దహించుకుంటావా? - రాము కోలా.దెందుకూరు

Dahinchukuntaavaa

గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలౌతున్నా! ప్రశాంతంగా పైకి కనిపించే సహనం స్త్రీమూర్తి కి మాత్రమే ఆ భగవంతుడు ఇచ్చాడేమో! అప్పటి వరకు గానా భజానాలతో రచ్చరచ్చ చేసిన వరూధిని,చకచకా తన బ్యాగ్ సర్దుకుని కారులో వెళ్ళిపోతుంటే ,ఎందుకు వెళ్ళిపోతుందో అక్కడ ఉన్న ఎవ్వరికీ అర్థం కాలేదు. అమెరికా నుండి పదిరోజులు ముందుగానే వచ్చి అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకుని,అందరి దృష్టిని ఆకర్షించింది వరూధిని. అటువంటి కల్మషం లేని పిల్ల సడెన్ గా వెళ్ళిపోయింది అంటే !ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అనుకుంటూ, విషయం తెలుసుకు వస్తానని విడిది ఇంటి నుండి బయలు దేరింది కాత్యాయిని. మరో అర్దగంటలో పెళ్ళి కుమారుడు వచ్చేస్తాడు. రాగానే వరూధిని ఎక్కడా?అని అడుగుతాడు . ఇంటిలో ఒక ఆత్మీయురాలిగా కలిసిపోయింది కనుక.ముందుగా తననే అడగవచ్చు. ఈ రోజుల్లో అయిన వారే తోడుగా నిలవని పరిస్థితుల్లో, తన క్లాస్మేట్ పెళ్ళి దగ్గర ఉండి జరిపించాలని అమెరికా నుండి వచ్చిన అమ్మాయ్ ఇలా సడెన్ గా వెళ్ళి పోవడం కాత్యాయిని కి అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది ***** "ఏమ్మా! వరూధిని!" "ఇలా వచ్చేసావ్! ఎవ్వరైనా నిన్ను హార్ట్ చేసి ఉంటే వారి తరపున నేను క్షమాపన చెప్పుకుంటాను" "పెళ్ళికొడుకు కళ్యాణమండపం చేరుకుని ఉంటాడు." ".ఏదీ మనసులో పెట్టుకొని పసి హృదయం నీదని నాకు తెలుసు." "పదమ్మా!వెళ్దామ్..అనేసి గడ్డం పట్టుకుని బ్రతి మాలుతుంది కాత్యాయిని. "అయ్యో ఆంటీ! అటు వంటిది ఏమీ లేదు!.నేనే ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తే ఇలా వచ్చేసాను." "అర్ధగంటలో వచ్చేస్తాను.ముందు మీరు పదండి." "ఇద్దరం అక్కడ లేకుంటే పనులన్నీ అలాగే ఉండి పోతాయ్.." "వెళ్ళండి మీ వెనుకే నేవస్తాగా..!" వరూధిని తలవంచుకుని మాట్లాడుతుంటే ఏదో జరిగింది అనేది అర్థం చేసుకుంది కాత్యాయిని. అలా అని నిలదీసి అడగలేదు తను. "సరే! వరూధిని నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ,కానీ నువ్వు లేని పెళ్ళి మండపం తలచుకోవడం కాస్త కష్టంగా ఉంది , పెద్దమనసుతో అర్థం చేసుకుంటే చాలు." "పెద్దవారు అలా అనుకొకం3డి! "కాస్త ప్రెస్ అఫ్ అయి వస్తాను!ఎవ్వరీ అమ్మాయ్ అంటే! మీ కూతురు అని చెపితే నమ్మేలా తయారై రావాలి కదా! "ఒక్క అర్దగంటలో వచ్చేస్తాను ! ప్లీజ్ ఆంటీ" అంటున్న వరూధిని మాటలకు ఏమనాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కాత్యాయిని. ***** ఫోన్ రింగ్ అవుతుంటే వచ్చే దుఃఖం దిగమ్రింగుకుంటూ... హలో!ఆంటీ ...వస్తున్నా.. ఎలా ఉన్నాడు పెళ్ళికొడుకు.... మూహుర్త సమయం దగ్గర పడుతుంది ఆ పనులు చూసుకోండి. నే వస్తున్నా..పట్టు బట్టలు ..అన్నీ నేను తెచ్చిన బ్యాగ్ లో ఉంటాయ్.. దగ్గర ఉండి అన్నీ చూసుకోండి. నే వచ్చి వంకలు పెట్టెలా ఉండకూడదు.. సరేనా..! "అమ్మా వరూధిని ఇప్పటికే అబ్బాయి నిన్ను అడుగుతున్నాడు.త్వరగా వచ్చేయమ్మ.." "ఆంటీ!అక్కడే కళ్యాణమండపం లోనే ఉన్నానని చెప్పండి.తనని ఆట పట్టించాలని ముందుకు రావడం లేదని చెప్పండి." జారుతున్న కన్నీటిని తూడ్చుకుంటూ ఫోన్ కట్ చేసింది వరూధిని. ‌. ***** మెళ్ళిగా తెరుచుకున్న డోర్ దగ్గర కాత్యాయిని నిలబడి సూటిగా చూస్తుంది వరూధిని వైపు. "ఆంటీ మీరు ఏంటి ఇక్కడ!" "పెళ్ళి వారితో కలిసి వెళ్ళలేదా!" బలవంతంగా చిరునవ్వు అధరాలనై నిలుపుకుంటూ అడిగింది వరూధిని. "నీ దగ్గర ఒక సమాధానం తెలుసుకోవాలని ఆగిపోయాను." "ఎందుకు చేసావు ..ఇలా!" "నాకు అంతా తెలిసిపోయింది.." ఇక నువ్వు దాచాలని చూసి లాభం లేదు." నిన్ను నువ్వు దహించుకుంటూ,రహస్యం నీలో దాచుకుని నటిస్తూ ఉండగలవ్. ఇప్పటికైనా నీ నోటితో నిజం చెప్తవా! ఒక తల్లిగా అడుగుతున్నా.. ఇక తనని తాను నిభాయించుకోవడం వరూధిని కి సాధ్యం కాలేదు.వెళ్ళి కాత్యాయిని చేతుల్లో వాలిపోయింది. "ఆంటీ!.. "అక్కడ!అక్కడ!అమెరికాలో ఉదయం యాక్సిడెంట్స్ లో మా శ్రీవారు..." ఇక చెప్పలేక పోయింది వరూధిని.. విషయం విన్న కాత్యాయిని షాక్ అయింది. అంతగా అందరిలో కలిసిపోయిన పిల్లకు విధి వైధవ్యం లిఖించిందా? హాతవిధీ! అనుకుంటూ తలపట్టుంకుంది. "అందుకే నే కళ్యాణమండపం దగ్గరకు రాలేక పోయాను ఆంటీ !నన్ను క్షమించండి" వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి జరిపించి మంటపాలు,ఒక్క నిజం నీలో దాచుకుంటూ పెళ్ళి జరగడానికి నిన్ను నువ్వు దహించుకుంటూ దూరంగా ఉన్నావా! ఎంత గొప్ప మనసు రా నీది" మరింతగా దగ్గరకు హత్తుకుంది కాత్యాయిని . వరూధిని పసిపాపలా ఒదిగిపోయింది. 🙏 శుభం 🙏

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి