పిల్లల చెలగాటం - తల్లికి ఆరాటం - కందర్ప మూర్తి

Pillala chelagatam-Talliki aaraatam

మూర్తి గారి పాత పెంకుటింట్లో తిష్ట వేసుకుని బ్రతుకున్న షీలా పిల్లి అటక మీద పడుకుని కూనలకు పాలు ఇస్తూ గతం జ్ఞాపకం తెచ్చుకుంది. తల్లి తనని కని వదిలేస్తే , ముద్దుగా ఉన్నానని మూర్తి గారి కుటుంబ సబ్యులు చేరదీసి "షీల " పేరు పెట్టి రోజూ పాలు అన్నం పెట్టి పోషించి పెద్ద చేసారు. మూర్తి గారు పూర్తి శాకాహారైనా పండగ లప్పుడు పుట్టిన రోజు లపుడు నాకు ప్రత్యేకంగాపాలు మీగడ వెన్న కలిపిన పిండివంటకాలు తిని పించేవారు.ఇంట్లో విరిగిన పాలు ,ఈగలు గిన్నెలో పడ్డాయని ఆ పాలు నాకే ప్లాస్టిక్ గిన్నెలో పోసేవారు. నేను పూర్తిగా శాకాహారి కాకుండా అపుడపుడు మూర్తి గారి పాతసామాన్ల స్టోరులో ఎప్పటినుంచో కుటుంబాలతో నివాశముంటున్న మూషిక కుటుంబాల మూలంగా మాంసాహారం రుచి చూడగలుగుతున్నాను. ఆ ఇంట్లో నేను ముద్దుగా ఉండడానికి కారణం నా గోధుమరంగు చారల శరీరఛాయ,ముఖం మీద తెల్లనిమచ్చే.మూర్తి గారి ఐదు సంవత్సరాల మనవడికి నేనంటే ప్రత్యేక అభిమానం. నాకు మిల్కుబికీలు ,బ్రెడ్ టోస్టులు రిఫ్రష్ మెంటుగా వేస్తూండేవాడు. ఇలా తన చిట్టి కూనల్ని చూస్తూ ఆలోచనల్లో ఉన్న షీలా పిల్లికి గోడ కలుగులోంచి చిన్న చిట్టెలుక పిల్ల బుడి బుడి నడకతో వచ్చి పాలు తాగుతున్న కూనల తోకలతో కొంతసేపు ,నడుం మీద పాకి కొంతసేపు ఆడుతోంది.ఒక్కొక్కసారి కూనల ముందుకెళ్ళి వాటి మూతి నాకుతోంది.ఇంకొక సారి వాటి పొట్టల మీదకి ఎక్కినప్పుడు కూనలకు కితకితలు కలిగి పాలు తాగడం మాని చిట్టెలుక పిల్లని కాళ్ళపంజాలతో బంతిలా ఆడుకుంటున్నాయి. ఇటువైపు షీలా పిల్లి, కూనలు చిట్టెలుక పిల్లతో ఆటలు చూసి ముచ్చట పడుతూంటే గోడకున్న రంద్రం అవతలివైపు తల్లి చిట్టెలుక చంటిది కనిపించకపోతే ఎటుపోయిందోనని వెతుకుతు గోడకున్న చిన్న రంద్రం నుంచి లోపలికి తొంగి చూస్తే చిట్టిది అటక మీద షీలా పిల్లి కూనలతో ఆడుతూ కనబడింది. తల్లి ఎలక గుండె గుభేల్ మంది. తన చిట్టితల్లిని ఆ పిల్లికూనలు చంపి తినేస్తాయేమోనని బెంగ పట్టుకుంది.గోడ కన్నం చిన్నగా ఉన్నందున చిట్టిది దూరి అటు వెళ్ళిపోయింది. తను ఆ వైపు వెళ్ళడం కుదరదు. భయంగా దిగులుగా ఆవైపు పిల్లికూనలతో చిట్టితల్లి ఆటలు చూస్తూ , దాన్ని ప్రాణాలతో వెనక్కి ఎలా రప్పించడమా అని ఆందొళన పడుతోంది. కొద్ది సేపటి తర్వాత పిల్లి కూనలతో ఆడి అలసిపోయిన చిట్టితల్లి బుడి బుడి అడుగులేసుకుంటూ గోడ చిన్న రంద్రంలోంచి ఇటువైపు వచ్చే సింది. చిట్టితల్లిని చూసిన తల్లి చిట్టెలుకకి ప్రాణం లేచి వచ్చింది. తన బిడ్డ ప్రాణాపాయం నుంచి బయట పడిందని ఆనందించింది. * * *

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు