సీతయ్య! ఈ పేరు మా దెందుకూరులో తెలియని వారుండరు . కంటి చూపు లేకున్నా ! ఊరు మొత్తం కలియ తిరుగుతూ,ఎవ్వరు పలకరించినా తిరిగి పేరుతోనే సంబోధిస్తూ ఆశ్చర్యం పరుస్తాడు. పొరుగున ఉన్న మధిరలో దుకాణాలు దగ్గర ఇచ్చింది తీసుకోవడం, తిరిగి సాయంత్రంకు సత్రం చేరుకోవడం. వచ్చిన డబ్బులు లెక్కపెట్టడం, పదిలంగా దాచుకోవడం అతని దిన చర్య. చూపు కనిపించకున్నా సినిమాకు వెళ్తూ వుంటాడు.. "నీకు కనిపించదు కదా సీతయ్య!అంటే కథ అర్థమౌతుంది కదా! పాటలు మాటలు విని తెలుసుకుంటా "అంటాడు నవ్వుతూ.. పైసా పైసా చాలా జాగ్రత్తగా దాచుకో వాడు సీతయ్య అలవాటు. ఎవ్వరూ కనిపెట్టారో ఏమో కానీ ! సీతయ్య డబ్బులు తెలివిగా కాజేసారు. సీతయ్య అధైర్య పడలేదు. ఎప్పటిలాగే ఉదయం ఊరులో తిరి వచ్చింది లెక్కెసుకుని దాచుకోవడం జరుగుతునే ఉంది. తన డబ్బులు ఎవ్వరో కాజేసారని ఎవ్వరికీ చెప్పుకోలేదు. నాలుగు రోజుల తరువాత "ఎం సీతయ్యా! దిగాలుగా కనపడుతున్నావ్ ఏంది సంగతి.!" అని పలకరించాడు మంగయ్య! సీతయ్య కు వెంటనే ఆలోచన తట్టింది. ఎవ్వరూ తనని ఇలా అడగలేదు .. "తన డబ్బులు ఎవ్వరో కాజేసారని ఎవ్వరికీ తెలియదు." "మరి నేను దిగాలుగా ఉన్న సంగతి ఇతనికి ఎలా తెలిసింది"అనుకున్నాడు సీతయ్య! "ఏం లేదు మంగన్న! సాయంత్రం కొంత డబ్బులు రావాల్సింది ఉంది. మరికొంత ఒక చోట దాసి ఉంచా.!" "వచ్చే డబ్బులు దాచినవి కలిపితే పదివేలు దాకా అవుతాయి." "కానీ ఒక వంద తక్కువ అవుతుంది.ఎవ్వరిని అడగాలా అని ఆలోచిస్తున్నా!"అన్నాడు. "ఓరోరి! సీతయ్య దానికేముందిలే నేనిస్తా! తరువాత నాకు ఇచ్చేయ్ ,జాగ్రత్తగా దాచుకో ఎవ్వరైనా కొట్టెస్తారు "అన్నాడు మంగయ్య. "పర్వాలేదులే మంగయ్య! ఇక్కడే దగ్గరలో ఓ చోట దాస్తున్నా!రేపు ఉదయం ఊరు వెళ్ళి రావాలి. వచ్చిన డబ్బులు కూడా అక్కడే దాచేస్తాను.ఇబ్బంది లేదులే "అన్నాడు. మంగయ్య మనసులో అనుకున్నాడు, తాను డబ్బులు తీసుకోవడం ఇంకా సీతయ్య తెలుసుకోలేదు. సాయంత్రం అక్కడ డబ్బులు కనిపించకపోతే తెచ్చినవి పెట్టాడు.. సీతయ్య కంటే ముందు తీసిన డబ్బులు అక్కడ పెట్టాలి. రేపు ఎలాగూ మొత్తం లేపేయవచ్చు అనుకున్నాడు మంగయ్య.. ఎవ్వరూ చూడకుండా తాను దొంగిలించిన డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మొత్తం కలిపి లేపేయవచ్చు అనుకుంటూ. ఉదయమే సీతయ్య అక్కడ పెట్టిన డబ్బులు తీసుకుని తన సంచిలో దాచుకున్నాడు.తెలివిగా. దొంగ ఆశను తను తెలివిగా మలుచుకుని. కంటి చూపులే కున్నాం లౌక్యంగా ఆలోచించేలా నేర్పరితనం సీతయ్య లో ఉంది.
🙏శుభం🙏