చిరు ప్రాయం... చిన్నతనం...పసి మొగ్గలు...బోసినోటి నవ్వులు...వెరసి...చిన్నారులు.. దైవ సమానులు.. వారి నిలయాలు..నవ్వుల లోగిళ్ళు... వారి ఎదుగుదలకు సాక్షిభూతాలు...పాఠశాలలు... వారి మూర్తిమత్వ శిల్పులు ... ఉపాధ్యాయులు... వారి ఎదుగుదలకు రాదారులు...తరగతి గదులు... వారి ఉన్నత శిఖరాలు...గురువుల బోధనామృతాలు... మంచి పాఠశాలలు ...మంచి పౌరులను తీర్చి దిద్దుతాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి ఓ చక్కని పాఠశాలే....రావినూతల... ప్రాధమిక పాఠశాల... ప్రకాశం జిల్లా ..కొరిశపాడు మండలం లోనిది ...రావి నూతల గ్రామం... జాతీయ రహదారి పై ..మెదరమెట్ల గ్రామానికి ...అతి సమీపంలో ఉందా...గ్రామం...రావినూతల... కలలకు కాణాచి... చదువుల నెలవు...చైతన్య దీపికలు ప్రభవించే గ్రామ సీమ...ఇంటికొక ఉద్యోగి... అలాoటి ప్రసాస్త్యం గల గ్రామంలో ని... పాఠశాల లో విద్య ను ... పొందటం... భగవదనుగ్రహమే... నాన్న ( నాన్న గారు...అని పిలవటo...నాకెందుకో ..కృత్రిమంగా అనిపిస్తుంది...నాన్న అన్న పిలుపే ..ఆప్యాయత ల నెలవు...) ఉద్యోగ రీత్యా 1982 సం. లో రావినూతల కు బదిలీ కావటం... 3,4,5 తరగతులు చదివింది...రావినూతల లొనే... పశువుల వ్యాపారి మస్తాన్ గారి ..కొత్త ఇంట్లో.. అద్దె కు దిగాము.. నాన్న,అమ్మ,నేను,తమ్ముడు... ఇక్కడ... అన్నయ్య , అక్కయ్య ..ఇద్దరు...అద్దంకి లో అమ్ముమ్మ ఇంటి దగ్గర ... అప్పట్లో ...రావినూతల ప్రాధమిక పాఠశాల ...5 తరగతులు...రెండు పాఠశాల లు... 1,2 తరగతులు ...మెయిన్ రోడ్ కు అవతల వైపు...3,4,5 తరగతులు ...రోడ్ కు ఇవతల వైపు ... 3 వ తరగతి నేను... తమ్ముడు ...1 వ తరగతి లో చేరాము... మాకు రామమూర్తి మాస్టర్ వచ్చేవారు. శ్రావ్యమైన కంఠం ...ఆకట్టుకునే రూపం ...చూడగానే ..భక్తి భావం... ప్రతి అంశాన్ని ...సులువు గా చెప్పేవారు ( సార్ ..పర్యవేక్షణలో మేము ...పోలయ్య కాపురం ..నాటిక ...అద్దంకి కాలేజి వార్షికోత్సవం లో వేశాము) ఇక ప్రముఖ కవి, నాగ భైరవ కోటేశ్వర రావు గారి సోదరులు సింగయ్య మాస్టర్ మాకు 4 వ తరగతి లో లెక్కలు చెప్పేవారు. ఆయనంటే ...మాకు భయ భక్తులు మెండు....లెక్కలు,సోషల్ ...వారి క్లాసులలో జాగ్రత్తగా వినేవాళ్ళము... అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప లేదో ..భజ గోవిందమే... అందుకు పాఠశాల బయట ఉండే.. అంజనేయ స్వామే సాక్ష్యం.. ఇంతలో ...సంవత్సరం గడవడం ...5 వ తరగతి లోకి వచ్చేసాము. శ్రీను,సుధాకర్, రాము,సుభాని... మిత్రులు... దామా సుబ్బారావు మాస్టారు ప్రధానోపాధ్యాయులు మరియు 5 వ తరగతి క్లాస్ టీచర్... లాల్చీ,పంచె... క్రమశిక్షణ కు మారు పేరు... ప్రార్ధన మొదలైంది మొదలు, సాయంత్రం జనగణ పాడే వరకు...ఖచ్చితంగా క్రమ శిక్షణ పాటించాల్సిందే... ఉదయం ప్రార్ధన సమయంలో తప్పు పాడేమో...సుబ్బారావు మాస్టర్ రూమ్ నుండి...పిలుపు... ఎవరైనా పుల్ల కుసుమిత.... అని పలికారో ...లోపలికి పిలుపు...ఆ పదాన్ని పలకమనే వారు... ఫుల్లకుసుమిత... అని పలికితే ఆ రోజు భద్రం...లేకపోతే... తెలుగు భాష పై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు... ఒకరోజు...ప్రార్ధన అయిపోగానే...నాకు పిలుపు వచ్చింది... ఏ పదం తప్పుగా పలికానో ...అన్న భయం... ఊహించినది జరిగలేదు....మాస్టారు నుండి అభినందన... బాగా పాడావు...బతుకు జీవుడా అని బయట పడ్డాను. ఎప్పుడో ....35 సం. క్రితం చదువు చెప్పిన...ఉపాధ్యాయులు గుర్తున్నారంటే.... వారి ప్రభావితం మనపై...మెండు... వారి ఆలోచనలు ...మన ఉన్నతులు... పురోభివృద్ధి కి బాటలు వేసిన, రావి నూతల ప్రాధమిక పాఠశాల ను 2015 సం. లో .... చూడడానికి వెళ్ళాను.. గత చరిత్ర కు గుర్తులు గా... ఎందరో విద్యార్థుల అభివృద్ధికి సోపానాలైన ...పాఠశాల తరగతి లను ఆప్యాయంగా కలతిరిగి... ఆ పాత మధురానుభూతిని మరొక్క సారి... గుర్తుకు తెచ్చు కుంటు బరువైన హృదయంతో....వెనుదిరిగాను...