నిప్పులు పోసుకుంది! - రాముకోలా.దెందుకూరు

Nippulu posukundi

రెండు బక్కెట్లు నీళ్ళు ముఖం మీద చల్లిన తరువాత బిత్తర చూపులు చూస్తూ కన్నులు తెరిచింది శకుంతల. "ఏమైంది !పిన్ని గారు ." ముఖంలో ముఖం పెట్టి అడుగుతున్న పంకజాక్షిని చూస్తూ.మరోసారి పడిపోయింది శకుంతల. శకుంతల పడిపోవడానికి ఓ బలమైన కారణం ఉంది.అదే ఈ కథకు ప్రాణం. ***** "పిన్నిగారు పిన్నిగారు " అనే ఎదురింటి పంకజాక్షి గొంతు ఫైరింజన్ గంటాలా వినిపించడంతో ,పరుగులాంటి నడకతో ఇద్దరి మధ్యన ఉండే గొడ దగ్గరకు వచ్చింది శకుంతల. "ఏం వార్త మోసుకొచ్చావో త్వరగా చెప్పు !" ఉత్సాహంగా అడిగింది శకుంతల "అదే! మాకు ఎదురుగా ఉంటుందే టక్కులాడి వనజ,ఉదయం ఏం చేసిందో తెలుసా పిన్నిగారు? బుగ్గలు నోక్కుకుంటూ మరో చేయి ఊపుకుంటూ చెపుతుంది పంకజాక్షి. ఇదేదో మంచి ఇంట్రెస్టింగ్ వార్తే అనుకుంది శకుంతల. "ఏదో చేసే ఉంటుందిలే!లేక పోతే నువ్వు ఇట్లా నాకోసం వేస్తావా ఏంది.? "చెప్పు చెప్పు ఏం చేసిందో! అడిగింది శకుంతల. "రాత్రంతా కష్టపడి ఇంతవరకు మన వీధిలో ఎవ్వరూ వేయని ముగ్గు మా ఇంటి ముందు వేసుకుంటే, కళ్ళల్లో నిప్పులు పోసుకుంది ఆ ఎదురింటి వనజ. "ఉదయమే నే వేసిన ముగ్గు,చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంది. తిట్టుకుంటూ ముఖం మీదే తలుపు వేసుకుంది , కసిగా చెప్పింది పంకజాక్షి. "కుళ్ళు!నీ ముగ్గు చూసి ఓర్వలేక అలా చేసి ఉంటుంది." "మరి నువ్వు ఊరుకున్నావా! నాలుగు దులిపేయకపోయావా!..అనేసింది శకుంతల. అదే అనుకున్నా! పిన్నిగారు. కాలనీలో పెద్ద తలకాయ మీరే కదా! చూసి ఓ మాట అనేస్తే !ఇక నా కోపం ఎలా ఉంటుందో తనకు చూపిస్తా!" "రండి రండి చూద్దురుగాని " "హమ్మయ్యా!ఈ పూటకు మంచి కాలక్షేపం" అనుకుంటూ, "సరే వస్తున్నా పదా"చీర కుచ్చిళ్ళు కాస్త పైకి లేపుకుని హంసలా నడుచుకుంటూ పంకజాక్షి వాటా వైపు వస్తుంది కుంతల. **** ఏమాటకామాటే చెప్పుకోవాలి !నీలా కలిసిపోయే మనస్తత్వం అంటే నాకు చచ్చే అంత ఇష్టం వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా కదా నీ అనకువ,వినయం.. "ఎందురింటి ఆవిడ దగ్గర మచ్చుకైనా కానరాలేదు." "తను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందనే టెక్కు అనుకుంటా" "అయినా నీ ఇంటి ముందు నీకు నచ్చినట్టు ముగ్గు వేసుకుంటే తనకెందుకో! పదా!ఇద్దరం కలిసి కడిగేద్దాం.పంకజాక్షితో కలిసి నాలుగు అడుగులు వేసిందో లేదో. ఇంటి ముందు కనిపించిన ముగ్గు చూసి.. కెవ్వ్..మనే కేకపెట్టి పడిపోయింది శకుంతల.. రెండు బక్కెట్లు నీళ్ళు ముఖం మీద చల్లిన తరువాత బిత్తర చూపులు చూస్తూ కన్నులు తెరిచింది శకుంతల. "ఏమైంది !పిన్ని గారు ." ముఖంలో ముఖం పెట్టి అడుగుతున్న పంకజాక్షిని చూస్తూ.మరోసారి పడిపోయింది శకుంతల. అర్దగంట తరువాత "చూసారా పిన్నిగారు మీరు కూడా ఎంత షాకైయ్యారో! నా ముగ్గు చూసి." కళ్ళు గుండ్రంగా తిప్పుతున్న పంకజాక్షిని చూస్తూ. "ఇది ముగ్గా!అడగలేక అడిగింది శకుంతల. "అవును పిన్నిగారు!దిష్టి తగలకుండా,ఇంటి ముందు ఇలా వేయాలని నిన్ను కలవచ్చింది" "నీ తెలివి కాకులెత్తుకపోను! మనుషుల్ని చంపేలావున్నావ్!కదే? ఎవరైనా ఇంటి ముందు రంగురంగులతో పుర్రె ఎముకల బొమ్మ ముగ్గేసుకుంటారా! నీ తెలివి పిల్లులు తినిపోను" "ఇక నా వల్ల కాదు! నిన్ను నువ్వే తిట్టుకో " అనేసి తన ఇంటి వైపు వెళుతుంది శకుంతల. "పిన్నిగారు కూడా కళ్ళలో నిప్పులు పోసుకుంది నా ముగ్గు చూసి" అనుకుంటూనే తన ఇంట్లోకి వెళ్ళిపోయింది పంకజాక్షి. 🙏శుభం.🙏

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు