మంగ కాదు మాణిక్యం - కందర్ప మూర్తి

Manga kaadu manikyam

అగ్రహారం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న మంగను తల్లి రమణమ్మ కూలి పనులు చేస్తూ చదివిస్తోంది. భర్త రిక్షా తొక్కుతు తాగుడు అలవాటై యాక్సిడెంట్లో చనిపోతే చదువు పట్ల కూతురి శ్రద్ద చూసి బడికి పంపిస్తోంది. చింపిరి జుత్తు చిరిగిన లంగా జాకెట్టుతో బడికి వచ్చే మంగను చూసి తరగతి ఉపాధ్యాయురాలు జానకి మనసు కరిగింది. మంగ కుటుంబ నేపద్యం ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ప్రతి పండక్కి కొత్త బట్టలతో పాటు చదువుకి కావల్సిన పుస్తకాలు వస్తువులు సమకూర్చేది.మంగ నిరక్షరాస్య కుటుంబం లో పుట్టినా చదువంటే శ్రద్ద కనబరిచేది. అది గమనించిన జానకి టీచర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని మంగను తీర్చిదిద్దేది.తన తెలివి చురుకుదనంతో జానకి టీచర్ ప్రొత్సాహంతో ప్రతి తరగతిలో మంచి మార్కులతో పాసవుతు ఐదవ తరగతి పూర్తి చేసింది. ఉన్నత పాఠశాలలో చదవాలంటే పక్క ఊరికి వెళ్లవల్సి ఉంటుంది. రమణమ్మకి కూతుర్ని హైస్కూలు చదువుకి పొరుగూరు పంపడం ఇష్టం లేదు. మంగను చదువు మాన్పించి తనతో పాటు కూలి పనులకు తీసుకెళ్లడానికి నిశ్చయించింది. మంగకు మాత్రం పక్క ఊళ్లో కెళ్లి ఉన్నత పాఠశాలలో చదువు కోవాలని ఉత్సాహంగా ఉంది. తల్లికి నచ్చచెప్పి ఎలాగైనా హైస్కూలుకి పంపేలా చూడమని జానకి టీచర్ని వేడుకుంది మంగ. చదువులో చురుకైన మంగను ఇలా మట్టిలో మాణిక్యంలా పల్లెటూర్లో మరుగున ఉండ కూడదనుకుంది జానకి టీచర్. రమణమ్మకు చదువు విలువ ఏమిటో తెలియ చెప్పి విధ్యాధి కారి గారితో రమణమ్మ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మంగ చదువు లో చురుకైన తెలివైన విధ్యార్థని వివరించి చెప్పి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం,ఉండటానికి వసతి గృహంలో ఏర్పాటు చేయించింది. మంగకు కావల్సిన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది. మంగ తన చురుకుదనం చదువు పట్ల చూపే శ్రద్ద గమనించిన గురుకుల అధ్యాపకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఊరి నుంచి రమణమ్మ వీలున్నప్పుడల్లా పట్నం వచ్చి మంగను ఆమె రూపురేఖలు చూసి మురిసి పోయేది.అలాగే జానకి టీచర్ ప్రోత్సాహం మంగను మరింత ఉత్సాహంగా ఉంచేది. మంగ ప్రతి తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసవుతు పదవ తరగతి పబ్లిక్ పరిక్ష ల్లో జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణి విధ్యార్థినిగా వచ్చింది. ఇప్పుడు మంగ రూపురేఖలు నడవడిక మారిపోయాయి. విద్యతో పాటు వినయం నమ్రత తో చూసేసరికి సదభిప్రాయం కలిగేలా ఉంది. జానకి టీచర్ ఆమెకు మార్గదర్సకంగా ఉంటూ భవిష్యత్ తీర్చిదిద్దుతోంది. మంగ జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణిలో టెన్తు పాసయినందున కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం వారి కాలేజీలో ఉచిత సీటుతో పాటు ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ మంజూరైంది. మంగ చదువులోనే కాకుండా ఆట పాటల్లో రాణిస్తూ మంచి ర్యాంకుల్లో పాసవుతు జూనియర్ కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీలో చేరి డిగ్రీ ఫైనల్ స్టేట్ ఫస్టు ర్యాంకులో వచ్చి అందరి మన్ననలూ పొందుతోంది. రమణమ్మ కూతురి ఉన్నతి చూసి పొంగిపోయింది.టీచర్ జానకమ్మ మాట వినకపోయి ఉంటే కూతురు తనలాగే మట్టి పనులు చేసుకుంటూ బతికేదని బాధ పడసాగింది. డిగ్రీ స్టేట్ ఫస్ట్ ర్యాంకులో పాసయిన మంగ జానకి టీచర్ సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్సు పరిక్షలు రాసి సెలక్టయి రెసిడెన్షియల్ పాఠశాల వార్డెన్ గా ఉధ్యోగం సంపాదించి తనలాంటి వెనకబడిన గ్రామీణ యువత చదువు కోసం కృషి చేస్తోంది. మట్టిలో పడున్న తన జీవిత గమనాన్నే మార్చివేసిన జానకి టీచర్ రుణం తీర్చలేనిదని కృతజ్ఞతలు తెలియ చేసుకుంది మంగ ఉరఫ్ మంగతాయారు. * * *

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు