దూర దృష్టి - కందర్ప మూర్తి

Dooradrusti

పద్మనాభం లైఫ్ఇన్సూరెన్సు డెవలప్ మెంటు ఆఫీసర్. తండ్రి లోకనాథం నూరిపోసిన జీవనసూత్రాల్ని బాగా వంట పట్టించుకున్నాడు. బేంకు గుమస్తాగా ఉద్యోగం చేసి రిటైరై స్వర్గస్తులైనా ఆయన నేర్పిన బ్రతుకు తెరువు మార్గం బుర్రలో బాగా నాటుకు పోయింది. నాన్న ఏ పని చేసినా ముందు చూపుతో చేయాలనేవారు. వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు వెనక వేయాలంటారు. తనవెంట బజారుకి తీసుకెల్తే వస్తువు బేరమాడి నాణ్యత చూసి కొనాలనేవారు. అమ్మ కి ఇంట్లో ఖర్చులు పాదుపు పాఠాలు చెప్పే వారు. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతానికి ఏదో ఒక బంగారు వస్తువు కొని పెట్టేవారు. పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమీ లేక పోయినా తన ఉద్యోగ సంపాదనతో ఊళ్ళో ఎకరం భూమి కొనగలిగారు. పద్మనాభం డిగ్రీ పూర్తయిన తర్వాత జీవిత భీమా కంపెనీలో జాబ్ సంపాదించాడు.ఊళ్ళో తండ్రి కొన్న ఎకరం భూమి అమ్మేసి పట్నంలో ఇండిపెండెంటు ఇల్లు కట్టించాడు.పెళ్ళయి అమ్మాయి పుట్టినా అవే పొదుపు మార్గాన్ని తుచ తప్పకుండా పాటిస్తున్నాడు.నెలలో చివరి ఆది వారం వస్తే మొత్తం నెల బడ్జెట్ లెక్కలు కడతాడు.స్కూటర్ లీటర్ కి ఎంత మైలేజి ఇస్తోందో ఎంత పెట్రోల్ ఖర్చు వచ్చిందీ వివరాలు డైరీలో నోట్ చేస్తాడు. పండగలప్పుడు భార్యకి కూతురికీ బట్టలు కొనేటప్పుడు డిస్కౌంటు ఆఫర్ వివరాలు చూసి కొంటాడు. అలా ఆఫర్ లో వచ్చిన గోడగడియారం హాల్లో చూసి మురిసిపోతూంటాడు. సాదారణంగా చివరి ఆదివారం ఇంటి బడ్జెట్ వివరాలు చూసే భర్త మొదటి ఆదివారం సీరియస్ గా ఏదో రాస్తుంటే ఆశ్చర్యంగా హాల్లో కొచ్చి " ఏం టండీ, ఈ ఆదివారం హాయిగా న్యూస్ పేపరు చదువుకో కుండా ఉదయాన్నే అమ్మాయి లావణ్య బర్త్ సర్టిఫికేట్ జాతక చక్రం దగ్గరేసుకుని కూడికలు తీసివేతల లెక్కలు కడుతున్నారు. ఇప్పుడు దాని వయసు మూడేళ్ళేగా. నర్సరీ స్కూల్లో అడ్మిషన్ చూస్తున్నారా?" కాఫీ కప్పు అందిస్తూ సోఫొలో పక్కన కూర్చుంది శరణ్య. " ఈ రోజు న్యూసు పేపరు చూసే ఈ పీకులాట అంతేకాని దానినర్సరీ స్కూలు ఎడ్మిషను కోసం కాదు. దేశంలో ప్రతి స్టేట్ లోనూ ఆడపిల్లల సంఖ్య తగ్గి పోతోందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలోను గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్ల పుట్టిందంటే హడలి పోతున్నారు. అందుకు సామాజిక సమస్యలే కారణం. పూర్వపు రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటే మహలక్ష్మి వచ్చిందని సంబరపడేవారు. ఈ రోజుల్లో శిసువు ఆడపిల్లంటే గుదిబండగా భావిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో కడుపులో పిండం స్కేనింగు ద్వారా ఆడశిసువని తెలియగానే అబార్షను చేయిస్తున్నారు.అందువల్ల అబ్బాయి అమ్మాయి ల మధ్య సమతుల్యం తగ్గి ఆడపిల్లల సంఖ్య క్షీణస్థోంది.ముంద ముందు వివాహాలకు అమ్మాయిలు కరవవుతారని అంచనాలున్నాయి. అప్పుడు తల్లి తండ్రులే పెళ్లి కొడుకుల బయోడేటాలు పట్టుకుని మ్యారేజి బ్యూరోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రస్తుతం వరకట్న నిషేదమున్నా ఆ దురాచారం చాటుమాటుగా ఏదో రూపంలో జరుగుతూనే ఉంది. భవిష్యత్తు లో కన్యాశుల్కం ఇచ్చుకునే రోజు లొస్తాయి. కనక ఇప్పటి నుంచి అమ్మాయి లావణ్య చదువుకి బట్టలు తిండికీ ఎంత ఖర్ఛయేదీ లెక్కలుకట్టి అమ్మాయి పెళ్ళి నాటికి మొత్తం ఎంత ఖర్ఛు పెట్టిందీ మగ పెళ్ళి వారి నుంచి డిమాండ్ చెయ్యాలి.' వివరంగా చెప్పాడు బడ్జెట్ పద్మనాబం.భర్త చాదస్తానికి నవ్వుకుంది శరణ్య. * * * " రండి సార్ రండి. 'భవిష్యవివాహ వేదిక'కు సుస్వాగతం.మా మ్యారేజ్ బ్యూరోకి అన్ని రాష్ట్రాలలో బ్రాంచీ లున్నాయి.అన్ని వర్గాల వారికి వారి తాహతును బట్టి సంబంధాలు సెటిల్ చేస్తాము.మా వివాహ వేదిక లిస్టులో ఐదు సంవత్సరాల అమ్మాయి అబ్బాయి లకు ఇంటర్ నెట్ లో రిజిస్ట్రేషన్ చేసి మ్యారేజీలు సెటిల్ చేస్తాము. పూర్తి బయోడేట బర్త్ సర్టిఫికేటు జాతకం ప్రస్తుత ఫోటో తప్పనిసరి.ఎడ్వాన్సు వెయ్యి రూపాయలు చెల్లించి రెజిస్టర్ చేయించుకోవాలి. సమయానుకూలం రెన్యువల్ ఉంటుంది. వివరాలు సిస్టంలో ఫీడ్ అవుతాయి. సంస్థ రూల్సు రెగ్యులేషన్లు ఫాలో అవాలి. మరొక విషయం అప్పటి పరిస్థితులను బట్టి అమ్మాయిల క్వాలిఫికేషన్లు చేసే ఉద్యోగాల ననుసరించి అబ్బాయిల తల్లి తండ్రులు కోడ్ చేసే బిట్ ని చూసి ఎవరి వేలం పాట ఎక్కువగా ఉంటే వారికి సంబంధం ఫిక్సవుతుంది. ప్రస్తుతం లక్షల రూపాయలు ఖర్చు చేసి భవిష్యత్ పెద్ద వయసులో వచ్చే రోగాలను నయం చేసుకోడానికి ప్రసవ సమయంలో పురిటి పసికందు బొడ్డుతాడు నుంచి మూలకణాలు (స్టెమ్ సెల్సు )సేకరించి లిక్విడ్ నైట్రేట్లో ఫ్రీజ్ చేసి స్టెమ్ సెల్ బేంకులో ఉంచి జాగ్రత్తగా ఉంచి నట్టు మా ముందు చూపు బాలబాలికల వివాహ వేదిక స్థాపించడమైంది. నా తదనంతరం ఈ బ్యూరో నడపడానకి నా కుమారుడు త్రిలోకానికి శిక్షణ ఇస్తున్నాను. భవిష్యత్ లో అంటే 2050 సంవత్సరానికి ఇతర గ్రహాల మేరేజ్ బ్యూరోలతో లింకులు ఏర్పడి బుకింగుల ఉంటాయని భవిష్య వాణి కంప్యూటర్ డాటా చెబుతోంది. కాబట్టి ఇప్పటి నుంచే రిజర్వేషన్లు చేసుకున్న వారికి కన్సెషను ఉంటుంది. అప్పటి పరిస్థితులను బట్టి మేరేజి సెటల్ మెంటుకి పెర్సెంటేజి ఫిక్సవుతుంది . అమ్మాయి ఫోేటోతో పాటు పుట్టుమచ్చలు విేవరాలు అప్లికేషన్లో నింపిఇవ్వండి. నేషనల్ ఇంటర్నేషనల్ మ్యారేజి బ్యూరోలతో లింకులు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇండియన్ యూత్ ఉద్యోగ వ్యాపార రంగాల కెళ్ళి విదేశాల్లో స్థిర పడతారు. కాబట్టి మీ అమ్మాయి లావణ్య పెళ్ళి వయసు కొచ్చేసరికి పెళ్ళికొడుకులు క్యూ లు కట్టి డాలర్లతో మీ బడ్జెట్ కి తగ్గ సంబంధం వస్తుంది. పద్మనాభం గారూ,అడ్వాన్సు కట్టి మీ అమ్మాయి పేరు రిజిస్ట్రేషన్ చేయించు కోండి. శుభస్య శీఘ్రం. *** *** ***

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు