అత్తమ్మ - రాము కోలా దెందుకూరు

Attamma

హాలో...లో శ్రీవాత్సవ్ గారు ఉన్నారా... నేను ....... మాట్లాడుతున్నాను. మీ.... ఈ రోజు ఉదయం.... ..... అవతలి వైపు నుండి వినిపిస్తున్న మాటలు రమణి గుండె వేగాన్ని రెట్టింపు చేస్తుంటే... నిస్సహాయంగా కుర్చిలోకి జారిపోయింది. "ఎలా!" "సమయానికి శ్రీవారు కూడా ఇంట్లో లేరు" "ఎవ్వరిని అడగాలో !" "ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో. రమణి చేతిలోని మొబైల్ నుండి ఎందరికో కాల్స్ బుల్లెట్ లా దూసుకు పోతున్నాయ్. ఇప్పటి పరిస్థితుల్లో ....సారీ ..... లేదు ..ఏమాత్రం అవకాశం లేదురా.. ..... సారీ..నేను ఏమీ చేయలేను. .... మొన్ననే మాప్రేండ్ అడిగితే... ..... అసలే మొన్నటి వరకు లాక్ డౌన్. ..... సమాధానాలు వింటూ... రెండు చేతుల్లో ముఖం దాచుకుని వస్తున్న కన్నీటిని అపుకునే ప్రయత్నం చేస్తుంది రమణి. "అమ్మ...రమణి... కాస్త ఆ ట్యాబ్లెట్లు మంచినీళ్ళు అందిస్తావా" అంటున్న అత్తగారి మాటలకు కోపాన్ని దిగ మ్రింగుకుంటూ.. "ఎవ్వరు ఏమౌతున్నా ... తనకు మాత్రం అన్నీ టైంకు అందించాలి. నా కర్మ .." అనుకుంటూ..అత్తగారి గది వైపు నడిచింది రమణి. ***** తనకు తెలిసిన స్నేహితుల్ని..అడిగి చూసింది రమణి శ్రీవాత్సవ్ ఫోన్ అవుటాఫ్ కవరేజి వస్తుంది. "ఎలా..." "ఏం చేయాలి.భగవంతుడా ఏదైనా మార్గం చూపించు.." వేడుకుంటుంది రమణి...తల దించుకుని. తన ముందు రెండు పాదాలు కనిపించడంతో తల ఎత్తిచూసింది . ఎదురుగా అత్తగారు.. "ఈవిడ గారికి ఏ అవసరం వచ్చిందో సరాసరి బెడ్ రూం లోనికి వచ్చేసింది.." అనుకుంటూ. నిర్దాక్షిణ్యంగా "ఏం కావాలి తమరికి" తనలోని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అడిగేసింది. ..... "నాకేమీ వద్దమ్మా!" "ముందు ఈ డబ్బులు తీసుకుని హాస్పిటల్ దగ్గరకు త్వరగా వెళ్ళు.." "అక్కడ మీ అమ్మగారికి..." ఇక మాట్లాడ లేక పోయింది వర్దనమ్మగారు.. రమణి ఆశ్చర్యంగా వర్దనమ్మగారి వైపు చూసింది. "ఈ విషయం మీకు..ఎలా తెలుసు" అనే ప్రశ్నార్థకంగా "నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ నేను రిసీవ్ చేసుకున్నాలే.." అన్నది వర్దనమ్మగారు. "కానీ..కానీ..మీ దగ్గర ఇంత డబ్బు..ఎలా" "కంటి ఆపరేషన్ కోసం , నెల నెలా వచ్చే పింఛన్ డబ్బుల్లో కొంత కూడబెట్టి.."మాట పూర్తి కాలేదు. వర్దనమ్మగారి పాదాలపై వాలిపోయింది రమణి. "ఏ రోజు మిమ్మల్ని అత్తగారు అనే గౌరవంతో చూడలేదు.నన్ను క్షమించండి.. " "నీది చిన్నతనం నేను అర్దం చేసుకోగలను." "ముందు డబ్బులు తీసుకుని హాస్పిటల్ దగ్గరకు వెళ్ళిరా.." అంటున్న మాటలు పూర్తి కాలేదు. "లేదు అత్తయ్యా!" "ఇద్దరం కలిసే వెళ్దాం." "మీరు కూడా తోడు ఉంటేనే నాకు ధైర్యం..." అంటూ వర్దనమ్మగారిని అల్లుకు పోయింది రమణి. ఆత్తమ్మలో అమ్మను చూసుకుంటూ. *శుభం*

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు