కాకతాళీయం - రమేష్ మాచాభక్తుని

Kakataleeyam

ప్రకృతి లో ప్రస్తుతం జరిగే ప్రతి పనికి ...భవిష్యత్తులో జరిగే మరో విషయానికి సంబంధం ఉంటుంది ..అనేది నిర్విదాoశము...దీనినే కార్యాకారణ సంబంధం అంటారు. ఇదే ముఖ్యాంశం గా తీసుకొని...చిత్రీకరించిన సినిమా...కమల్ హాసన్ నటించిన ...దశావతారం... టీచర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభo...జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,అమాని గుడిపాడు లో...ప్రకాశం జిల్లాలో పశ్చిమాన నల్లమల దగ్గరగా ఎర్రగొండ పాలెం మండలంలో... 94 మంది పిల్లలు మాత్రమే...నాకా చదువు చెప్పటం కొత్త... భోధనుభవం లేదాయే.. వెన్నా వెంకటేశ్వర రెడ్డి గారు..ప్రధానోపాధ్యాయులు... అనేక సంవత్సరాల నుండి సైన్స్ పోస్ట్ ఖాళీ గా ఉంది ఆ స్కూల్ లో... నేను వెళ్ళగానే...ఫస్ట్ అసిస్టెంట్ శివయ్య సర్..అందరికి పరిచయం చేసారు. "హిందీ సార్ షరీఫ్ సార్,లెక్కలు సార్ ఆంజనేయులు సార్,అమోస్ సార్ పి.ఇ.టి.సార్,అటెండర్..లాజరస్ "..అని అందరిని పరిచయం చేసారు. ప్రధానోపాధ్యాయులు గారికి...నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వగానే...శివయ్య సార్...రిజిస్టర్ లో నా పేరు వ్రాయటం జరిగింది. హెచ్.యం.గారు..."సంతకం చేయండి...సైన్స్ సార్" అన్నారు. నాకెందుకో ఆ పిలుపు కొత్తగా అనిపించింది.అప్పుడు నాకు 23 సంవత్సరాలు... 8,9,10 తరగతులు..రూములలో..6,7 తరగతులు..వరండా ల్లో... హెచ్.యం.రూమ్ కం స్టాఫ్ రూమ్.రిజిస్టర్ లో సంతకం పెట్టగానే...టీ,స్నాక్స్ అందరికి తెప్పిదామని అటెండర్ కు చెప్పాను. షరీఫ్ సార్.."ఇక్కడ టీ మాత్రమే దొరుకుతుంది.స్కూల్ కు దగ్గర్లో దొరకదు..ఊర్లో నుంచి తెప్పించుకోవాల్సిందే"..అన్నారు. స్కూల్ ఎదురుగా బ్రహ్మo గారి గుడి.ఎంతో ప్రశాంతం గా ఉందా వాతావరణం. టీ "పార్టీ" అయిపోగానే,అటెండర్ లాజరస్ ఆప్యాయంగా అడిగాడు..."ఇంతకు మీరు ఎక్కడ నుంచి వస్తారు సార్.." అన్నాడు. "నేను...మార్కాపురం నుండి వద్దమనుకుంటున్నాను"..అన్నాను. అప్పుడే క్లాస్ నించి వచ్చిన శివయ్య సార్..."సైన్స్ సార్...ఇక్కడకు మార్కాపురం నుండి ఒకే బస్ ఉంది.అది స్కూల్ టైం కు రాదు"...అన్నారు. ఇంకొల్లు ప్రాంతం నుంచి ప్రమోషన్ మీద. .లెక్కలు టీచర్ గా నాకన్న వారం ముందు జాయిన్ అయిన అంజనేయులు సార్..."మాస్టర్..నేను ఇప్పటికే ఊర్లో రూమ్ తీసుకున్నాను..సోషల్ సర్..ఇంటి ప్రక్కనే...మీరు ఒకే ఆ రూమ్ ఉండచ్చు ..అన్నారు. శివయ్య సార్..నన్ను మధ్యాహ్నం మూడో పీరియడ్ టెన్త్ క్లాస్ కు తీసుకువెళ్లి.." ఈ సర్ పేరు..రమేష్ సార్...ఈ రోజు నుండి సైన్స్ సబ్జెక్ట్ సార్ మీకు చెప్పారు..." అన్నారు. ఆ విధంగా మొదటి రోజు ఉద్యోగ జీవితం ప్రారంభించమైంది...ఆ ఊర్లోనే ...లెక్కల సార్ రూమ్ లో వసతి... లెక్కలు సార్ ఇంటి గురించి చెపుతూ..."ఈ ఇల్లు బాలగురవయ్య గారిది..వాళ్ళ పిల్లలు కూడా మన స్కూల్ లో చదువుతున్నారు.."అన్నారు. **** వారం వారం శనివారం...సాయంత్రం అమాని గుడిపాడు నుండి బయలు దేరి...చీమకుర్తి రావటం .మరల సోమవారం ఉదయం బయలుదేరి ...అమానిగుడి పాడు వెళ్ళటం... సోమవారం నుండి శనివారం వరకు...మఠం నిద్ర...సత్రం భోజనం... 1997 సo. అక్టోబర్ నెలలో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా ఒంగోలు శ్రీనివాస,శ్రీదేవి (ఇప్పుడు గోరంట్ల కాంప్లెక్స్) హాల్ లో రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 11 వ తేది రెండవ శనివారం రోజు...చీమకుర్తి నుంచి వచ్చి...మ్యాటీ షో సినిమా కు వెళ్ళాను.అక్కడ సిల్వర్ జూబ్లీ సీనియర్ ఫణి అన్న ను కలవటం జరిగింది... సినిమా హాల్ నుండి బయటకు రాగానే...టీ, స్నాక్ కోసం... అద్దంకి బస్టాండ్ దగ్గర లో ఉన్న బాపూజీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న హోటల్ కు వెళ్ళాను... టిఫిన్ పూర్తి చేసి, డబ్బులు ఇవ్వటానికి క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాను...కౌంటర్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు నిలబడి ఉన్నారు. ఇద్దరు ..చూడడానికి ముచ్చటగా ఉన్నారు.వారి మొహల్లో కళ మాత్రం లేదు...వారి వయస్సు సుమారు గా...11 సం. 9 సం. అనిపించింది... డబ్బులు ఇస్తూ...హోటల్ ఓనర్ అడిగాను..."ఎవరు...ఈ పిల్లలు..చాలా సేపటి నుండి ఇక్కడే నిలబడ్డారు...నేను టిఫిన్ చేస్తూ గమనించాను.." అన్నాను. చిల్లర నా చేతికి ఇస్తూ..."వీళ్ళది...విజయవాడ అంటున్నారు సార్..ఇంట్లో అలిగి వచ్చారని చెబుతున్నారు.ఆకలి అవుతుంది...ఏమైనా..పెట్టమంటున్నారు...సర్" అన్నాడు. నా మనసు చివుకుమంది..వెంటనే...అతనికి వంద రూపాయలు ఇచ్చి..."వాళ్ళకి కావలసిన టిఫిన్ పెట్టండి.మిగిలిన డబ్బులు వాళ్లకు ఇచ్చి...విజయవాడ కు వాళ్ళు క్షేమంగా వెళ్లాలా చేయండి.."అన్నాను. వెంటనే హోటల్ ఓనర్..."ఇలాంటి వాళ్ళు చాలా మంది రోజు మా హోటల్ కు వస్తుంటారు.వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు...మనం నమ్మకోడదు.."అన్నాడు.. నాకెందుకో ఓనర్ మాటలు... ఆ పిల్లల విషయంలో నమ్మబుద్ది కాలేదు..." లేదు లెండి.ఈ పిల్లల ను చూస్తే ...అలా అబద్ధాలు చెప్పెవాళ్లలా లేరు.." అని అన్నాను. సరే...సార్..అన్నాడు ఆ హోటల్ ఓనర్... ఒంగోల్ నుండి చీమకుర్తి చేరుకొని...జరిగిన విషయాన్ని ..అమ్మకు,నాన్నకు,అన్నయ్యకు చెప్పాను... ఆ రోజు రాత్రి ఎంతో ప్రశాంతంగా నిద్ర పోయాను.అంతకుముందు ఎప్పుడు అంత గాఢ నిద్ర పోలేదేమో అనిపించింది.... బహుశా ఒక మంచి పని చేశాను.. అని మనస్సు గుండె కు...సంకేతం పంపివుంటుదేమో... 2000 వ సం.ఏప్రిల్ నెల ఎండాకాలం సెలవులు.... అద్దంకి లో ఉంటున్న...అక్కయ్య వాళ్ల దగ్గర నుండి ఫోన్... అప్పుడే భోజనాలు చేసి,... బంధువుల సంగతులు మాట్లాడుతూ ఉన్నాము... ఇంతలోనే...అక్కయ్య నుంచి ఫోన్..నేనే లిఫ్ట్ చేసాను.అక్కయ్య గొంతుతో ఆదుర్దా..."హేమంత్...కనిపించటం లేదురా...మీ బావ వాడి మీద కోపడ్డాడు అంట..అప్పటి నుండి కనిపించడం లేదురా..."అనగానే... "వాళ్ల ఫ్రెండ్స్ ఇళ్లలో కనుకోలేదా.."అన్నాను. "లేదురా...అన్ని చోట్ల వెతికాము..ఎక్కడా కనిపించలేదు...అందరు బంధువులకు ఫోన్ చేస్తున్నాము..."అని చెప్పింది... ఇంతలో ఫోన్ డిస్కక్ట్..అయ్యింది... హేమంత్..మా అక్కయ్య వాళ్ళ రెండో అబ్బాయి.అద్దంకి లో 8 వ తరగతి చదువుతున్నాడు. ఆ విషయం తెలిసి...ఇంట్లో అందరూ ఆందోళన ప్రారంభమైంది... అన్నయ్య బండి తీసికొని...నేను అన్నయ్య బయలు దేరాము...మా మేనల్లుడుని వెతకటానికి... ఎక్కడా వాడి ఆచూకీ దొరకలేదు...సాయంత్రం 5 గం.లు అయ్యింది... మరల అద్దంకి కి ఫోన్...ఈ సారి ఫోన్ బావ మాట్లాడుతూ..." ఇంకా ఏ విషయం తెలియలేదు.."అన్నాడు... సరిగా అదే సమయంలో మా ఇంటి ముందు...టూ వీలర్ ...ఆగింది... అన్నయ్య ఫ్రెండ్ అనుకుంటా...రాగానే.."బాగున్నవా...రమణ..."అని అన్నయ్య ను పలకరించాడు... లోపలికి వస్తూ, మా మేనఅల్లుడు హేమంత్ ను...వెంటబెట్టుకుని వచ్చాడు... ఆశ్చర్యపోవడం ...మా వంతైంది... ఇంటినుండి పారిపోయిన...వీడు...ఇక్కడకు ఎలా...అనే ప్రశ్న...అందరి మనసుల్లో... అదే విషయాన్ని...అన్నయ్య ఫ్రెండ్ ని అడిగాము... అతను చెప్పటం ప్రారంభించాడు..."నేను రెండు రోజుల క్రితం అద్దంకి వెళ్లి...ఈ రోజు భోజనం చేసి...చీమకుర్తి కి బండి మీద బయలుదేరాను.... బొడ్డువాని పాలెం దగ్గరకు రాగానే...ఒక అబ్బాయి రోడ్డు పై ఎండలో నడుస్తూ వెళుతున్నాడు.నాకు ఎందుకో అనుమానం వచ్చి..."ఏ ఊరు మీది...ఎక్కడి వెల్లుతున్నావు..." అన్నాను. "మా బందువులది చీమకుర్తి అని, వాళ్ల ఇంటికి వెళుతున్నాను.." అన్నాడు.. "చీమకుర్తి లో మీ బంధువులు ఎవరిని.."అడగానే... "మా మామయ్యది స్టూడియో.రమణారావు మా మామ...పేరు.."అని చెప్పాడు.. నేను వెంటనే విషయం అర్ధం చేసుకుని..ఈ అబ్బాయి..ఇంటి నుంచి పారిపోయి వస్తున్నాడని...గ్రహించాను.."అన్నాడు. "మీ మామయ్య నాకు తెలుసు...నాతో వస్తే...మీ మామయ్య దగ్గరకు తీసుకువెళ్లతాను..."అన్నాను. "ఇది జరిగిన విషయం ..మీకు అర్ధం అయ్యుంటుంది..."అన్నాడు అన్నయ్య తో... అందరం అన్నయ్య ఫ్రెండ్ కు కృతజ్ఞతలు తెలియచేసాము... ఈ విషయం అక్కయ్య వాళ్లకు తెలియపరిచాం. ఆ రోజు భోజనాలు చేసే సమయంలో... అమ్మ .." ఒంగోలు లో ఒకసారి నువ్వు ఇంటి నుండి పారిపోయిన పిల్లలకు టిఫిన్ పెట్టించి...వాళ్ళను ఇంటికి పంపే విధం చేసాను..అందుకు అవసరమైన సహాయం చేసాను...అన్నావు...గుర్తుందా...నీకు..."అని నాతో అన్నది. "అవునున్నాను..." నేను. "బహుశా...ఆ రోజు నువ్వు చేసిన సహాయం ...ఈ రోజు మన బిడ్డకు అక్కరకు వచ్చిందేమో..మన బిడ్డ ను ఇంటికి చేర్చింది"...అంది అమ్మ... భోజనాలు పూర్తి చేసుకొని...నిద్ర పోవడానికి...డాబా మీదకు వెళ్ళాను. నిద్రకు ఉపక్రమించబోతూ ఉంటే..ఆలోచన ప్రారంభిమైంది... ఆ రోజు ఒంగోలు లో తప్పి పోయి వచ్చిన పిల్లలు గురించి శ్రద్ధ తీసుకోవటం వలన...నా మేనల్లుడు ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడా...అనిపించింది... బహుశా...ఇది కాకతాళీయం...అనుకుంటా...లేక కార్యకారణ సంబంధమా... ఇలాంటి విషయాలను...సైన్స్ నమ్మదేమో...అనుకుంటు ..మెల్లగా నిద్రలోకి జారుకొన్నాను.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు