పెర్ఫెక్ట్ ప్లానింగ్ "మీరు చంపగలరా లేదా? ఒక్కటే సమాధానం.నాకు కావాల్సింది. చెప్పండి..యస్ ఆర్ నో అంతే" "ఎన్ని రోజులని క్షణక్షణఁ భయపడుతూ ఉండను, ఇక నావల్ల కాదు? నా సహనం అంతరించి పోయింది "మీ వల్ల కాదంటే చెప్పండి మరొకరితో చంపించేస్తాను" గదిని పినాయిల్ లో తడిపిన గుడ్డతో ఇల్లు తూడుస్తూ తల వంచుకుని చెప్పుకు పోతుంది పొన్నాంబిక. "ఎందుకు నీకు అంత పట్టుదల." "ఒక ప్రాణం తీయడం మహా పాపం" చంపవలసినంత అవసరం ఏమొచ్చింది మనకు" "మనమే చూసీ చూడనట్లు ఉంటే సరిపోతుంది కదా?" నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు విఠల్ సాలంకీ. "మీరు ఎన్నైనా చెప్పండి, నా నిర్ణయం మారదు? మీరేమో గుర్రుపెట్టి నిద్రపోతారు.." "ఏమాత్రం అలికిడైనా . గుండెజారి పోతుంది . మీకేం తెలుసు భయం అనేది ఎంత నరకమో! అనుభవిస్తే తెలుస్తుంది.! "మొన్నటి మొన్న స్నానం చేసి ఇంట్లోకి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసి వచ్చింది." "ఏ తలుపు వెనుకో నొక్కి నాపై దాడి చేస్తే, అని ఎంతగా హడలిపోయానో తెలుసా" "అప్పటికి నా ప్రయత్నం నేను చేసాను.రెండుసార్లు కానీ ఆయుష్ గట్టిది కావడంతో ఇంకా బ్రతికుండి ఇలా నాతో ..... "పొన్నీ...ఓయ్ పోన్నీ. "చంపడమంటే మనస్సు ఒప్పుకోవడంలేదు." నెమ్మదిగా భుజం పైన చెయ్యి వేసి నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు విఠల్ సొలంకి. "మీరేనా ఇలా మాట్లాడుతుంది" "శత్రువులు గుండెల్లో బుల్లెట్లు సూటిగా దించేసిన మీరు" "పదిహేను సంవత్సరాలు మిలిటరీ లో పని చేసిన మీరు ఎందుకు వెనుకాడుతున్నారో అర్దం కావడంలేదు" "నిజంగా మీరు శత్రువులతో పోరాటం చేసారా లేక . బెటాలియన్ లో వంట పని చేసారా" "నాకు అనుమానమే" ""పొన్నాంబికా ! అది కధన రంగం,అక్కడ దయా దాక్షణ్యం ఉండదు" "శత్రువును చంపడం యుద్దనీతి" "అది దేశంకోసం"తప్పదు." అప్పటి వరకు వేడివేడి కాఫీ త్రాగుతున్న కప్పు ప్రక్కన పెట్టి, న్యూస్ పేపర్ అందుకున్నాడు విఠల్ సోలంకి.. "ఇది గృహనీతి" "కట్టుకున్న భార్యకొసం ఈమాత్రం చేయలేరా" "రేపు ఒక్క రోజే మీకు అవకాశం ఇచ్చిచూస్తా! మీ వల్ల కాకుంటే.మన వీధి చివరన పెరుమాళ్ ఉన్నాడు " అతనికి పని పురమాయిస్తా" "మన చేతులకు ఏమాత్రం మట్టి అంటకుండా పని జరిగిపోతుంది" "అతనికే ఎంతో కొంత ముట్ట చెపితే సరిపోతుంది" సాయంత్రం కబురు చేస్తా" అంటూ రుసరుసలాడుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది పొన్నాంబిక" **** భార్య మాటకు తలవంచాడు విఠల్ సోలంకి. ఈ రోజు ఏది ఏమైనా అనుకున్నది జరిగి పోవాల్సిందే, *భర్త చేతికి గట్టిగా ఉన్న ఇనుపరాడ్ ఇచ్చింది. తనో ప్లాస్టిక్ కవర్ రెడీగా ఉంచుకుంది, కనిపించగానే కవర్ తో మూసివేయాలని. ఆతరువాత దెబ్బ మీద దెబ్బ వేయాలి.. "పొన్నాంబిక చాలా ఎగ్జైట్ గా ఉంది. దాదాపుగా రెండు నెలలు నుండి తాను ఎంత ఇబ్బంది పడింది తలుచుకుంటూ. ఈ రోజుతో సమస్య విరగడైపోవాలని మనసులో బలంగా కోరుకుంటూ.. ఏమండి!మీరు సిద్దంగా ఉండండి నేను ప్లాస్టిక్ కవర్ తో సిద్దంగా ఉన్నా.. చిన్నగా డోర్ తీస్తా.. అదను చూసి ఒక్కటే దెబ్బ,గట్టిగా వేయండి. దెబ్బ మిస్స్ అయితే కష్టం.... నేను డోర్ తీస్తున్నా! మొన్న మనం లాట్ పెట్టిన వడ్లు బస్తాలు దగ్గర మీరు కాపు కాయండి. నేను వంటగది వైపు కాపు కాస్తా.. మీ వైపు కనిపించిన మరుక్షణం ..ఒక్కటే దెబ్బ పడిపోవాలి. "అది కాదు !దెబ్బతగిలి తప్పించుకుంటే! ఎక్కడో ఏమూలో దాక్కుని చనిపోతే.. ఇంటి నిండా ఒకటే వాసన వస్తుంటుంది ఎలా మరి..అన్నాడు విఠల్ సోలంకి అనుమానంగా. దీని కంటే గట్టిగా ప్రయత్నం చేసి బయటకు వెళ్ళే లొ చేయడం మంచిది కదా...అన్నాడు విఠల్ సోలంకి. మీకు చెప్పిన పని మీరు చేయండి. తలుపులన్నీ బిగించా!ఈ రోజు తప్పించుకోవడం అసాధ్యం ఒక్కటే దెబ్బ..గురి చూసి తగిలేలా వేయండి. తీస్తున్నా..తలుపు .. జాగ్రత్త.. సిద్దంగా ఉన్నారుగా... ఎంటి ఉండేది.తలుపులన్నీ మూసేసావ్ అంతా చీకటి చీకటిగా ఉంది.ఎలా గురిచూసి కొట్టాలి.నాకైతే అర్దం కావడంలేదు... "పొన్నాంబిక తలుపుతీసి తన దగ్గర సిద్దంగా ఉంచుకున్న ప్లాస్టిక్ పట్లా క్షణం కూడా ఆలోచించకుండా కప్పేసింది. విఠల్ సోలంకి చేతిలో రాడ్ పైకి లేపి ఒక్కటే దెబ్బ తియ్యాలని అడుగు ముందుకు వేసాడు. క్షణంలో గది మొత్తం చీకటైయింది. వేసిన ప్లాన్ అట్టర్ ప్లాపైయిందీ. విఠల్ సోలంకి చేతిలో రాడ్డ్ పొన్నాంబిక భుజంపై నాట్యామాడింది. పొన్నాంబిక పెట్టిన కేక చుట్టూ ఉన్న నాలుగు ఇల్లు వారిని పోగుచేసింది. విషయం తెలిసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.. "సరిపోయారు గొంతుకు తగ్గబొంత"అనుకుంటూ.. పొన్నంబికకు అసలు సమస్య ఇప్పుడే ఎదురయింది ఒక సమస్య తీరిపోతుదని వేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ కావడం . మరో సమస్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు విఠల్ సోలంకి. "ఎక్కడెక్కడో పెట్టిన పాలు పెరుగు ఉండడం లేదు "అని నెత్తి కొట్టుకుంది .. తలుపు సందులో నుండి మ్యే...వావ్ అంటూ అరుస్తూ బయటకు వస్తుంది నల్లపిల్లి. పక్క ఇల్లలో నుండి ఎలుకలు పట్టుకొస్తూ...