ఓబులేసు - రాముకోలా.దెందుకూరు

Obulesu

దావానలంలా వ్యాపించింది ఎవ్వరికీ నమ్మసక్యం కాని వార్త.. నమ్మాలో వద్దో తెలుసుకోలేని మానసిక సంఘర్షణతో గ్రామంలోని జనం పరుగులు తీస్తున్నారు. ఓబులేసు చనిపోయాడనే వార్త పొలిమేరలు దాటి ఊరిలో నలుగురి చెవులు చేరడంతో. ముప్పై సంవత్సరాలుగా స్మశానంలో కొన్ని వందల శవాలు కాల్చిన ఓబులేసు శ్మశానంలో చనిపోవడం విచిత్రమే.! *** భయమా! అది ఎలా ఉంటుంది ! అని చాలెంజ్ చేసిన పది నిముషాలకే తనంటే ఏమిటో చూపించడం మొదలెట్టింది.. ప్రకృతిని ప్రశ్నించడం మనిషి వెర్రితనమే అని గుర్తు చేస్తూ.. చుట్టూ చీకటి నల్లటి దుప్పటి కప్పుకుంది అనేలా ఉంది . అప్పుడప్పుడు ఆకాశం భీకరంగా గర్జిస్తుంది. రెండుగా చీలిపోతుందేమో అనేలా మెరుపు మెరిసి కనుమరుగౌతుంది. దూరంగా నక్క ఊల పెడుతుంది. ఏదో మారణహోమం జరగబోతోంది అనెందుకు సంకేతంలా. చెట్టు తొర్రలో గుడ్లగూబ ఒకటే రోధచేస్తుంది. తన పిల్లలను రెక్కలు క్రింద దాచుకుంటూ ఓబులేసు వెన్నులో వణుకు మొదలైయ్యింది. చెట్టుమీద పిట్ట తన రెక్కలు టపటపా కొట్టుకుంటూ ప్రక్కనుండి ఎగిరిపోతుంటే.. ఒక్కసారిగా గుండె ఆగి పనిచేయడం ప్రారంభించిందేమో. తన గుండే శబ్దం తనకే భయంకరంగా వినిపిస్తుందేమో.. గట్టిగా హనుమాన్ చాలీసా పారాయణము చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎన్నోసార్లు శబ్దాలు ఎన్నోవిన్నా కూడా నేడు అదొరకమైన అలజడి రేపుతుంది అతనిలోఎందుకో . మృత్యువుకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది శబ్దం. మనిషి సహజంగా దైర్యవంతుడే కానీ చీకట్లో కనిపించని శక్తులు ముందు అల్పుడే. చీకటి మనిషిపై విజయం సాధిస్తూనే ఉంటుంది వెలుగు మనిషి పక్కన చేరనంత వరకు అదే సృష్టి రహస్యం. మనిషి కంటికి కనిపించని ఎన్నో శక్తులు మన చుట్టూనే పరిభ్రమిస్తాయనేది వాస్తవం. అవి ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్నలే. మరో రెండు అడుగులు వేసాడో లేదో. కాళ్ళ క్రింద పడి విరుగుతున్న ఎండు కొమ్మ వింత శబ్దం చేస్తూ గుండె జారేలా చేసింది... దూరంగా కీచురాళ్ళ శబ్దం వినిపిస్తుంది వినిపించిన వైపు తిరిగి చూసాడు. నల్లని చీకటి తనపై దాడికి సిద్దంగా ఉన్నట్లనిపించింది నాలుగు అడుగులు ముందుకు వేసాడో లేదో నెత్తుటి ధారలు కారుతున్నా మూతిని నాలుకతో తూడ్చుకుంటూ చీకట్లో మెరిసే కన్నులతో తనవైపే చూస్తున్నాయ్ రెండు కన్నులు ఛాత్ నల్లపిల్లి...నువ్వుకూడా నన్ను భయపెట్టాలనేనా అనుకున్నాడు మనసులో. ఏ చిరుప్రాణో తన ఆకలికి బలి అయివుంటుంది. తనలో తానే నవ్వుకున్నాడు." పిల్లికి భయపడడమేమిటి తాను ,శవాలు తనని చూసి భయపడతాయి కదా "అనుకుంటూ.. కడుపులో ఏదో దేవినట్లు అనిపించింది. దూరంగా చితిపై కాలుతున్న శరీరం నుండి వచ్చే చమురు వాసనతో. ఆగి ఆగి వీస్తున్న గాలికి రావిచెట్టు ఆకులు గలగల రాలుతున్నాయ్.. మనిషిని కబళిస్తున్నందుకే నేలరాలుతున్న సంకేతంలా. శ్మశానంలో తూర్పుముఖంగా కాలుతున్న చితి మంటల వెలుగుల్లో.. తన ముందు ఏదో నీడ కదలాడుతుంది అని పించడంతో...తల పైకేత్తి చూసాడు .ఓబులేసు తనవైపే దూసుకు వస్తుందో తెల్లని ఆకారం. అంతే అతని గుండే ఆగిపోయింది.. ****** అందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చెట్టు మీద పిట్టల కొసం పెట్టిన దిష్టి బొమ్మ మీదపడంతో .భయంతో చనిపోయాడు రోయ్ ఓబులేసు అని.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు