మోస్ట్ వాంటెడ్..! - రాము కోలా.దెందుకూరు.

Most wanted

ఇరువై సంవత్సరాల క్రితం "మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ భీజూ" ఎన్కౌంటర్ తరువాత , డ్యూటీ కి రిజైన్ చేసిన పోలీసు ఆఫీసర్ అడ్రస్ వెతుకుతూ బయలు దేరింది తృష్ణ. ***** లోపలికి వస్తూనే! గున్న మామిడి చెట్టు దగ్గర ఒద్దికగా కూర్చున్న అమ్మాయిని చూస్తూ! "ఖాసిం!ఎవ్వరు తను",అడిగాడు మార్తాండ్. ఉదయం జాగింగ్ నుండి తిరిగి ఇంటి లోపలకు వస్తునే మార్తాండ్. "సార్! తమరిని కలవాలని హైదరాబాద్ యూనివర్సిటీ నుండి వచ్చింది సర్! . రిటైర్డ్ కానిస్టేబుల్ ఖాసిం, వినయంగా చెప్పాడు. "అవునా! ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ని కలవాలని వచ్చిందంటే ! "ఏదో బలమైన కారణమే ఉండివుంటుంది." "లోపలకు తీసుకు వచ్చేయ్!" "తనకు బిస్కెట్స్ ,కాఫీ ఏర్పాట్లు చూడు." "ఈలోగా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా! లోపలకు నడిచాడు మార్తాండ్." అలాగే సర్! "ఇదిగో పాపా! సార్!లోపలకు రమ్మంటున్నారు.వచ్చేయ్ గార్డెన్ దగ్గర ఎదురు చూస్తున్న అమ్మాయిని పిలిచాడు ఖాసిం. "భుజానికి వ్రేలాడుతున్న బ్యాగ్ సరి చేసుకుంటూ ఇంటి లోపలకు అడుగు పెట్టింది తృష్ణ. ఖాసిం తెచ్చిన బిస్కెట్స్,కాఫీ అందుకుని పక్కన పెట్టి ఇంటిని పరిశీలనగా చూసింది. విశాలమైన హాల్!ప్రక్కనే చిన్న బెడ్ రూమ్. మరో ప్రక్కన పూజా గది,వంట గది. హాల్లో నిలువెత్తు చిన్నపాప పుటో, చిరునవ్వులతో కనిపిస్తుంది పుటోను తదేకంగా చూస్తూండి పోయింది తృష్ణ. "నా నుండి ఏదో తెలుసుకోవాలని హైదరాబాద్ నుండి వచ్చారని మా ఖాసిం చెప్పాడు" మీకు ఎటువంటి సహాయం కావాలి" కాస్త దగ్గరగా! ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుంటూ అడిగాడు మార్తాండ్. "చిరునవ్వులతో.చేతులు జోడించి నమస్కరిస్తూ సార్!నా పేరు తృష్ణ. ఉస్మానియా క్యాంపస్ లో "హ్యూమన్ రైట్స్"అనే అంశం పైన పి.హెచ్.డి చేస్తున్నాను. "పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన మీ దగ్గర, కొన్ని నిజాలు తెలుసుకుందామని వచ్చాను, "వెరీ గుడ్ సబ్జెక్ట్, "హ్యూమన్ రైట్స్" ఇది తెలుసుకోవాలనే ప్రయత్నమే చేయని యువతకు నువ్వు ప్రతినిధిగా వచ్చావా? లేక తెలుసుకుని నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నావా? "అనే దాని పైన నేను నిజాలు చెప్పాలో లేదో ఆధారపడి ఉంటుంది." "మీరు నిజాలు మాత్రమే చెప్పుతున్నారు అనిపిస్తే? మీరు గుమ్మం లోపలకు అడుగు పెడుతూ ,ఎదురుగా ఉన్న పుటోలో నవ్వును చూసారు కదా! అదే నవ్వు నాలో చూడవచ్చు. "ప్రామిస్"చెప్పి మార్తాండ్ వైపు చూసింది తృష్ణ. "తృష్ణ నుండి ఇటువంటి సమాధానం వస్తుందనుకోలేదు మార్తాండ్. నిజంగా "హ్యూమన్ రైట్స్"పైన నీ.హెచ్.డి యేనా?లేక! నాపైన పరిశోధన చేస్తున్నావా" " ఇంతకూ నీ మనసులోని ప్రశ్నలు ఎంటో? నవ్వుతూ అడిగాడు మార్తాండ్. "మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడగాలని వచ్చాను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఎందరో నక్సలైట్స్ ను ఎన్కౌంటర్ చేసిన మీరు, "మోస్ట్ వాంటెడ్ నక్సలైట్స్ "భీజు"ను ఎన్కౌంటర్ చేసిన తరువాత,సడెన్ గా ఉద్యోగం వదిలేసారు. ప్రభుత్వం మీకు ఇచ్చిన ఎన్నో నగదు పురస్కారాలు వెనక్కు ఇచ్చేసారు! "అనాధశరణాలయాలు నడుపుకుంటూ పాత జీవితానికి దూరంగా జీవిస్తున్నారు." కారణం తెలుసుకోవచ్చా!" కూల్ గా అడిగింది తృష్ణ. "ఇంత వరకు ఎవ్వరూ అడగని ప్రశ్న! తృష్ణ నోటి నుండి. "తెలుసుకుని ఎం చేస్తావ్" "నిజం తెలుసుకున్నాననే తృప్తి నా కోసం" సరే!చెపుతాను!నీకోసం కాదు. నా తృప్తి కోసం. "ఇన్ని రోజులు గుండెల్లో దాచుకున్న నిజం, 1972 ఫిబ్రవరి 11వ తారీఖు విపరీతమైన వర్షం, దంతెవాడ అడవుల్లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయనే సమాచారం అందుకుని ,మా గ్రైహౌండ్ టీమ్ తీసుకుని వెళ్లి నలువైపులా దాడి చేస్తూ,మిమ్మల్ని మేము కాపుడుకుంటూ, నక్సలైట్స్ పైన ఎదురు దాడి చేస్తూ దూసుకుపోతున్న సంఘటనలో అటు నక్సలైట్స్,ఇటూ పోలీసులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ లో ప్రాణాలు వదిలిన వారి డెడ్ బాండీలకు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ లో పోస్ట్ మర్తం పూర్తి అయిన తరువాత. బాడీ ఐడెంటిఫికేషన్ లో నాకు భారీ షాక్ తగిలింది.చనిపోయిన వారిలో "భీజు"కూడా ఉందని తెలిసి. దొరికిన డైరీల్లో "భీజూ" డైరీ ఒకటి తను ఇలా వ్రాసుకుంది.. "ఏదో ఒక రోజు తను ఎన్కౌంటర్ లో చనిపోక తప్పదని.తన పై ప్రకటించిన రివార్డులు .అనాధ పిల్లకోసం వాడాలని,తను ఎక్కడెక్కడ డబ్బు బంగారం దాచిన వివరాలు విపులంగా వ్రాసింది. ఏ ఆశయంతో ఉద్యమంలోకి వచ్చానో!అది నెరవేర్చనో లేదో!నన్ను నేను ప్రశ్నించుకోని క్షణమే లేదు..అని. ఇంతగా అలోచించిన "భీజూ"ను చూడాలను కున్నా!బాడీని చూసి ,తన చేతిపై నున్న పచ్చబొట్టు చూసి "కన్న కూతుర్ని ఎన్కౌంటర్ లో చంపిన కసాయి తండ్రిగా మిగిలిపోయా! "అందుకే తన కోరిక తీరూస్తూ!ఇలా. ఇది ఇంతవరకూ ఎవ్వరు అడగలేదు! నేను ఎవ్వరికీ చెప్పలేదు. నువ్వు అడిగి తెలుసుకుని ఎం చేయాలని. మార్తాండ్ తృష్ణ వైపు చూస్తూ అడిగాడు. "నా తల్లిని ఎన్కౌంటర్ చేసిన వ్యక్తి , ఓ కసాయి వాడా? లేక మానవత్వం ఉన్న వాడా? అని. "కసాయి వాడైతే ఎప్పటికి తాను ఒక పోలీసు అధికారే నా దృష్టిలో. తెలుసుకున్నాను... తృప్తిగా వెళ్ళిపోతున్నాను. ఇక వెళ్ళివస్తాను తాతగారు . తృష్ణ.చివరిలో మాటకు ఆశ్చర్యంగా చూసాడు మార్తాండ్. అలా ఆశ్చర్యంగా చూడకండి ! అవును తాతగారు!మీ స్వేచ కూతుర్ని నేనే! విస్మయంగా చూసాడు మార్తాండ్. ఏదో సాధించాలని ఉద్యమంలో చేరింది. లొంగి పోతున్నట్లు, జనజీవన శ్రవంతిలో కలసి పోవాలి అనుకున్నట్లు నాకు వర్తమానం పంపింది. ఈ లోగా ఎన్కౌంటర్ జరిగింది. తాను దాచిన బంగారం, డబ్బులు ఎక్కడో తెలియదు. ఎన్కౌంటర్ తరువాత మీరు అజ్ఞాతంలో కి వెళ్ళిపోయారు. అందుకే మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను! "బీజూ"మీ కూతురని ఒప్పుకుని మంచి పని చేసారు, లేకుంటే..మీ మనవరాలు కూడా ఉద్యమం బాట పెట్టవలసి వచ్చేది. సమాజంలోని కుళ్ళు చూడలేక. వెళ్లి వస్తాను తాతగారు!అంటూ బయటకు నడిచింది తృష్ణ. విస్మయంగా చూసాడు మార్తాండ్. ‌‌🙏🏼శుభం🙏🏼

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు