ్వగలరా ప్లీజ్... హలో...గొంతు బొంగురు పోయేలా .. అర్ధిస్తున్నాడు అతను.. దూరంగా..చర్చిలో గంట తన పని తాను చేసుకు పోతుంది .సమయం రాత్రి పన్నెండు అయిందని తెలిపేలా .. ఎవ్వరు.. అలా గేట్ దగ్గర నిలబడి ఉన్నారు.. కాస్త లోపలకు రండి.. మీ మాట నాకు వినిపించడంలేదు.. ఏదైనా సహాయం కావాలా.. చెప్పండి.. ఆమె చేతులు కదలికను చూసి అర్థం చేసుకున్నాడు . వశిష్ట.. అతనిలో కాస్త ధైర్యం వచ్చింది. ఎటు చూసినా చీకటి..పలకరించే దిక్కేలేదు ఒకటే చలి.గజగజా వణుకుతూ దాదాపుగా గంట నుండి ఒక్కడే కారులో అప్పటి వరకు తనకు వెలుగు అందించిన మొబైల్ స్వీచ్చాఫ్ కావడంతో చేసేది లేక ఇలా భవంతి ముందు నిలబడి అరుస్తున్నాడు. గేటు తీసుకుని లోపలకు వచ్చేయండి ఆమె స్వరం వీణ శృతి చేసినట్లుగా ఉంది.. గర్జించిన మేఘం వెలుగులో చూసాడు అతను తనని లోపలికి రమ్మంటోంది ఆమె.. **** వర్షంలో బాగా తడిచి నట్లువున్నారు, టవల్ తో తల తూడ్చుకొండి ...అందించింది ఆమె. చాలా థ్యాంక్స్ అండి..టవల్ అందుకుని తల తూడ్చుకుని ఆమె చూపించిన సోఫాలో కూర్చుండి పోయాడతను.. బ్రేకింగ్ న్యూస్.. నగరంలో వరుసగా హత్యలు చేసి తిరుగుతున్న అగంతకుడు. ఎవ్వరైనా అనుమానితుడు కనిపిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించండి. అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకండి. అప్పటి వరకు నిశబ్దంగా ఉన్న హాల్ టీవీ శబ్ధంతో ఉలిక్కిపడింది. ఓ సారీ అండి !టీవీ చూస్తూ అలాగే నిద్రపోయాను. కరెంట్ ఎప్పుడు పోయిందో తెలియదు. మెలకువ కూడా రాలేదు. ఎవ్వరో పిలుస్తున్నారు అని పించడంతో మెలకువ వచ్చింది. అంటూ వెళ్ళి టీవీ ఆఫ్ చేసింది ఆమె. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారా! అడిగాడు అతను.. అవునండి..అందరూ శ్రీశైలం వెళ్ళారు. నేను కాస్త ముఖ్యమైన పని ఉండి ఆగిపోయాను. వర్షంలో బాగా తడిచినట్లున్నారు.. కాఫీ..టీ..లేదా ఏదైనా వైన్ తాగుతారా.. అడుగుతుంది ఆమె.. అయ్యో!మీకు ఎందుకండి అంత శ్రమ ఇబ్బంది.. ఉంటే కాస్త కాఫీ తాగాలని ఉంది..అన్నాడు అతను మోహమాటంగా.. సరే కాఫీ తీసుకు వస్తాను ..మీరు టీవీ చూస్తూ ఉండండి అని తను వంట గదిలోకి వెళ్ళి పోయింది. అతను గదిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. చాలా నీటుగా ఉంది.. కాఫీ తీసుకొండి అతనికి ఒక కప్పు అందించి ఆమె.. చాలా థ్యాంక్స్ అండి ..వర్షంలో షెల్టర్ ఇచ్చారు. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు అడిగాడతను. "నా పేరు ఊర్మిళ పరుసవేది. కొంత కాలం పోలీసు డిపార్ట్ మెంట్ లో పని చేసిను .. ఇప్పుడు లేదు..ప్రశాంత్ జీవితం కొసం ఒంటరిగా ఉంటున్నా.. అంటే. ..మీరు..మీరు...గంధపు స్మగ్లర్లు దాడిలో తీవ్రంగా గాయపడి కొమాలోకి వెళ్ళిపోయిన ఊర్మిళ గారేనా... అడగలేక అడిగాడు తను. అవును అందరు నేను చనిపోయాననుకున్నారు.. అదో పెద్ద కాదులేండి. చాలా సమయం అవుతుంది. అలా సోఫాలో పడుకొని.ఉదయమే వెళ్ళిపోదురు,నాకు నిద్ర వస్తుంది.అవతల రూమ్ లో పడుకుంటాను.. మీకు ఏదైనా అవసరమైతే గట్టిగా పిలవండి గుడ్ నైట్ ఆమె వెళ్ళిపోయింది. అతను సోఫాలో కునుకు తీసాడు. ***** తెలవారింది.. బంగ్లాలో ఎక్కడా ఆమె ఆచూకీ లేదు. ఆమెకు చెప్పి వెళ్ళాలని రూమ్ డోర్ తీసాడు.. అతని గుండే ఆగినంత పనైయింది. గోడకు పుటో పూలదండతో.. చిరు నవ్వుతో ఆమె రూపం...మరణం .2016అని ఉంది అంటే రాత్రి తనకు షెల్టర్ ఇచ్చినామే..ఒక ఆత్మ! బాబోయ్... కన్నులు మూసి తెరిచే లోగా అతను నేషనల్ హైవే పక్కన బస్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా గుండె దడ ఆగలేదు అతనికి. రాత్రి అంతా తను ఒక ఆత్మతో గడిపాను అనే ఆలోచనే అతన్ని వణికిస్తుంది అతనికి తెలియనిది ఒక్కటే పుటోలో ఉన్నది ఊర్మిళ సోదరని, ఊర్మిళ ఉదయమే జాగింగ్ కు వెళ్ళిందని.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు